ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'బాహుబలి 2' గురించి
ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'బాహుబలి 2' గురించి ****************************** ****************** మొదటగా, తనమీద నమ్మకంతో వందలకోట్లు ఖర్చు పెట్టగలిగే నిర్మాతలను సంపాదించుకోగలిగిన రాజమౌళికి ; రాజమౌళి మీద నమ్మకంతో దాదాపు అయిదు సంవత్సరాలు బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్ నిబద్ధతకు ప్రశంసలు. ప్రశంసించినా సరే లేక విమర్శించాలనుకున్నా సరే సినిమా గురించి తెలిసిన వారిలో అధికశాతం మంది చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా 'బాహుబలి 2'. సినిమా ఎలా ఉంది అన్న విషయం అటుంచి మొత్తం భారత దేశ సినిమా ప్రేక్షకులలో, కొంత స్థాయిలో అంతర్జాతీయ సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా గతంలో లేదు. అందునా చిన్న చూపుకు గురయ్యే దక్షిణాది సినిమా రంగం నుండి; అదీ కాక దక్షిణాది సినిమా అంటే 'తమిళ సినిమా' మాత్రమే అనుకునే బుర్రతక్కువ వాళ్లకు 'ఇది తెలుగు సినెమా, తెలుగోడు తీసిన సినిమా' అని చెప్పుకుంటూ దక్షిణాది సినిమా రంగం అంటే కేవలం తమిళ సినిమా కాదు అని చూపించిన రాజమౌళి ప్రశంసనీయుడు. ఎన్నో దశాబ్దాల నుండి భారతదేశ సినిమా రంగంలో దాదాపు ...