సినిమా చూసి వచ్చేయ్

ఖైదీ నెంబర్ 150 - "నాసి రకం సినిమారా భాయ్. కథ ఏమంత గొప్పగా లేదు, కథనం కూడా అంతే, అంతకు మించి ఇది ఒక రీమేక్ సినిమా. అదే పాత తరహా కమర్షియల్ ఫార్ములా బేస్డ్ మూవీ. నాలుగు పాటలు, పాటల కోసమే వచ్చే హీరోయిన్, ఒక ఐటెం సాంగ్, నాలుగు ఫైట్లు, హీరోయిజం, మెసేజ్ లాంటి వ్యవహారం. అంతకుమించి ఏముందిరా ఇందులో." 
--- ఈ కామెంట్లన్నీ ఎవడు పట్టించుకుంటాడురా భాయ్, ఇందులో చిరంజీవి పదేళ్ల తరువాత మళ్ళీ వచ్చి ఇరగదీసేశాడు. అంతకుమించి ఇంకేం కావాలి? 
గౌతమీ పుత్ర శాతకర్ణి - "పేరుకే చారిత్రిక చిత్రం, కానీ ఇందులో అంతా చరిత్రను వక్రీకరించారు. సరైన ఆధారాలు లేవనే వంకతో చిత్తానికి వచ్చినట్టు తీశారు. చరిత్ర అంటే అలుసు అయిపొయింది. యుద్దాలు తప్పించి ఏమీ లేదు సినిమాలో. ఎదో చారిత్రిక చిత్రం అని అన్నా మళ్ళీ ఏవ్ తొడ గొట్టడాలు, మీసాలు దువ్వడాలు, నరుక్కోవడాలు. అంతకుమించి ఏముంది?" 
--- ఈ కామెంట్లన్నీ ఎవడిక్కావాలి? శాతకర్ణి పేరు కూడా 70% మందికి (చదువుకున్నోళ్ళకి కూడా) తెలియదు. ఇది బాలయ్య సినిమా అంతే. మామూలు ధోరణిలో కాకుండా, రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లా కాకుండా బాలయ్య సినిమా బావుంది, ఇంకేం కావాలి? 

సూడు సిద్దప్పా. ఎవరైనా తీసే ప్రతి సినిమాతో సమాజాన్ని, కళా రంగాన్ని ఉద్దరించాలని అనుకోవడం తప్పు. షుగర్ కోటెడ్ మందుల్లాగా సినిమాలు అంతే. ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా జస్ట్ టైంపాస్ కోసం సినిమా చూసి వచ్చేయ్.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన