ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ...
ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ... ****************************** ********** ఒకనాటి సమైక్య తెలుగు రాష్ట్రం పాలనాపరంగా, సాంకేతికంగా, సామాజికంగా, భౌగొళికంగా విడిపోయిమూడు సంవత్సరాలు కావస్తోంది. ఒకటిగా ఉన్న 'తెలుగు' ప్రజలు రాజకీయ కారణాల వల్లనో మరే ఇతర కారణాల వల్లనో రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. ఇప్పుడు విభజనకు కారణాలు గట్రా వెతకటం అనవసరం. కానీ, ఎవరి దారి వారు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, కష్టమో నష్టమో తప్పదు. కొన్ని మరిచిపోవాలి. నేటి తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్ర/రాయలసీమ ప్రాంతం వారి వల్ల అభివృద్ది చెంది వుండవచ్చు అలాగే మరి కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై తీవ్రంగా నష్టపోయివుండవచ్చు. కానీ, ఆ గతమంతా మరిచిపోయి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన తరుణం ఇది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ, ఇతర తెలంగాణా నాయకులు కానీ చేస్తున్నది అదే. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే బహిరంగ [ప్రయత్నాల వెనుక తమ పార్టీని తిరుగులేని శక్తిగా మలచుకోవాలనే అంతర్గత ప్రయత్నాలు, తన/తమ వారసులకు ఎద...