Posts

Showing posts from July, 2017

వైఎస్ఆర్సిపీ ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ???

వంశీ కలుగోట్ల // వైఎస్ఆర్సిపీ  ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ??? //  ****************************** *********************************** వైఎస్ఆర్సిపీ  ప్లీనరీలో ప్రతిపక్షనేత జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని హామీలు ప్రకటించారు. ఓట్లు వేసే అన్నివర్గాలను దృష్టిలో  పెట్టుకుని ప్రకటించిన ఈ హామీలను ఒకసారి చూద్దాం ...  -> వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమ క్రింద రైతులకు యాభైవేల రూపాయలు ఇస్తారని ప్రకటించారు. మంచిదే, కానీ ఆచరణ విధివిధానాలు కూడా ప్రకటించగలగాలి. ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి. ఆచరణ విధివిధానాలేమిటో పత్రాల రూపేణా విడుదల చెయ్యాలి.  ->ద్వాక్రా రుణమాఫీ మరియు ఆసరా. మంచి నిర్ణయమే. దీనికి సంబంధించి కూడా ఆచరణయోగ్యమైన అమలు కార్యక్రమాన్ని ప్రకటించాలి.  -> అమ్మ ఒడి - చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులివ్వడం అనే కార్యక్రమం. దీనికి సంబంధించి కూడా ఆచరణ విధివిధానాలు, ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి.  -> హౌసిం...