Posts

Showing posts from December, 2017

... తెలుగు సినిమా 2017 (నా వ్యూ)

వంశీ కలుగోట్ల // ... తెలుగు సినిమా 2017 (నా వ్యూ) // ******************************************************* తెలుగు సినిమా 2017 లో బాహుబలి సాక్షిగా వెలిగిపోయింది. కానీ, ఒక్క బాహుబలితోనే ఆగిపోలేదు. పెద్ద, చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేసి, తెలుగు సినిమా హద్దులను చెరిపేసే దిశగా అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. నా దృష్టిలో ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగంలోప్రస్తావించుకోదగ్గ సినిమాలుగా అనిపించిన చిత్రాలతో చిన్న సమీక్షలాంటిది ...   బాహుబలి 2: 'బాహుబలి' అన్నది నిస్సందేహంగా ఒక్క తెలుగు సినిమా రంగాన్నే కాక భారతీయ సినిమా రంగాన్నే వాణిజ్యపరంగా, సాంకేతిక హంగుల పరంగా కొత్త అడుగులు వేయించిన సినిమా. ముఖ్యంగా సాంకేతికత విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే పరిమిత వనరులతో హాలీవుడ్ స్థాయికేమాత్రం తగ్గకుండా తయారైంది. ఆ కష్టం వృధా పోకుండా, వాణిజ్యపరంగా సంచలనాత్మక విజయం సాధించింది. భారతీయ సినిమా సాంకేతిక విలువలు బాహుబలికి ముందు, తరువాత అన్నట్లు తయారైంది. అంతేకాదు దక్షిణాది సినిమారంగం అంటే 'తమిళం' అనుకునేవారికి తెలుగు సినిమాను పరిచయం చేసింది. బహుశా, ఇప్పటికీ ఇంకా దక్షిణ...

... పాదయాత్ర తీరు

వంశీ కలుగోట్ల // ... పాదయాత్ర తీరు // *************************************** ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళో, నిన్నో ఎవరో అభినందిస్తూ పెట్టిన పోస్ట్ చూశాను '600 కిలోమీటర్లు దాటిన శుభసందర్భంగా' అని. 600 కిలోమీటర్ల దూరం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యమా? పాదయాత్ర లక్ష్యం లేదా నిర్ణయించుకున్న పూర్తి పాదయాత్ర దూరం దాదాపు 3000 కిలొమీటర్లనుకుంటా. దాదాపు అన్ని జిల్లాలలోనూ పర్యటన జరుగుందనుకుంటాను. ప్రతి వంద కిలోమీటర్లకూ సమర్థకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దూరం పెరిగిన కొద్దీ అదో ఘనతగా కీర్తిస్తున్న సమర్థకులు, కాస్త వ్యక్తి మీద నుండి లక్ష్యం వైపు దృష్టి సారిస్తే మేలేమో.  ప్రతి వంద కిలోమీటర్లు పూర్తయ్యాక, అభినందనలకంటే ఎక్కువగా ...  -> ఆ పరిధులో చూసిన/తెలుసుకున్న సమస్యలేమిటి?  -> ఆయా ప్రాంతాలలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?  -> ఆ పరిధిలో ప్రతిపక్షనేత ఇచ్చిన హామీలేమిటి? వాటి ఆచరణీయత ఏమిటి?  -> తెలుసుకున్న సమస్యలలో గత ప్రభుత్వాల కాలం నుండి కొనసాగుతున్న సమస్యలెన్ని? ప్రస్తుత ప్రభుత్వపు తీ...

... నూటికి నూటిపాళ్ళూ నిజం

వంశీ కలుగోట్ల // ... నూటికి నూటిపాళ్ళూ నిజం //  ************************************************** రామ్ గోపాల్ వర్మ పైత్యం  మనం చూసే దృష్టే తప్పించి 'నూటికి నూటిపాళ్ళూ నిజం అంటూ ఏదీ లేదు. మనకు నచ్చిందా లేదా అన్నదే ముఖ్యం తప్పించి మరేదీ ముఖ్యం కాదు' అని నుడివే స్వేచ్చాజీవి రామ్ గోపాల్ వర్మ తన తాజా వెబ్ సిరీస్ 'కడప' ట్రైలర్ లో '... ఇది నూటికి నూటిపాళ్ళూ నిజం' అంటూ వాకృచ్చడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అందునా '... ఇది నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మాత్రమే కాదు నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ దానిపై వాస్తవముద్ర వేయటం మరింత ఆశ్చర్యం. హత్య జరగటం అన్నది మాత్రమే వాస్తవం - ఆ హత్య ఎందుకు జరిగింది అన్నది మాత్రం కథనం. కాగా, వర్మ లాంటి పరిశీలనాత్మక దృక్కోణం ఉన్నటువంటి దర్శకమేధావి కూడా కథనాన్నే 'నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ వాస్తవముద్ర వేయడం ఎంతవరకూ సబబు?  ఆయనను పట్టించుకోకపోవటం అన్నది పరిష్కారం కాగలదా?  ఎంత కాదనుకున్నా సినిమా వంటి దృశ్య మాధ్యమాలు సమాజంపై చూపే ప్రభావం అధికం. అది మంచికంటే చెడు ఎక్కువ. ఉదాహరణకు తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తావిం...

... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు

వంశీ కలుగోట్ల // ... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు // *************************************************** 'మీ అందరి తరఫున నేను పోరాడతాను, నేను ముందుంటాను' అనేవారి అవసరం ఇవుడు (అసలు ఎపుడైనా) ఉందా? జరిగిందో లేదో అని సంవాదాలు జరుగుతున్న పురాణాల కాలం నుండి కూడా ఇంతే పోరాడతామంటూ వచ్చేవారు నాయకులుగా ఎదుగుతున్నారు తప్పించి పీడితులు అలానే ఉంటూనే ఉన్నారు. అధికారం లేదా పదవి ఉంటేనే మంచి చెయ్యగలం అన్నది భ్రమ కాదు - అంతర్లీనంగా ఆయా వ్యక్తులలో ఉన్న 'అధికార కాంక్ష లేదా పదవీ వ్యామోహం లేదా పవర్ పట్ల ఉన్న వ్యామోహం'. ఇంత మంచి చెయ్యాలి, అంత మంచి చెయ్యాలి అనే కొలబద్దలేమీ లేవు. నీకు చేతనైనంత చెయ్యి - నీతో కలిసి వచ్చేవారితో కలిసి పని చెయ్యి. నీ లక్ష్యం మార్పు అంటున్నావు అంటే అది ఎటువంటి మార్పు అన్నది ముందుగా నీకు నువ్వు ఒక అవగాహన తెచ్చుకో. మార్పు అన్నది గుప్పెడు మంది అధికారపదవుల్లో ఉన్న వ్యక్తులను మారిస్తే రాదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న జనాల ఆలోచనల్లో వస్తేనే మార్పు సాధ్యమవుతుంది. అది అంత సులువైన విషయమూ కాదు, తొందరగా జరిగే పనీ కాదు. కానీ, ఎప్పుడైతే అసలు లక్ష్యం నుండి చూపు మరల్చి, అధికార సాధన మీ...