జబర్దస్త్ గురించి
వంశీ కలుగోట్ల // ... జబర్దస్త్ // ****************************** పురాణాలలో కొన్ని కథలు విని ఉంటాం. అందులో ఎలా ఉంటుందంటే దేవుడిని విపరీతంగా పూజించే భక్తుడికంటే, దేవుడిని దూషించే వాడికే దేవుడు ప్రత్యక్షమవుతాడు లేదా దర్శనమిస్తాడు. దాన్ని ప్రశ్నించిన భక్తుడికి దేవుడు చెబుతాడు - 'నువ్వు అవసరం ఉన్నప్పుడో లేకపోతే నిర్దిష్ట సమయాల్లోనో నన్ను తలచుకుంటున్నావు కానీ వాడు అలా కాదు నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు అందుకే వాడు మరణానంతరం నా లోకంలో నా సమక్షంలో సకల సుఖాలనుభవిస్తాడు' అని వివరిస్తాడు. ఈ జబర్దస్త్ గోలలో నాకొకటి అనిపిస్తోంది... ఈ జబర్దస్త్ ను ఎవరైతే అధికంగా విమర్శిస్తున్నారో వారే మళ్ళీ మళ్ళీచూస్తూ, షేర్ చేస్తూ ఆ టి.ఆర్.పి రేటింగ్ లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతున్నారు. ఈ జబర్దస్త్ బాగా ప్రాచుర్యం పొందాక హేవిటో అది అనుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశాను (అది కూడా చాలాకాలం క్రితం). అందులోని వెకిలితనం, బూతు, అశ్లీలత, వెటకారం తదితరాలు నాకు నచ్చలేదు. అప్పటినుండి ఇప్పటివరకూ మళ్ళీ చూడలేదు కూడా. అంతే కాదు, సాధ్యమైనంతవరకూ నా చుట్టూ ఉన్నవారికి దాన్ని చూడొద్దని చెప్పటానికే ప్రయత్నించాను. నాకు బ...