'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి
వంశీ కలుగోట్ల // 'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి // ************************************************************ కథ అయితే ఎలా ఉందో చెప్పొచ్చు, కానీ ఒక జీవితాన్ని చూపిస్తే ... ఏం చెప్పాలి? సినిమా చూద్దామని వెళితే 'అర్జున్ రెడ్డి' అనే వ్యక్తి జీవితాన్ని చూపారు. అప్పట్లో ఒకసారి 'ప్రేమ్ నగర్' సినిమాలోని ' ... నేను నవ్వాను లోకం ఏడ్చింది; నేను ఏడ్చాను లోకం నవ్వింది; నాకింకా లోకంతో పని ఏముంది ...' అన్న పాట విని ఆ పాట రాసిన ఆత్రేయ గారిని ఎవరో అడిగారట 'ఏంటండీ ఆ పాట అర్థం పర్థం లేకుండానూ...' అని. దానికి ఆత్రేయ గారు 'చూడండి, సినిమాలో పాత్ర ఏంటి? ఒక తాగుబోతు తాగి ఆడుతూ పాడే పాట. తాగుబోతు తాగిన తరువాత మాట్లాడే మాటలకి, పాటలకి అర్థం ఏముంటుంది చెప్పండి' అన్నారట. ఇంకేం మాట్లాడతారు. ఈ 'అర్జున్ రెడ్డి' కూడా అంతే. అతి కోపిష్టి, కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు చేసేస్తాడు అంతే. వాడొక ఎదవ, పర్వర్ట్, సైకో, నచ్చితే 'తనది' అనుకునే రకం, తనది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళే రకం, తనను మించి మరెవరినీ అధికంగా ప్రేమించలేని రకం. అర్జున్ ర...