ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి
ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి ****************************** ***************************** "ఆత్మ నాశనం లేనట్టిది. ఆయుధములతోనో, మరే విధమైన రీతులలోనో ఎవరూ ఆత్మను నాశనమొందింపజాలరు." అని ఆ భగవంతుడు ఏనాడో మహాభారత యుద్ధకాలంలోనే చెప్పాడు. పాపం మన చిత్రాలలోని ప్రతినాయకులు ఈ సత్యమును తెలుసుకోనలేక అనవసరంగా నాయకుడిపై యుద్ధం చేస్తుంటారు, ఆయుధాలు ప్రయోగిస్తుంటారు. ఎన్నో వందల, వేల చిత్రాలలో ఇప్పటికే నిరూపితమైనప్పటికీ మళ్ళీ ఈ సరైనోడు సినిమాలో కూడా ఆది పినిశెట్టి తెలివిలేకుండా మళ్ళీ అదే పని చేశాడు. ఎవరన్నా పూనుకుని మన ప్రతినాయకులని ఎడ్యుకేట్ చెయ్యండయ్యా. ఇక 'సరైనోడు' సినిమా గురించి. రెండు వేర్వేరు తరహా ఇమేజ్ లు ఉన్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీనులు కలిసి పని చేస్తున్న సినిమా అయినప్పటికీ రూపకర్తలు ముందే జనాలకు క్లారిటీ ఇచ్చారు 'ఇది ఊర మాస్' సినిమా అని. కానీ, అటు బోయపాటి తరహాలోనూ కాక, ఇటు అల్లు అర్జున్ తరహాలోనూ కాక ఇంకోలా తయారయ్యింది సినిమా. కథ పరంగా చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు, ఆశించకూడదు కూడా. ఇక బోయపాటి శ్రీను బహు...