వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ
వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ ****************************************************** ఓటమి ఎదురైనపుడు, నైరాశ్యంలో ఉన్నపుడు కొందరు విరామం తీసుకుంటారు, తమను తాము సమీక్షించుకోవటానికి. మరికొందరు ఇతరులు విజయం సాధించిన మార్గం దిశగా తమ పయనాన్ని మార్చుకుంటారు. ఇప్పటికే కాపీ దర్శకుడు అనే అపప్రధ మోస్తున్న త్రివిక్రమ్, ఇపుడు బోయపాటిలా సినిమా (అంతకంటే హింసాత్మకంగా కూడా) సినిమా తీశాడని అనిపించుకోవడం బోయపాటి విజయమా లేక త్రివిక్రమ్ వైఫల్యమా? అజ్ఞాతవాసి వంటి ఘోర వైఫల్యం తరువాత మళ్ళీ ఇటువంటి చిత్రం తీయడం త్రివిక్రమ్ సత్తా మీద సందేహం వచ్చేలా చేస్తుంది. అజ్ఞాతవాసి చిత్రానికి ఫ్రెంచ్ దర్శకుడు బహిరంగంగా విమర్శలు చేయడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ చొరవతో బయటపడ్డట్టున్నారు. అయినా కూడా ది ఫామిలీ అనే ఆంగ్ల చిత్రం; మిర్చి, ఆది లాంటి సినిమాలు కలగలిపి సినిమా తీసేశాడని అనిపించుకున్నాడు. (డా. వేంపల్లి గంగాధరం గారు, ఏ కారణాల చేతనో తన పోస్ట్ తీసెయ్యటం వలన నేను ఇక్కడ దానిని ప్రస్తావించటం లేదు) ...