... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్)
వంశీ కలుగోట్ల // ... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్) // ****************************** ******************** 1996 లో నేను కర్నూలులో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను, నేను హాస్టల్ లో ఉండేవాడిని. మా కాలేజీ సిటీకి దూరంగా, నందికొట్కూరు రోడ్ లో ఉండేది. ప్రతి ఆదివారం హాస్టల్ లో ఉండే అందరినీ కాలేజీ బస్సులు సిటీ సెంటర్ లో డ్రాప్ చేసి, మళ్ళీ సాయంకాలం హాస్టల్ కి తీసుకెళ్ళేవి. నాకు బాగా గుర్తు ... అప్పట్లో కొన్ని పోస్టర్స్ వచ్చాయి 'ఎవరీ అబ్బాయి' అంటూ. ఈవీవీ సత్యనారాయణ సినిమా అని తెలుసు, కానీ హీరో ఎవరో అర్థం కాలేదు. కొన్నాళ్ళకు తెలిసింది ఆ సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబు అని. అప్పటికి దాదాపు రెండు మూడేళ్ళ నుండి చిరంజీవికి సరైన హిట్ పడక, 1996 లో అప్పటివరకూ చిరంజీవి సినిమా లేక చిరంజీవి అభిమానులు డీలాగా ఉన్న సమయం అది. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయింది, ఫుల్ హంగామా. సినిమా చూశాక మొదట అనుకున్నది డాన్సుల్లో చిరంజీవి పేరు సెడగొట్టేట్టు ఉన్నాడు కదరా అని, ఇక నటన గురించి అంట...