... వాడు - వీడు: మనోభావాలు
వంశీ కలుగోట్ల // ... వాడు - వీడు: మనోభావాలు // *************************************************** వాడు: అరేయ్ ఇట్రా వీడు: అరేయ్, ఒరేయ్ అనకు. మా మనోభావాలు దెబ్బతింటాయి వాడు: ఉన్నట్టుండి ఏమైంది? తిక్కతిక్కగా ఉందా? వీడు: అలా అనకు, తిక్కోళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాడు: అసలు ఏమనుకుంటున్నావురా? వీడు: అలా అనకు, ఏమీ అనుకోని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాడు: ఓరి దేవుడో, ఏందీ ఈ గోల వీడు: అలా అన్నావంటే, దేవుడిని నమ్మేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాడు: నీ ... వద్దులే, ఈ పెంటతో నాకెందుకు వీడు: అలా అన్నావంటే అస్సలు బావోదు. పెంట సంబంధిత పనులు (లెట్రిన్ గుంతలు క్లీనింగ్ గట్రా చేసేవారు) చేసేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు పనిమానేస్తే కష్టం. వాడు: అసలేమైంది నీకు? ఈ మధ్య ఆర్జీవీ సినిమా ఏమైనా చూశావా? వీడు: నీకు దండం ఉంటాది. ఈ ప్రపంచంలో ఎవరి మనోభావాలనైనా దెబ్బ తియ్, పర్లేదు. మహా అయితే కేసులు పెడతారు, దాడులు చేస్తారు. కానీ ఆర్జీవీ మనోభావాలను దెబ్బ తీయకు. దెబ్బ తిన్న...