... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు
వంశీ కలుగోట్ల // ... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు // ****************************** ******************** వెనకటికెవడో నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు అన్నాడట, అలా ఉంది నేటి హిందూ సంఘాల వ్యవహారం. హిందూ ధర్మ సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, దేవీదేవతలను మేధావి వర్గంగా ముద్రపడిన వారు తెగ విమర్శిస్తున్నారు. అది ఈనాడు కొత్తగా జరుగుతున్నది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నది. దాని వెనుక కారణాలు అన్వేషించే ఆలోచన కూడా ఇరువైపులవారికీ లేదు. స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ముందుగా అణగారిన వర్గాలను (అణచివేయబడిన వర్గాలు అనడం సరియైనది ఏమో) తన పోరాటంలో భాగం చేశాడు. వారు ప్రధానంగా ఎదుర్కుంటున్న అనేకానేక సమస్యలను ఎక్కడికక్కడ స్థానికంగా వీలైనంత పరిష్కారం లేదా సర్దుబాటు వంటివి చేసి అందరినీ స్వాతంత్ర్యోద్యమం దిశగా నడిపించాడు. (సరే ... గాంధీ ఉద్యమతీరు గురించి మరో వ్యాసంలో చెప్పుకుందాం.) అణగారిన/అణచివేతకు గురైన వర్గాలు అంటే ప్రధానంగా దళితులు, తదితరుల వెనుకబాటు తనానికి అగ్రవర్ణాల అణచివేత, బహిష్కరణ, తక్కువచేసి చూడటం వంటి అనేకానేక కారణా...