వంశీ వ్యూ పాయింట్ - గీత గోవిందం
వంశీ వ్యూ పాయింట్ - గీత గోవిందం ************************************** ఇటీవలే 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంపై వంశీ వ్యూ పాయింట్ రాస్తూ ఒక మాట ప్రస్తావించాను. ఒక కథ రాసుకునేపుడు ముందుగా ప్రతినాయక పాత్రను లేదా పాత్రల మధ్య సంఘర్షణకు కారణమయ్యే అంశాన్ని బలంగా రాసుకోవడం ముఖ్యం అని. 'గీత గోవిందం' చిత్రం చూశాక మరోసారి అది గుర్తొచ్చింది. 'శ్రీనివాస కళ్యాణం' అయినా 'గీత గోవిందం' అయినా కథలు కొత్తవేమీ కాదు. కానీ, అవి రూపు దిద్దినదర్శకుడి ప్రతిభ/సామర్త్యాన్ని బట్టి అవి రూపొందే విధం ఉంటుంది. దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' చిత్రాన్ని రూపొందించిన విధానం చాలా చక్కగా ఉంది. ఒకటీ, రెండు సన్నివేశాలు మినహాయించి మిగతా అంతా చూసేవారిని చక్కగా అలరిస్తుంది. 'గీత గోవిందం' చిత్రం కథగా చెప్పాలంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి అమ్మాయి, అనుకోకుండా జరిగిన ఒక చిన్న ఘటన, తెలియకుండా వారి మధ్య బంధుత్వం, అపోహలు తొలగే క్రమంలో చిన్న చిన్న మలుపులు, చివరకు సుఖాంతం - అంతే. కామెడీ కూడా ఏదో జనాల్ని నవ్వించటానికి ప్రత్యేకమైన కామ...