వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి'
వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి' ************************************* సావిత్రి చరిత్ర పతనం కాలేదు సావిత్రి పతనం చరిత్ర అయింది 'మహానటి' చిత్రంపై సమీక్ష లేదా నా అభిప్రాయం చెప్పే ముందుగా ఒక మాట - 'ఒక సినిమాపై సమీక్ష చేయబోయే ముందు, ముందుగా ఆ సినిమా రూపొందించిన వ్యక్తి ఉద్దేశం ఏమిటి?' అనేది మనం గ్రహించగలగాలి. రూపకర్త ముఖ్య ఉద్దేశం తెలుసుకోకుండా అలా ఉంది, ఇలా ఉంది అంటే అందులో అర్థం ఉండదు. ఒక శృంగార చిత్రం చూసి, అందులో భక్తి గీతాలు లేవు అంటే ఎలా ఉంటుంది? 'మహానటి' చిత్రం రూపొందించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య ఉద్దేశం తెలుగు, తమిళ చిత్ర రంగాలలో (దక్షిణాది సినిమా రంగంలో అని చెప్పవచ్చు) 'మహానటి' గా పేరు పొందిన సావిత్రి గారి జీవితాన్ని తెరపై (కొన్ని పరిమితులకు లోబడి) ఆవిష్కరించడమే కానీ సమాజానికి సందేశం ఇవ్వడమో లేక వినోదాన్ని అందించడమో కాదు. నాగ్ అశ్విన్ ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఎక్కడా సందేశం లేదా వినోదం వంటివి జొప్పించకుండా సావిత్రిగారి జీవితాన్ని ఒక జర్నలిస్ట్ పరిశోధనగా చూపాడు. జర్నలిస్ట్ నేపథ్యాన్ని చూపటానికి కూడా 80ల నేపథ్యాన్న...