... జీహెచ్ఎంసీ ఎన్నికలు
వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు // ******************************************** జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం. ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. ...