Posts

Showing posts from March, 2018

... ఓహ్ ఇదొకటుందా

వంశీ కలుగోట్ల // ... ఓహ్ ఇదొకటుందా // ****************************** **** బ్యాంకు అకౌంట్ కాసింత వీక్ గా ఉన్నపుడు, ఏదైనా కాస్త పెద్ద మొత్తం బిల్ పే చెయ్యటానికి క్రెడిట్ కార్డు వాడచ్చులే అని సంబరపడేలోపు క్రెడిట్ కార్డుపై రెండు శాతం సర్వీస్ టాక్స్ ఉంటుంది అని చావుకబురు చల్లగా తెలిసినపుడు * అజ్ఞాతవాసంలో పాండవుల ఆయుధాలలాగా అవసరాలన్నీ కట్టగట్టి ఎక్కడో పెట్టి ... అక్కడా, ఇక్కడా ఊడ్చేసుకున్న డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చని సంబరపడేలోపు; ఇంటి ధర కంటే రిజిస్ట్రేషన్ ఫీజు భయపెట్టినపుడు, ఇవ్వాల్సిన మామూళ్ళు బెదరగొట్టినపుడు * కాలేజీలోనో, కంపెనీ కాంప్లెక్స్ లోనో కంటికింపుగా కనబడింది కదా అని వెంటపడి; కావాల్సిన వివరాలన్నీ కనుక్కుని, ఒక అమ్మాయికి ఐ లవ్ యు అని చెప్తే - పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్న ప్రశ్న ఎదురైనపుడు * అనుభవాలని నుదుటిమీద గీతలుగానో, కళ్ళ కింద గుంతలుగానో కలిగిన వాళ్ళు 'ఆలోచించి అడుగెయ్యండిరా' అని చెప్పినపుడు; గతకాలపు తెలియనితనంగానే అనిపిస్తుంది. మనదాకా వచ్చినపుడు తెలిసొస్తుంది... ఓహ్ ఇదొకటుందా అనిపిస్తుంది