(రాజకీయాల్లో) ఒకటి + ఒకటి = ???
వంశీ కలుగోట్ల // (రాజకీయాల్లో) ఒకటి + ఒకటి = ??? // ******************************************************** రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పటికీ రెండు కాదు అంటారు. తెలంగాణ ఎన్నికలలో 'చంద్రబాబు' ఫాక్టర్ పని చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 'కెసిఆర్' ఫాక్టర్ పని చేయగలదా? తెలంగాణాలో కేవలం చంద్రబాబు ఫాక్టర్ మాత్రమే కాదు, మరికొన్ని అంశాలు పని చేశాయి. నా అవగాహనమేరకు చిన్న విశ్లేషణ -> చంద్రబాబు పట్ల తెలంగాణాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది కేవలం తెదేపా స్థాయిలో కాక, చంద్రబాబు అనే వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకతగా గుర్తించిన కెసిఆర్ దాన్ని ఆయుధంగా మలచుకున్నాడు. -> నాయకులు తమ అవసరార్థం పొత్తులు కలుపుకున్నంత సులువుగా కిందిస్థాయి క్యాడర్ కలిసిపోరు అనటానికి తెదేపా - కాంగ్రెస్ పొత్తు ఉదాహరణ. వారి పొత్తు ఒక చారిత్రిక తప్పిదంగా నిలిచిపోయింది. అంతేకాదు దానిద్వారా తన రాజకీయ అవసరార్థం ఎంతకైనా దిగజారగలరు అన్న అపప్రధను చంద్రబాబు మూటగట్టుకున్నారు. -> ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ, నాయకుడిగా ఒక బలమైన వ్యక్తి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ప్రధాన...