... ఏమంటారో? ఏమనుకుంటారో?
వంశీ కలుగోట్ల // ... ఏమంటారో? ఏమనుకుంటారో? //
****************************** ***************
నేను చిన్నపుడు, బహుశా దాదాపు 8 సంవత్సరాల వయసున్నపుడు అనుకుంటా ఒకరోజు పేపర్ లో ఒక వార్త చూశాను - నందికొట్కూరులో ఎవరో చెత్తకుండీలో పడేసిన పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్నది ఆ వార్త. చాలా హృదయవిదారకమైనది, కదిలించివేసింది ఆ వార్త. అది చూసిన చాలారోజుల వరకూ ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉండేది. వివాహేతర లేదా వివాహానికి పూర్వమే ప్రేమ పేరుతొ వంచించబడిన మహిళ, సమాజానికి/కట్టుబాట్లకు భయపడి ఆ బిడ్డను వదిలించుకుందేమో బహుశా. చాలా చాలా బాధతో పాటు, ఆలోచనకూ కారణమైంది. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మొదలైంది. చదువు కొంతవరకూ మేలేమో అనిపించింది, అంటే చదువుకుంటే అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో.
అయితే ఇపుడు కూడా జరుగుతున్న పలు ఘటనలు చూసిన/చదివిన తరువాత చదువు ప్రభావం ప్రస్నార్ధకమే అని అనిపిస్తోంది. సమాజం/కట్టుబాట్ల పట్ల ఉన్న విపరీత భయమే అటువంటి ఘటనలకు కారణం కావచ్చు. ఎవరో ఏమో అనుకుంటారని, తమను తాము అణచేసుకుంటూ, చంపేసుకుంటూ బతుకీడుస్తున్న వాళ్ళను నా అనుకునే వాళ్ళలో కూడా చూస్తున్నాను. దురదృష్టం కొద్దీ తప్పు, ఒప్పు అన్నవి సమూహం దృష్టిలోంచి చూడబడతాయే తప్ప వ్యక్తి కోణంలోంచి కాదు. ఒక వ్యక్తి తనకు ఏది తప్పో, ఏది ఒప్పో తెలిసినా కూడా వాటిని ఆచరించలేకపోవడానికి కారణం కట్టుబాట్లు, సామాజిక నిబంధనలు. నడక, నడత, మాట, పని - ప్రతిదీ ఇతరుల అభిప్రాయాలకు నచ్చేట్టు ఉండాలని తపన పడే వారు ఎందరో. ప్రతిదానికీ ఇతరులతో పోలిక, ఇతరులు మెచ్చుకోవాలనే తపన - ఎందుకు? మెచ్చుకునే వారు కానీ, మెచ్చుకోనివారు కానీ మన పోషకులు కారు.
మొదట ప్రస్తావించిన ఘటన నామీద, నా ఆలోచనల మీద తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల వయసులో చదివిన ఆ ఘటన, ఇప్పటికీ నా ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ఇతరులకు చెప్పడమే కాదు, వారికి చెప్పడం కంటే ముందు ' ఇతరులు ఏమంటారో, ఏమనుకుంటారో' అనే ఆలోచనల నుండి నన్ను నేను బయటపడేసుకోవడానికి తీవ్రంగా పోరాటం చేశాను. నేను చేసినవి ఇతరులకు నచ్చి ఉండవచ్చేమో, కానీ ఇతరులకు నచ్చాలని నేను చెయ్యట్లేదు. సమాజం, కట్టుబాట్లు - కూడు పెట్టవు, నీడనివ్వవు. అలాగని విచ్చలవిడిగా తప్పులు చెయ్యమని చెప్తున్నానుకుంటే, పొరపాటు. మన చర్యలు ఇతరులకు నచ్చాలనే ఆలోచనలు వీడాలి. ఏది చేసినా కూడా ఇతరుల మెప్పు కోసం కాదు, మనం సంతోషంగా ఉండగలగాలి. విజయం, స్థాయి అన్నవి సమాజపు ప్రమాణాలు - వాటికోసం వెంపర్లాడటం అంటే హ్మ్, అలా అయితే నీ ఇంట్లో గోడమీద ఫొటోలో ఉండే కృత్రిమ నవ్వులా నువ్వూ ఒక కృత్రిమ అస్తిత్వానివే కాగలవు.
"Never do it because someone else said you can't or some others said you can. Just do it if you love it and do it because you love it"
******************************

Comments
Post a Comment