మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ
వంశీ కలుగోట్ల // మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ // **************************************************** చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రంలో కథ అంతా ఒక సందేశం చుట్టూ అల్లబడి ఉంటుంది. ఆ సందేశం ఏంటంటే 'మీరు ముగ్గురుకి సహాయం చెయ్యండి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమనండి.' అలా ఒక గొలుసుకట్టులాగా సహాయం అన్న ప్రక్రియ సాగాలి, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి అన్నది అంతర్లీనంగా సందేశం. అది ఎదో హాలీవుడ్ లేదా కొరియన్ సినిమా నుండి తీసుకున్నది, ఆ సినిమా పేరు గుర్తు లేదు. అయినా నేను ఇపుడు ఈ వ్యాసం ముఖ్యోద్దేశం ఆ సినిమా గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం అప్రస్తుతం. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను, దానికి ఇది ప్రవేశిక లాంటిది. 2000 సంవత్సరం, అప్పుడే డిగ్రీ పూర్తయ్యింది. రెండో అక్క గాయత్రి/నాగలతకు పెళ్లి కుదిరింది. అప్పటికింకా ఏమి చెయ్యలో, ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదు కాబట్టి డిగ్రీ అయి కొన్ని...