... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు
వంశీ కలుగోట్ల // ... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు // ***************************************************** -> పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు కేవలం 'కోడి గుడ్ల' దాడికే పరిమితం చేయటం ఏమిటి? బెదిరింపు కాల్స్ విషయం ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు? దాన్ని ఇంకొన్నాళ్ళు కొనసాగించే ఆలోచన ఉందా? ఇపుడు కోడిగుడ్ల దాడి వ్యవహారం సమసిపోయినట్టే, బెదిరింపు కాల్స్ వ్యవహారం కూడా సమసిపోయే అవకాశం ఉంది కదా. -> ఇక కోడిగుడ్ల దాడి చేసినవారిపై గంటల వ్యవధిలో ఫిర్యాదును వాపసు తీసుకోవడం ఆనందమే కాదు కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇక్కడ అర్థమవుతోందేమిటంటే సమస్య పవన్ కళ్యాణ్ తో కాదు, అతగాడి పేరు చెప్పుకుని (ఈ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి) చెడ్డపనులు చేస్తున్నవారితో అని. అంతే కదా, అటువంటప్పుడు బెదిరింపు కాల్స్ వ్యవహారంలో తాత్సారం ఎందుకు? -> మరో విషయం - కోడిగుడ్ల దాడి ఘటన టీవీ9 స్టూడియో దగ్గరకు తమరు క్యాబ్ లో వచ్చినపుడు జరిగిన హఠాత్ పరిణామం కదా. అటువంటపుడు దాడి జరిగిన వెంటనే ఆ క్లోజ్ అప్ షాట్స్, అంతటి విపులమైన కవరేజ్ వీడియోస్ ఎలా సాధ్యమయ్యాయి? అంటే టీవీ 9 వారు మీ...