పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ...
వంశీ కలుగోట్ల // పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ... // ***************************************************** వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచివాడే కావచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రస్నార్ధకంగానే ఉంది, అనుమానానికి తావిచ్చేదిగా ఉంది. ప్రశ్నించే మీరు సమాధానాలు కూడా చెప్పడం నేర్చుకోవాలి ... ప్రయత్నించండి. - ఇచ్చిన హామీల గురించి మోడీ గారిని, వెంకయ్య నాయుడు గారిని విమర్శించారు. మరి అసలు హామీలు అంటేనే చిర్రెత్తుకొచ్చేలా హామీల వర్షం కురిపించిన చంద్రబాబు గారిని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అవును కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి, ఇచ్చారు రెండున్నర సంవత్సరాల కాలం. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించానన్న ప్రతిసారీ తెల్లారి చంద్రబాబు గారిని కలవడం 'అపోహలు తొలగాయి, ఆయన మీద నమ్మకం ఉంది' అనటం. అదేదో మోడీ గారిని కూడా ఒకపూట కలిస్తే ఆయన మీద కూడా నమ్మకం వస్తుంది కదా, ఎందుకు వెనుకాడుతున్నారు? - మరో విషయం - ప్రతిసారీ నా దగ్గర డబ్బుల్లేవు, డబ్బుల్లేవు అంటూ బీద అరుపులు...