వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్
వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్ ********************************* మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రిక చిత్రంగా చెప్పబడిన, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడిగా, తెల్లవారిపై (కంపెనీ లేదా బ్రిటిష్ రాజ్యం) తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందుబాటులో ఉన్న ఆధారాలకు కొంత కాల్పనికత జోడించి తీసిన సినిమాగా - ఎంతో ఉత్సుకతను రేకెత్తించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సినిమా ఎలా ఉంది అనేకంటే ముందు - దేశభక్తి భావనలు ఈ సినిమాద్వారా పెంచుకోవాలనుకునేవారు మరియు చిరంజీవి భక్తులకు ఒక మనవి - ఇక్కడితో చదవడం ఆపెయ్యండి లేదా మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కేవలం నా వ్యూ పాయింట్. సినిమా ఎలా ఉన్నా, 'సైరా' ఖచ్చితంగా, తెలుగు సినిమా సాధించిన అద్భుత కమర్షియల్ విజయాలలో ముందువరుసలో ఉంటుంది అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అన్నిటికంటే ముందుగా ఒక విషయం చెప్పుకుందాం - 'మనీ' సినిమాలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు పెళ్ళి గురించి చెపుతూ, కొన్ని ఫోటోలు చూపుతూ - సేమ్ కార్డ్, ఫొటోస్ చేంజ్ అంటూ వివరిస్తాడు. 'సైరా' సినిమా గురిం...