Posts

Showing posts from April, 2019

... వోటింగ్ అయ్యాక

వంశీ వ్యూ పాయింట్ // ... వోటింగ్ అయ్యాక // ********************************************** వోటింగ్ ప్రకియ ముగిసి అప్పుడే రెండు రోజులైంది. వోటింగ్ సరళిని గమనిస్తే % పరంగా మంచి సంఖ్యా నమోదైందని చెప్పవచ్చు. కొన్ని అంశాలు పరిశీలిస్తే  -> ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన ముందరి అంచనాలకంటే వోట్లు ఎక్కువ తెచ్చుకునేట్టే కనబడుతోంది. కానీ, అది సీట్ల సంఖ్యాపరంగా ప్రభావం చూపేంత స్థాయిలో ఉంటుందా అన్నది మాత్రం అనుమానమే. అంచనాల ప్రకారంగా చూస్తే, ఒకటిరెండు సీట్లు పెరగొచ్చేమో, అదే సమయంలో కొన్ని చోట్ల ఇతరుల అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. నేను స్వయంగా తెలుసుకున్న ప్రాంతాలలో ఈ వోట్ చీలిక అన్నది తెదేపా వోట్ బ్యాంకు నుండి జరిగినది కాబట్టి అది తెదేపాను దెబ్బతీసేదిగా ఉండొచ్చు. ఇది పవన్ కు ఖచ్చితంగా మంచి అంశమే. ఒకవేళ పవన్ కనుక గతంలోలా కాక నిబద్దతతో రాజకీయరంగానికి అంకితమై వుంటే, 2024 నాటికి రెండో ప్రధాన ప్రత్యామ్నాయం కాగలడు, అఫ్ కోర్స్ అది పవన్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది.  -> ఇక పోలింగ్ ముగిసిన తరువాత నుండి చంద్రబాబు వ్యవహారశైలి, ఈసీపై విమర్శలు తెదేపా అవకాశాలపై ఇప్పటికే ఉన్న అనుమానాలను బ