హేవిటో ...
వంశీ కలుగోట్ల // హేవిటో ... // ****************************** -> తిరుమలకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి సకల సదుపాయాలు కల్పించటంతో పాటు, ప్రత్యేకంగా చూసుకోవాలని మన ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ చంద్రబాబుగారు ఆజ్ఞాపించినట్టు; తదుపరి వ్యవహారాలను తానే స్వయంగా చూసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ!? అవునూ, ఇంతకీ అది ప్రేమా లేక భయమా!? -> అదేమిటో తమ్ముళ్ళందరూ శ్రీ కెసిఆర్ గారిని కలిసిన వైకాపా నాయకుల గురించి జోకులేసుకుంటున్నారు కానీ, కెసిఆర్ గారికి కావలసిన ఏర్పాట్లను భయభక్తులతో చూసుకున్న బాబుగారి గురించి మాత్రం (వార్తల ప్రకారం) పల్లెత్తు మాట అనటం లేదు. బహుశా, బాబుగారు ఏది చేసినా సమాజ సంక్షేమం కోసమే తప్పించి ఆయన స్వార్థం కోసం కాదు అనేమో ... ఎంతైనా సూక్తులందు పచ్చ సూక్తులు వేరయా. -> సిన్నన్నయ్య ఎవరినుద్దేశించి అన్నాడో తెలియదు కానీ వారసత్వాల గురించి కామెంటేసరికి జనాలు తనగురించి తానే కామెంటుకున్న సిన్నన్నయ్యను సూసి అచ్చెరువొందుతున్నారు. -> ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో మాత్రమే రైతు ఋణమాఫీ, ప్రత్యేక నిధులు తదితర ...