...స్పందించకపోతే
వంశీ కలుగోట్ల // ...స్పందించకపోతే // ************************************** అవును మన తెలుగు సినీ నటులెవ్వరూ హోదా విషయంలో పోరాటానికి ముందుకు రావటం లేదు, ఇపుడే కాదు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బహిరంగంగా మద్దతుగానో, వ్యతిరేకంగానో బయటపడినవారు అతి తక్కువ. ఇటువంటి ఘటన జరిగిన ప్రతిసారీ తమిళ నటులతో పోలిక వస్తుంటుంది. తమిళ నటీనటులు జల్లికట్టు విషయంలో కానీ, కావేరి జలవివాదం విషయంలో కానీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన తీరు నిజంగా ఆదర్శనీయమే అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, తెలుగు సినీ రంగానికి వస్తే అత్యంత కీలకమైన అంశమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎవరూ స్పందించడం లేదు. మొన్న మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి; రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్న బాలకృష్ణ; ఇంకా చట్ట సభల్లో సభ్యులుగా ఉన్న మురళీమోహన్, శివప్రసాద్; విపరీతమైన ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటివారు; శర్వానంద్, నాని, రామ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి యువనటులు; ఇంకా తెలుగమ్మాయిలు, తెలుగు సినిమా...