శ్వేతపత్రాలు ఏమయ్యాయి?
వంశీ కలుగోట్ల // శ్వేతపత్రాలు ఏమయ్యాయి? // ***************************************** ఎక్కువొద్దురా నాయనా సామీ, ఆ ఇచ్చేదేదో హోదానే ఇవ్వు అని 2014 నుండీ మొత్తుకుంటుంటే ఇపుడు మళ్ళీ తాజాగా ఎప్పటినుండో పాడిన పాతపాటనే పాడతారేంటి అమిత్ షాజీ!? మీరిచ్చిన డబ్బులు కావాలంటే ఎనక్కి తీసుకోండి, హోదా ఇవ్వండి చాలు. అవునూ, అమిత్ షా గారేం ఒక లక్షా డెబ్బై అయిదువేల కోట్లు ఇచ్చామని అంటున్నారు కదా, మరి అయితే క్రింది ప్రశ్నలకు వివరణ ఇస్తూ బాబుగారేమన్నా తెల్లకాయితం అదేనండీ శ్వేతపత్రం ఏమైనా విడుదల చేస్తారా లేక చెయ్యగలరా? -> అమిత్ షా గారు పేర్కొంటున్నట్టు అంతటి భారీస్థాయిలో నిధులు/డబ్బులు నిజంగానే ఇచ్చారా? -> ఒకవేళ అంతటి భారీ స్థాయిలో నిధులు ఇచ్చి ఉంటే, వేటికి ఉపయోగించారు? -> అమిత్ షా గారు పేర్కొన్న నిధులు గత సంవత్సర కాలంలో ఇచ్చినవా లేక గత మూడు సంవత్సరాల కాలంలో ఇచ్చినవా లేకపోతే 2019 వరకూ ఇవ్వాలని అనుకుంటున్నా వాటితో కలిపి చెప్పిన లెక్కనా? -> ఆ నిధుల ఉపయోగించిన వివరాలేమిటి అంటే ఏయే పథకాలు లేదా కార్యక్రమాలకు వినియోగించారు? -> ఇచ్చిన డబ్బులు హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలకు...