... వైద్యో నారాయణో హరిః
వంశీ కలుగోట్ల // ... వైద్యో నారాయణో హరిః // *************************************** ఇపుడు జరుగుతున్న విషయం చెప్తాను. పరిస్థితి ఎలా ఉందంటే కాస్త దగ్గో, జలుబో, ఒళ్ళు వెచ్చబడటమో జరిగితే లోలోపల దడ పుడుతోంది. అలాగని వెంటనే హాస్పిటల్, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళటానికి కూడా భయం. మరేం చేయాలి ... ??? అపుడు గుర్తొస్తారు మన ఫ్రెండ్స్ లో డాక్టర్స్ లేదా తెలిసిన డాక్టర్, మన ఫ్రెండ్స్ డాక్టర్ - ఇలా వాళ్ళకు ఫోన్ చేసి వివరాలు చెప్పి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు, అదీ రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే భయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రైవేట్ (వెల్, ప్రైవేట్ అనేకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనాలేమో) హాస్పిటల్స్ సాధ్యమైనంత దండుకుంటున్నాయి. నిజానికి సీరియస్ కండిషన్ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండి, డాక్టర్స్ సలహాలతో మందులు తీసుకుంటూ ఉండవచ్చు అని ప్రభుత్వాలు స్పష్టం చేసినప్పటికీ జనాలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే ఆ డాక్టర్ ఫ్రెండ్స...