Posts

Showing posts from August, 2017

'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ...

వంశీ కలుగోట్ల // 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ... // *************************************************           'రుద్రవీణ' చిత్రం గురించి ఇవాళ కొత్తగా చెప్పక్కరలేదు. అన్నా హజారే స్ఫూర్తిగా రూపొందించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా ఆశించినంత విజయం సాధించనప్పటికీ అత్యుత్తమ చిత్రాల వరుసలో ఎప్పటికీ నిలబడిపోయే చిత్రంగా, చిరంజీవికి గుర్తుండిపోయే చిత్రంగా ఉండిపోయింది. ఎందుకు అపజయం పాలైందో కానీ, ఎవరు ఈ చిత్రాన్ని బాలేదని అనగా వినలేదు. అలాంటి సినిమాలు రావట్లేదెందుకు అని అనుకుంటూ ఉండేవాడిని. అంటే సందేశాత్మక చిత్రాలు రాలేదని కాదు కానీ వాణిజ్య సూత్రాలకు దూరంగా ఇలా ఒక క్షేత్రస్థాయి సమస్యలతో కథ అల్లుకుని, దాన్ని మ్యాజిక్కులకు దూరంగా వాస్తవిక కోణంలో తెరకెక్కించే ప్రయత్నాలు అరుదు. బహుశా శ్యామ్ బెనెగల్ చిత్రాలు దీనికి మినహాయింపు కావచ్చు. ఇది నా పరిమిత జ్ఞానంతో చేసిన వ్యాఖ్య కాబట్టి, ఎవరైనా సవరించవచ్చు (అటువంటి ఇతర చిత్రాల ప్రస్తావనతో). నిన్న 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' చిత్రం చూశాక నాకు రుద్రవీణ చిత్రమే గుర్తొచ్చింది. దానికీ, దీనికీ కథలో పోల...