... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు
వంశీ వ్యూ పాయింట్ // ... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు // ********************************************************** తెదేపా అవమానాల్ని, ఓటముల్ని తట్టుకోవటం తెదేపాకు, చంద్రబాబు గారికి అలవాటే. తట్టుకుని నిలబడ్డారు కాబట్టే, నేను అత్యంత సీనియర్ ని అని చెప్పుకోగలిగే స్థాయిని సంపాదించుకుని నిలబడ్డారు. ఈ ఓటమికంటే, ఈ శతృవు చేతిలో ఓటమి ఆయనను ఎక్కువగా ఆబాధిస్తున్నట్టుంది. అయినా అదంతా పక్కనబెట్టి, సభలో చక్కగానే వ్యవహరిస్తున్నారు. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ, గత అయిదేళ్లతో పోల్చితే ఇపుడు వ్యవహరిస్తున్న తీరు బెటర్ అని చెప్పవచ్చు.తెదేపా అభిమానులను బాధిస్తున్న అంశం ఏంటంటే పార్టీ నాయకుల తీరు. గెలిచినా 23 మంది అయినా గట్టిగా పోరాడుతున్నారా అంటే లేదు, భాజపా తమతో 18 మంది టచ్ లో ఉన్నారు అన్నా కూడా ఎవరూ స్పందించటం లేదు. అంతేకాక సభలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య గారు, అప్పుడప్పుడు పయ్యావుల కేశవ్ మినహా మిగతావారు పెద్దగా నోరు మెదపట్లేదు. వారు భయపడుతున్నారా లేక పార్టీ వీడటానికి మంత్రాంగం నడుపుతున్నారా అన్నది చెప్పల...