... ముందుగా మీరు మారండి
వంశీ కలుగోట్ల // ... ముందుగా మీరు మారండి // ************************************************* సమాజంలోని అనేకానేక సమస్యల గురించి విచ్చలవిడిగా మాట్లాడి, పోరాడే అభ్యుదయవాదులందరూ గమనించవలసింది ఏమిటంటే - ప్రస్తుతం వారు పోరాడే సమస్యల కంటే అతి ముఖ్యమైనవి వేరే ఉన్నాయి, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత సమస్యలు. విషవాయువులు వాతావరణాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో తెలియనిది కాదు. విషయవాయువులు అనగానే మనమంతా కనుబొమలెగరేసి పరిశ్రమల వైపు చూస్తాం. కానీ, పరిశ్రమలకంటే ఎక్కువగా వాహనాలు, ధూమపానం వల్ల వాతావరణం ఎక్కువగా కలుషితం అవుతోంది. కానీ, ఈ అభ్యుదయపోరాటవాదులలో అత్యధికులు వాహనాలను సౌకర్యం కోసం, సిగరెట్ ను స్టైల్ కోసమో లేక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమో, అలవాటు మానుకోలేకనో తాగుతున్నామని చెప్పుకుంటారు. వీరంతా గమనించటానికి, తెలిసినా ఒప్పుకోవటానికి ఇష్టపడనిది లేదా ఆచరించకుండా ఏవేవో వంకలు చెప్పేది అయినా ధూమపానం అనబడే సిగరెట్/బీడీ వంటివి తాగటం వల్ల మీరొక్కరే నాశనమైతే...