ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
వంశీ కలుగోట్ల // ... ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో //
********************************************************************
********************************************************************
సిగరెట్లు తాగుతున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
మద్యం తాగుతున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
పంచభక్ష్యపరమాన్నాలు భుజిస్తున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
ఇల్లు కట్టుకుని, కారు కొని ... సుఖాలు అనుభవిస్తున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
సెలవులు తీసుకుని విహారయాత్రలు చేస్తున్నావా?
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
--- ఒక్కసారి సరిహద్దుల్లో సైనికుడిని గుర్తు తెచ్చుకో
ఏ, వీటన్నిటికీ అయితే సైనికులతో పోలిక పనికిరాదా? లేక అవి దేశభక్తి అంశాలుగా గుర్తింపబడలేదా?
సిగరెట్లు తాగకురా నాయనా, నీ ఆరోగ్యమే కాదు వాతావరణం పాడైపోతోంది. అది తాగని వాళ్ళను కూడా రోగాల పాలు చేస్తోంది.
మద్యం తాగకురా నాయనా, ఆరోగ్యం సంకనాకి పోతుంది అలాగే డబ్బూ అనవసరంగా వేస్ట్ అవుతుంది.
నువ్వు సిగరెట్లు, మద్యానికి పెట్టే ఖర్చులో కొంత సమాజ సేవకు ఉపయోగించు.
అలా ఎక్కడబడితే అక్కడ చెత్త వెయ్యకు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో. జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు.
--- ఇవన్నీ చెబితే సమాధానం - "నా ఇష్టం, నువ్వెవరు చెప్పటానికి. అయినా నా డబ్బుతో ఎదో నా ఆనందం కోసమో లేక టెన్సన్స్ తట్టుకోలేకనో సిగరెట్లు, మద్యం తాగితే నీకేం నొప్పి? అసలు నువ్వెవడు చెప్పటానికి? ... ప్రతిసారీ చెత్తంతా ఎక్కడికో వెళ్లి పడేయాలంటే నావల్ల కాదు, నీకేమన్నా ఇబ్బంది ఉంటే నువ్వు క్లీన్ చేసుకో..."
ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే ఇవన్నీ దేశభక్తి ప్రమాణాలుగా గుర్తింపబడలేదు మరి.
ఎవరన్నా పూనుకుని వాటిని కూడా ఆ దేశభక్తి జాబితాలో చేర్చండయ్యా? అవి అలవాటు లేని లేక మానేసిన నాబోటి వాళ్ళందరూ విమర్శించటానికి బావుంటుంది.
x
Comments
Post a Comment