... 'సాహో' గురించి
వంశీ వ్యూ పాయింట్ // ... 'సాహో' గురించి // ***************************************** సాహో సినిమా గురించి మాట్లాడుకుందాం. శౌర్యం సినిమాలో అనుకుంటా అలీ కాలేజీలో ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కం స్పోర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ బాడీ, టోన్డ్ మసిల్స్ తో కనబడుతుంటాడు. నిజమేంటంటే అతనికి అటువంటి బాడీ ఏమీ ఉండదు. బెలూన్స్ ని బాడీ కి చుట్టుకుని అలా కనబడుతుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న హీరో గోపీచంద్ అతడితో ఓ ఆటాడుకుంటాడు. ఆ ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం సాహో సినిమా గురించి కదూ. సాహో సినిమా గురించి చెపుదామనుకుంటే, ఆ ఆలీ క్యారెక్టర్ మ్యాటర్ గుర్తొచ్చింది అంతే. అంటే ఏం లేదు ఒక మామూలు కథను పట్టుకుని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ కథలో ఏమీ లేకపోయినా, జస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టి - అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ అనుకోమన్నారు. అదన్నమాట విషయం. సాహో చిత్రాన్ని ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేశారు, అఫ్ కోర్స్ అదే నిజమనుకోండి. బహుశా దర్శకుడు మరియు కథకుడు అయిన...