వంకరటింకర కాయలు ...

వంశీ కలుగోట్ల // వంకరటింకర కాయలు ... //
***************************************************
దృశ్యం ఒకటి: 
            ఎప్పుడో, ఎదో గతకాలపు లేదా చారిత్రిక లేదా రాజుల కాలపు రోజుల్లో అంటే అదేనండీ అనగనగా అని చెప్పుకునే రోజుల్లో అన్నమాట. ఒక మహా అందగత్తె ఉండేది. కాకపొతే ఆ మహా అందగత్తె విధివశాత్తూ కటిక పేదరికంలో పుట్టింది. కూరగాయలూ అవీ అమ్మి రోజులు గడిపేది. అలా ఒకరోజు చింతకాయలు అమ్ముతూ రాజాంతఃపురపు వీధుల్లో తిరుగుతోంది. రాజుగారు చూశారు, మనసు పారేసుకున్నారు, వెంటనే తీసుకొచ్చి తన అనేకానేక రాణుల్లో ఒకరిగా స్థానం కల్పించేశారు. అలా ఒకటిరెండు సంవత్సరాలు గడిచాయి. ఆ ఒకటిరెండు సంవత్సరాల తరువాత ఎవరో ఒక మామూలావిడ మళ్ళీ చింతకాయలు అమ్ముతూ అంతఃపురపు వీధుల్లోకి వచ్చింది. నేటి అంతఃపురపు రాణి అనగా ఒకప్పట్లో చింతకాలమ్మిన మన మహా అందగత్తె ఇప్పుడు చింతకాయలమ్మే ఆవిడను పిలిపించిందట. బుట్టలో చింతకాయలు చూసి 'వంకరటింకర కాయలు ఇవేం కాయలు ...' అని ఆశ్చర్యపోయిందట. 

దృశ్యం రెండు: 
            ఇప్పుడు అనగా ఈరోజుల్లో అనగా మీడియా ప్రభావిత రాజకీయపు రోజుల్లోకి వచ్చేద్దాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారికి అప్పటి అధికారపక్షంలో వారు చేసిన ప్రతి పనిలో అవినీతి, ఆస్రితపక్షపాతం, లోపాలు కనిపించాయి. వాటినే విపరీతంగా విమర్శించారు, ప్రచారం చేశారు. జనాలు నమ్మారో లేకపోతే ఆనాటి ప్రభుత్వం పట్ల విసుగెత్తారో తెలియదు కానీ పగ్గాలు ప్రతిపక్షం చేతికి ఇచ్చారు. అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం అయింది. ఇప్పుడు వారు చేసే పనిలో వారికి కేవలం ప్రజాసంక్షేమమే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అవినీతి అంటూ గొంతెత్తితే అవినీతి అంటే ఎలా ఉంటుంది అని అడుగుతారు; విమర్శించే ప్రతివారూ ప్రతిపక్షమే అనిపిస్తుంది. ఈ ప్రతిపక్షం అధికార పీఠం ఎక్కితే వారూ అంతే. ఇది అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన అవినీతి అధికారంలో ఉన్నపుడు కనబడదు. అధికారంలోకి వచ్చాక అవినీతి అంటే వంకర టింకర కాయల్లాగా అనిపిస్తుంది.

సూచన: భక్తులారా రెండవ దృశ్యం ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు, మొత్తం దేవతా గణాన్ని ఉద్దేశించి అని గమనించగలరు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన