Posts

Showing posts from 2019

...  ఎవరిగోల వారిది

వంశీ కలుగోట్ల // ...  ఎవరిగోల వారిది //  *********************************              వ్యాపారం చేయాలనుకునేవారికి ఉచిత సలహా ఒకటి ఇస్తాను - ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవిడియా, నాకు ఫీస్ ఏమీ వద్దు. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరియు నిరంతర ఆదాయం పొందాలనుకుంటే - రెండు వ్యాపారాలు ఉన్నాయి.  ఒకటి              సారా వ్యాపారం. దీనికి మొదట్లో ఖర్చు కాస్త ఎక్కువే అవ్వొచ్చు. ఆ తరువాత మాత్రం అంతా ఆదాయమే. బాధతోనో. దిగులుతోనో, సంతోషంతోనో, కోపంతోనో, ఆవేదనతోనో, మనసు బాలేదనో, ఇంట్లో గొడవ పడ్డారనో ... ఇలా కారణమేదైతేనేం తాగడానికి. అంతేకాదండోయ్ మీరు గమనించారో లేదో - మనదేశంలో నేరాలు చేసినవారిలో దాదాపు 70% దాకా నేరస్థులు మద్యం మత్తులో ఉండగా నేరం చేశారు లేదా నేరం చేయటానికి మద్యంతాగి ఉంటారు. (70% అన్నది కాస్త అటూ ఇటూగా ఉండవచ్చు) ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాలు మద్యనిషేధం లేదా మద్యం అమ్మకాలపై నియంత్రణ వంటి చర్యలు చేపట్టే ఆలోచన మాత్రంచేయడం కష్టం ఎందుకంటే దానిద్వారా వచ్చే ఆదాయం ఒకానొక ప్రధాన ఆదాయవనరు కాబట్టి. మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి లాభసాటి అయిన

... మూడు బెత్తం దెబ్బలు

వంశీ కలుగోట్ల // ... మూడు బెత్తం దెబ్బలు // ***************************************           ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చు అనగానే చాలామంది ఉలిక్కిపడ్డారు, మరికొంతమంది వెటకారాలు మొదలు పెట్టారు. ఇందులో చాలామంది గతంలో చంద్రబాబు అధికర మరియు అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నాడని, అన్నీ అమరావతిలోని పెడుతూ మళ్ళీ మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాడని అన్నవారే. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హై కోర్ట్ కర్నూలుకు లేదా రాయలసీమలోని మరో ప్రాంతానికి (అనంతపూర్ వంటి వెనుకబడిన) ఇస్తే బావుంటుందని అలాగే తిరుపతి వంటి ప్రాంతాన్ని పాలిత కేంద్రంగా చేస్తే బావుంటుందని సూచనలు, సలహాలు ఇచ్చినవారే. ఇపుడు ఆ మేధావుల గత సూచనలకు తగినట్టుగానే అధికార మరియు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగబోయే సూచనలు కనబడుతుంటే ఈ  కావడం లేదు.  - ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికే మూడు రాజధానులు అంటే మరి భారతదేశానికి 29 రాజధానులా అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యా నాకు బట్టతల వచ్చింది కాబట్టి దువ్వెన అవసరం లేదు, అలాగని ఇంకెవ్వరికీ దువ్వెన అవసరం లేదని తీర్మానించేస్తే ఎలా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానితో పాట

వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ //  ****************************** ***************             మనలో చాలామందిమి వేదికనెక్కి మాట్లాడాలంటే చాలా భయపడతాం. క్రింద ఉండగా అనర్గళంగా గంటలకొద్దీ మాట్లాడేవాళ్ళం, వేదికనెక్కగానే నాలుకను ఎవరో లాగేసినట్టు మాటలు బయటకు రావు.నువ్వు స్టేజి మీద బాగా మాట్లాడతావు అనేవారితో నేను ఒకటే చెబుపుతుంటాను 'నీకు స్టేజి ఫియర్ అనేది లేకపోతే, నీముందు నేను సోదిలోకి కూడా రాను' అని. ఇపుడు పాటలు బాగా రాసేవారు, బాగాపాడలేకపోవచ్చు కదా అలాగన్నమాట. అలానే కథలు రాసేవారు (లేదా బాగా కథలు రాసేవారు), సరిగా తీయలేకపోవచ్చు. ఈ సోది అంతా ఎందుకంటే, 'వెంకీమామ' అనే సోది సినిమా గురించి చెప్పటానికి. ఈ సినిమా దర్శకుడు బాబీ అనే కథారచయిత కాబట్టి. నిజజీవిత మామా అల్లుళ్ళు వెంకటేష్ - నాగచైతన్య మామా అల్లుళ్ళుగా నటించిన చిత్రం కావడంతో సహజంగానే 'వెంకీమామ' చిత్రంపై కాస్త ఆసక్తి ఏర్పడింది. ఎఫ్2 వంటి హిట్ చిత్రం తరువాత వస్తున్న వెంకటేష్ సినిమా కావడం కూడా ప్లస్ పాయింట్.                ముందుగా కథ పరంగా చెప్పుకోవాలంటే జాతకాల సమస్యలతో ఇబ్బంది పడిన ఒక కుటుంబ కథ - అంత

వంశీ కలుగోట్ల // ... తడిసిపోతారు //

వంశీ కలుగోట్ల // ...  తడిసిపోతారు // ****************************** ** వాడు: అది పరిష్కారం కాదు  వీడు: మరి ఏది పరిష్కారం  వాడు: పరిష్కారం చెప్పడం అంత సులువు కాదు  వీడు: మరలాంటప్పుడు ఏం చెయ్యాలి  వాడు: ఏమో నేనెలా చెప్పగలను? అయినా నేను చెపితే వింటారా?  వీడు: మరి వాళ్ళకు చెప్పటానికి ట్రై చెయ్యాల్సి ఉండేది, వినేవారేమో  వాడు: వాళ్ళు వీళ్ళకంటే ఘోరం, ఆ టైంలో చెప్తే వింటారా - నన్ను కూడా అదే చేసేవారేమో  వీడు: మరి అలాంటి వాళ్ళను ఇలా చేస్తే తప్పేముంది?  వాడు: నువ్వెన్నైనా చెప్పురా కానీ వాళ్ళది, వీళ్ళదీ ఇద్దరిదీ తప్పేరా  వీడు: నువ్వొకటి గుర్తించటం లేదురా - వాళ్ళది చర్య, వీళ్ళది ప్రతిచర్య. మొదట వాళ్ళు తప్పు చేసుండకపోతే, వీళ్ళు తప్పు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. వాళ్ళు ఘోరమైన తప్పు చేసి, వీళ్ళను తప్పు చేయకతప్పని పరిస్థితుల్లోకి నెట్టారు.  వాడు: నువ్వు భావోద్వేగపరిస్థితిలోనుండి బయటకు రాకుండా, ఆలోచిస్తున్నావు  వీడు: కరెక్టేరా, కొన్నిసార్లు మిగతా అన్నిటికంటే భావోద్వేగాలే మేలనిపిస్తాయి  వాడు: ఇలా మాట్లాడితే ఏం చెప్తాం  వీడు: చెప్పమని ఎవడడిగాడు? అయినా నీకు ఎపుడో చెప్పాను కదా, కొన్నిసార్లు మేధావుల మౌనం క

వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను //

వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను //  ***************************************             నేను మా ఊరికి వెళ్ళినప్పుడంతా చాలామందిని కలిసి మాట్లాడుతుంటాను - పెద్దవారు, నా వయసువారు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలవారితో. ముఖ్యంగా నేను వీలు చేసికునైనా సరే పాఠశాల దగ్గరకు వెళ్ళి - ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలవటానికి ప్రయత్నిస్తాను. ఇక చదువు పూర్తి చేసినవారు మరియు ఉద్యోగార్థులతో ఇంటి దగ్గరే కలుస్తుంటాను. విద్యార్థులు, నాకంటే చిన్నవారిలో ప్రత్యేకించి నేను గమనించిన అంశం ఒకటి ఉంది. చదువుకుంటున్నవారిలో ఒకరకమైన భయం ఉండటం గమనించాను - ఏమవుతుందో, ఏం చెయ్యాలి/చదవాలి?, ఎలాంటి ఉద్యోగమొస్తుందో, ఎలా బతుకుతామో... ఇలా ఎన్నోప్రశ్నలు, భయాలు. అదే సమయంలో అరకొర చదువులతో ఆపేసినవారు, చదవని వారిలో అలాంటి భయం లేకపోవడం గమనించాను. ఎక్కడికెళ్ళినా, ఎలాగైనా బతకగలమనే ధీమా వారిలో కనబడింది. ఇక్కడ కాకపొతే మరోచోట, ఈ పని కాకపొతే మరోటి చేసుకుని బతకగలమనే నమ్మకం; ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తిరిగి నిలబడగలమనే ధైర్యం అలాంటివారిలో (చాలామందిలో) గమనించాను. మన చదువులు ధైర్యాన్నిస్తున్నాయా లేక భయాన్నా? ఏమో, నా పరిశీలనల

వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్

వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్  *********************************             మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రిక చిత్రంగా చెప్పబడిన, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడిగా, తెల్లవారిపై (కంపెనీ లేదా బ్రిటిష్ రాజ్యం) తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందుబాటులో ఉన్న ఆధారాలకు కొంత కాల్పనికత జోడించి తీసిన సినిమాగా - ఎంతో ఉత్సుకతను రేకెత్తించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సినిమా ఎలా ఉంది అనేకంటే ముందు - దేశభక్తి భావనలు ఈ సినిమాద్వారా పెంచుకోవాలనుకునేవారు మరియు చిరంజీవి భక్తులకు ఒక మనవి - ఇక్కడితో చదవడం ఆపెయ్యండి లేదా మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కేవలం నా వ్యూ పాయింట్. సినిమా ఎలా ఉన్నా, 'సైరా' ఖచ్చితంగా, తెలుగు సినిమా సాధించిన అద్భుత కమర్షియల్ విజయాలలో ముందువరుసలో ఉంటుంది అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అన్నిటికంటే ముందుగా ఒక విషయం చెప్పుకుందాం - 'మనీ' సినిమాలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు పెళ్ళి గురించి చెపుతూ, కొన్ని ఫోటోలు చూపుతూ - సేమ్ కార్డ్, ఫొటోస్ చేంజ్ అంటూ వివరిస్తాడు. 'సైరా' సినిమా గురించి చెప్పాలంటే అలా

... 'సాహో' గురించి

వంశీ వ్యూ పాయింట్ // ... 'సాహో' గురించి // *****************************************             సాహో సినిమా గురించి మాట్లాడుకుందాం. శౌర్యం సినిమాలో అనుకుంటా అలీ కాలేజీలో ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కం స్పోర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ బాడీ, టోన్డ్ మసిల్స్ తో కనబడుతుంటాడు. నిజమేంటంటే అతనికి అటువంటి బాడీ ఏమీ ఉండదు. బెలూన్స్ ని బాడీ కి చుట్టుకుని అలా కనబడుతుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న హీరో గోపీచంద్ అతడితో ఓ ఆటాడుకుంటాడు. ఆ ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం సాహో సినిమా గురించి కదూ. సాహో సినిమా గురించి చెపుదామనుకుంటే, ఆ ఆలీ క్యారెక్టర్ మ్యాటర్ గుర్తొచ్చింది అంతే. అంటే ఏం లేదు ఒక మామూలు కథను పట్టుకుని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ కథలో ఏమీ లేకపోయినా, జస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టి - అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ అనుకోమన్నారు. అదన్నమాట విషయం.               సాహో చిత్రాన్ని ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేశారు, అఫ్ కోర్స్ అదే నిజమనుకోండి. బహుశా దర్శకుడు మరియు కథకుడు అయిన సుజీత్ ఈ కథ రాసుకున్నపుడు అతడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసు

... తిరుమల టికెట్స్ వ్యవహారం

వంశీ వ్యూ పాయింట్ // ... తిరుమల టికెట్స్ వ్యవహారం // *****************************************************             తిరుమల వెళ్ళే బస్సులో టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర గురించిన ప్రకటన ముద్రించడం అన్నది ఖచ్చితంగా సున్నితమైన భావాలను రెచ్చగొట్టగల అంశం, తప్పు. అయితే, దీన్ని వెంటనే జగన్ కు  ఆపాదించి, క్రైస్తవ మత ప్రచారం మొదలు పెట్టాడు అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అంతకంటే బాధ్యతారాహిత్యం.  నాకు అర్థం కానీ విషయాలు ఏంటంటే -> ఈ టిక్కెట్ల వెనుక ప్రభుత్వ పథకాల ప్రచారం అన్నది చంద్రబాబు ప్రభుత్వం చేసినది. ఆ ప్రకటనలలో ఏమున్నదో ఒకసారి చూడండి - 'గత నాలుగున్నరేళ్ళలో' అని సుస్పష్టంగా ఉన్నది. అంటే, దిగిపోకముందే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన పని అది అన్నది స్పష్టం. అపుడు ఎవరూ ప్రశ్నించలేదు. అసలు అవి కనీసం ప్రింట్ అయ్యాయో లేదో కూడా ఎవడికి తెలియదు. కానీ, ఇపుడు దానిని జగన్ కు ఆపాదించి గొడవ చేస్తున్నారు.  ->  శ్రీశైలం ఈవో విషయంలోనూ ఇలానే జరిగింది. కానీ, అతడు జగన్ వచ్చాక నియమించబడ్డ వ్యక్తి కాదు. కానీ, గొడవ మాత్రం జగన్ సీఎం అయ్యాక జరిగింది. 

... కొన్ని జ్ఞాపకాలు: 1

వంశీ కలుగోట్ల // ... కొన్ని జ్ఞాపకాలు: 1 // ****************************************             ఒక్కోసారి అనిపిస్తుంది మనిషి అంటే ఒక కదిలే జ్ఞాపకాల దొంతర అని. కొన్ని జ్ఞాపకాలు మనల్ని నిలబెడతాయి, నడిపిస్తాయి; మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని తలదించుకునేలా చేస్తాయి, సిగ్గుపడేలా చేస్తాయి. కొన్నిసార్లు జ్ఞాపకాలలో మనముండకపోవచ్చు - లేదా వేరే వారు ఆ జ్ఞాపకాలను ప్రభావితం చేసినవారు అయి ఉండవచ్చు. అలా నాకు చాలాసార్లు గుర్తొచ్చే జ్ఞాపకాలలో ఒకదాన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఇది ఎటువంటి జ్ఞాపకం అనేది నేను మొదటే చెప్పాలనుకోవట్లేదు. చదవండి. నా అభిప్రాయం ప్రకారం మనుషుల్లో మంచివారు, చెడ్డవారు అంటూ ఉండరు - పరిస్థితులు, అనుభవాలు వారిని కొన్ని సమయాలలో అలా ప్రవర్తించేలా డ్రైవ్ చేస్తాయి. ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే, మనీషి లేదా మామూలు మనిషి. ఈ అనుభవంతో ఎవరెలాంటివారో నేను జడ్జ్ చెయ్యట్లేదు. చదవండి ...  *            *            *             అది 2010 వ సంవత్సరం, డిసెంబర్ 18. యునైటెడ్ కింగ్డమ్ లోని మిల్టన్ కీన్స్ సిటీ. అప్పటికే నేను అక్కడికెళ్లి దాదాపు మూడు సంవత్సరాలయ్యింది. ఇంగ్లాండ్ లో శీతా

... తెలుగోడి శతృవు

వంశీ కలుగోట్ల // ... తెలుగోడి శతృవు // ********************************** వాడు: అరేయ్ మన తెలుగోళ్ళు కులగజ్జిగాళ్ళు, వెధవలు, మూర్ఖులు, ఎంతకైనా దిగజారే నీచులు అట కదరా.  వీడు: ఎవరు చెప్పార్రా?  వాడు: ఎవరో చెప్తే నేనెందుకు పట్టించుకుంటానురా, మన తెలుగోడే చెప్పాడు.  వీడు: అదేరా ఇసయం. తెలుగోళ్ళకు శతృవులు ఉత్తరాదివాళ్ళు, తమిలోళ్ళు అంటూ వేరే ఎవరూ ఉండర్రా. మన తెలుగోళ్ళ రూపంలోనే, మన మధ్యనే తిరుగుతూ, మననే సం ... వద్దులే అసలే ఈ మధ్యన సెన్సారోళ్ళు మరీ ఎక్కువగా గొంతులు నొక్కేస్తున్నారు. నీకర్థమైందిగా ఆ ...  వాడు: మరిప్పుడేం చెయ్యాలిరా?  వీడు: అరేయ్ జులాయి సినిమాలో బిట్టూ ఏం చెప్పాడురా 'మనమేం చెయ్యాలని ఎప్పుడూ ఎవరినీ అడక్కూడదు' అని సెప్పాడా లేదా. అయినా, నువ్వడిగావు కాబట్టి సెప్తన్నా - చేసేదేం లేదురా, మన డాక్టర్ సాబ్ చెప్పాడుగా బాల్ బాగా పిసుక్కుందాం అంతే. బాల్ ఎంత బాగా పిసుక్కుంటే అంత ప్రశాంతత. పోయి బాగా పిసుక్కో 

... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు

వంశీ వ్యూ పాయింట్ // ... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు // ********************************************************** తెదేపా                అవమానాల్ని, ఓటముల్ని తట్టుకోవటం తెదేపాకు, చంద్రబాబు గారికి అలవాటే. తట్టుకుని నిలబడ్డారు కాబట్టే, నేను అత్యంత సీనియర్ ని అని చెప్పుకోగలిగే స్థాయిని సంపాదించుకుని నిలబడ్డారు. ఈ ఓటమికంటే, ఈ శతృవు చేతిలో ఓటమి ఆయనను ఎక్కువగా ఆబాధిస్తున్నట్టుంది. అయినా అదంతా పక్కనబెట్టి, సభలో చక్కగానే వ్యవహరిస్తున్నారు. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ, గత అయిదేళ్లతో పోల్చితే ఇపుడు వ్యవహరిస్తున్న తీరు బెటర్ అని చెప్పవచ్చు.తెదేపా అభిమానులను బాధిస్తున్న అంశం ఏంటంటే పార్టీ నాయకుల తీరు. గెలిచినా 23 మంది అయినా గట్టిగా పోరాడుతున్నారా అంటే లేదు, భాజపా తమతో 18 మంది టచ్ లో ఉన్నారు అన్నా కూడా ఎవరూ స్పందించటం లేదు. అంతేకాక సభలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య గారు, అప్పుడప్పుడు పయ్యావుల కేశవ్ మినహా మిగతావారు పెద్దగా నోరు మెదపట్లేదు. వారు భయపడుతున్నారా లేక పార్టీ వీడటానికి మంత్రాంగం నడుపుతున్నారా అన్నది చెప్పలేకపోయినప్పటికీ వారి మౌనం మాత్రం పార్టీ అభిమానులతో సహా

... కత్తిమీద సాము చేస్తున్న జగన్

వంశీ వ్యూ పాయింట్ // ... కత్తిమీద సాము చేస్తున్న జగన్ // ********************************************************             ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు కారణమెవరు అన్నది పెద్ద ప్రశ్న కాదేమో - రాజకీయ గెలుపోటములు నేర నిర్ధారణలు కాకపోయినా ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే ఒకరు ఘోర ఓటమితో అవమానభారాన్ని ఎదుర్కొనగా, ఊహించని విజయాన్ని పొందిన మరొకరు అధికారపీఠం ఎక్కారు. పరిస్థితులకు కారణం ఎవరైనా సరే, ముందు పరిస్థితులు చక్కదిద్దబడాలి. వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలి. అదే సమయంలో గత ప్రభుత్వపు మితిమీరిన అవినీతిని తవ్వి తీయాల్సిందే. ఎందుకంటే ఇపుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని పనులు సాధ్యపడవు, కొన్ని చోట్ల అప్పులు పుట్టవు, కేంద్ర ప్రభుత్వం పాత ప్రభుత్వపు ఖర్చుల లెక్కలు అడుగుతోంది - అవి సమీకరించటానిక్ ఇసయం పట్టవచ్చు - అంతవరకూ కేంద్రం అదనపు నిధులు ఇవ్వకపోవచ్చు. ఇందుకు కారణం ఖచ్చితంగా గత ప్రభుత్వమే కదా, మరి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. ఇపుడున్న పరిస్థితుల్లో ఇపుడు ప్రాధాన్యత క్రమం ఏది అని చెప్పటం బహు క్లిష్టమైన అంశం - అదుపు తప్పిన వ్య

... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు

వంశీ వ్యూ పాయింట్ // ... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు // ************************************************************             సాధారణంగా శాసనసభ సమావేశాలు వంటివి చూడను, వాటి గురించి వార్తాపత్రికలలో చదువుతాను. 2019 ఎన్నికల తరువాత కొంత ఆసక్తి కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఘోర ఓటమి తరువాత ఎలా వ్యవహరిస్తారు, ఊహించనంతటి విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ గారు ఎలా వ్యవహరిస్తారు అని ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ఇంతకాలం వైరివర్గ ప్రోద్బలిత కష్టాలు అనేకం ఎదుర్కొన్న జగన్ గారు, ఈ విజయం తరువాత సహనంతో ఉండే తన తీరును అలానే ఉంచుకోగలరా అనే సంశయం కలిగింది. అదే సమయంలో అనేక దిగ్గజాలను ఎదుర్కొని నిలబడిన చంద్రబాబు గారు ఇపుడు దాదాపు తన అనుభవమంత వయసున్న జగన్ గారిని సభలో ఎలా ఎదుర్కొంటారు అని కూడా ఆసక్తి కలిగింది. ఇపుడు శాసనసభ సమావేశాలు చూస్తోంటే "ఇలాంటి శాసనసభ సమావేశాలు ఇలా చూసి ఎన్నేళ్ళయింది?" అని అనిపిస్తోంది ...  నేను గమనించిన కొన్ని అంశాలు  - ముందుగా సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారి గురించి చెప్పుకోవాలి. నేను సీరియస్ గా రాజకీయాలను గమనించటం మొదలుపెట్టినప్

... పవనన్నయ్యా, ఇవి విన్నావా?

వంశీ కలుగోట్ల // ... పవనన్నయ్యా, ఇవి విన్నావా? // ************************************************** ఇదిగో పవనన్నయ్యా ఇవన్నీ విన్నావా  -> కిడ్నీ బాధితులకు (ఉద్దానం) నెలకుఅండ్ ఆర్ధిక సహాయం పదివేల రూపాయలకు పెంచారు    -> ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సయిట్ తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించారు. తమరికి గుర్తుందో లేదో, ఒకసారి తమరు వెళ్ళి ఆ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులను కలిసి, సంఘీభావం తెలిపి మరీ వచ్చారు  -> అలాగే ఆ అగ్రి గోల్డ్ వ్యవహారానికి సంబంధించి త్వరితగతిన 1150 కోట్లు పరిహారం బాధితులకు అందేలా చర్యలు చేపడుతున్నారు -> హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాల్సిందిగా కూడా ఆదేశించారు ... ఇవి కొన్నే సుమీ  ఇపుడు వీలయితే ప్రశంసించండి.    ఊరికే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని మాత్రమే కాదు ప్రశంసించడం కూడా నేర్చుకుంటే బావుంటుంది ...              అయినా ఏదో వందరోజుల టైం ఇస్తా అన్నారు, దేనికో కనీసం తమరికైనా క్లారిటీ ఉందా? ఇపుడు ప్రజలు తమరికి అయిదేళ్ళ సమయం ఇచ్చారు. ఊరికే గుడ్డు మీద ఈకలు పీకటం, నా

... అమ్మఒడి పథకం గురించి

వంశీ కలుగోట్ల // ... అమ్మఒడి పథకం గురించి //  ****************************** ***************             అమ్మఒడి పథకం అమలు గురించి పలు రకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వస్తున్నవి. ముఖ్యంగా, దాదాపుగా అందరూ ఏక కంఠంతో ఖండిస్తున్నది ఈ పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేయడం గురించి. వ్యక్తిగతంగా నేను కూడా దీనిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయటాన్ని వ్యతిరేకించాను, వ్యతిరేకిస్తున్నాను కూడా. కానీ, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే జగన్ గారు ఇది ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆలోచించి, ప్రకటించిన పథకం కాదు. ఎన్నికలకంటే దాదాపు రెండేళ్ళ ముందే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ తరువాత పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ స్పష్టంగా ప్రకటించారు 'పిల్లలను బడులకు పంపే తల్లులకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాను' అని. ముందుగా ఒక అంశం - ప్రత్యేకించి చెప్పకపోయినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత తెల్ల రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ వంటివాటికి తత్సంబంధిత కార్డు కాబట్టి ఇది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న తల్లులందరికీ వర్తిస్తుంది. ఇక నాకు తెలిసినంతవరకూ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు బాలకార్మికులను తగ్గించ

... బురదోపాఖ్యానం

వంశీ కలుగోట్ల // ... బురదోపాఖ్యానం //  ************************************ మనం బురదలో రాయి వేయాలి అన్నపుడు కొన్నిటికి సిద్ధంగా ఉండాలి అలానే కొన్ని విషయాలు తెలుసుకోవాలి  - బురద మన మీద పడగలదు అని అర్థం చేసుకోవాలి - ఎంత దూరంగా ఉండి రాయి వేస్తే బురద చిట్లి మనమీద పడదో అంచనా వేసుకోవాలి - ఎటువంటి రాయి వేస్తే ఎంతదూరం చిట్లుతుంది అన్నది అంచనా వేసుకోవాలి - బురద ఎటువంటిది - అంటే అది సహజంగా ఏర్పడినదా లేక ఎవరైనా బురదగుంటను కావాలనే  ఏర్పరచారా అన్నది తెలుసుకోవాలి  - నిజంగానే బురద ఉందా, లేక ఉన్నట్టుగా కనబడుతోందా అని నిర్ధారించుకోవాలి  - ఆ బురద వర్షపు నీటివల్ల ఏర్పడినదా లేక మురుగునీటితో ఏర్పడినదా అన్నది తెలుసుకోవాలి  - చివరగా, అసలు బురదలో రాయి వెయ్యాలా వద్దా అని మరోసారి సమీక్షించుకోవాలి ఇవేవీ చెయ్యకుండా - బురదలో రాయి వేసి బురద చిట్లింది అంటూ విచారించి లాభం లేదని బురదలో రాళ్ళేసే ఎదవలందరికి చెప్పమని మా శకుంతలాకియా సందేశం పంపింది. 

... పతనమా? వ్యూహమా?

వంశీ కలుగోట్ల // ... పతనమా? వ్యూహమా? // ****************************** **************             తెదేపా నుండి భాజపాలోకి లెక్కకు మిక్కిలిగా వలసలు జరగవచ్చు, తద్వారా రాష్ట్రంలో భాజపా బలమైన ప్రత్యామ్న్యాయంగా ఎదగటానికి ప్రయత్నిస్తోంది అని కథనాలు వస్తున్నవి (ఆ కథనాలకు గతంలో నేనూ ఒక సమిధను వేశాననుకోండి). ఆ విధంగా జరగటంలో గల సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలించి చూద్దాం. ఈ అంశాన్ని ఒక్క కోణంలోంచి విశ్లేషిస్తే న్యాయం జరగదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అభినవ రాజకీయ చాణక్యుడిగా పేరొందిన వ్యక్తి, బూడిదనుండి కూడా పునరుజ్జీవనం పొందగలిగే ఫీనిక్స్ పక్షి లాంటివాడు అని అభిమానులు భావించే వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉరఫ్ బాబుగారు ఉరఫ్ దార్శనిక మేధావి కాబట్టి ఏదీ అంత వీజీ కాదు మరీ ముఖ్యంగా తెదేపా దుకాణం సర్దేయడం అన్నది అంత వీజీ అయిన పని కాదు. ముందుగా ఈ వలసల వల్ల ఏం జరగవచ్చు అనేది రెండు కోణాల్లోంచి పరిశీలించి చూద్దాం.  *            *            *                ముందుగా తాజా ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కున్న తెదేపా బలహీనపడింది అన్న కోణంలోంచి పరిశీలించి చూద్దాం. గతంలో ఎన్నడూ ఎదుర్కొనంత ఘోరమైన ఓటమిని ఎద