సామాన్యుడు మాత్రమే త్యాగాలు చెయ్యాలా?
సామాన్యుడు మాత్రమే
త్యాగాలు చెయ్యాలా?
******************************************
సామాజిక
మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక ఫోటో చూసాను - గంటలకొద్దీ ఐ
ఫోన్ కోసం, సినిమా టికెట్స్ కోసం, రోడీ షో కోసం, జియో సిమ్ కోసం ...
ఎట్సెట్రా వాటికోసం నిలబడతారు కానీ ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకోవడానికి
నిలబడలేరా అంటూ; ఒక మహా ఆశయం కోసం త్యాగాలు చేసి తీరాల్సిందేనంటూ
నీతిపాఠాలు వల్లిస్తున్నారు, ప్రవచనాలు బోధిస్తున్నారు. అయ్యా ...
నువ్వు చెప్పినట్టు సినిమా మొదటి ఆట టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డ దినకూలీ ఎవడూ లేడు
నువ్వు చెప్పినట్టు కొత్త ఐ ఫోన్ కోసం గంటలకొద్దీ క్యూలో నిలబడ్డ చిరుద్యోగి ఎవడూ లేడు
నువ్వు చెప్పినట్టు రోడీ షో కోసం వెర్రెత్తిపోయిన గృహిణి ఎవరూ లేరు
నువ్వు చెప్పినట్టు జియో సిమ్ కోసం క్యూలో నిలబడ్డ రైతన్న ఎవరూ లేరు
నువ్వు చెప్పినట్టు మెగా సేల్ కోసం క్యూలో నిలబడ్డ వయోవృద్దులు ఎవరూ లేరు
...
ఇప్పుడు చెప్పు - ఒళ్ళు బలిసో, విలాసాల కోసమో లేక దర్పం చూపటం కోసమో
నువ్వు చెప్పినవన్నీ చేసే వారితో పోలిక తెచ్చి ఇవాళ ఇబ్బందులు పడుతున్న
వారిని కించపరచడం సరి అనిపిస్తోందా?
ఊ అంటే ఆ అంటే సైనికుల గురించి ప్రస్తావన తెచ్చి దేశభక్తిని శంకిస్తారేమిటి ... ?!!!
ఏం, నువ్వు బారులో కూచుని లెక్కకుమిక్కిలి బీర్లు తాగినప్పుడు సైనికుడు గుర్తుకు రాలేదా?
పెళ్ళాం ఊరెళితే బుద్ధి పక్కదారులు పట్టినపుడు సైనికుడు గుర్తుకు రాలేదా?
పబ్లిక్ ప్లేసులో సిగరెట్లు తెగ తాగినప్పుడు బాధ్యతారాహిత్యం గుర్తుకు రాలేదా?
సాయం అందక ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి విన్నపుడు సామాజిక బాధ్యత గుర్తు రాలేదా?
...
...
మహాశయా, నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పు పట్టటం లేదు. తద్వారా ఎదురవ్వబోయే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే సరియైన మధనం/ఆలోచన/చర్యలు
లేకుండానే చెయ్యటం గురించే కదా విమర్శిస్తోంది! అయిదువందల నోటుతోనే బ్లాక్
మనీ సమస్యలు ఎక్కువవుతున్నాయంటే, దాన్ని అరికట్టటానికని చెప్పి
రెండువేలరూపాయల నోటు తీసుకురావటమేంటి అని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఆయన
గుండెలు ఒప్పొంగేలా ప్రసంగించవచ్చు, కడుపు మండిన వాడినేవాడినైనా
తీసుకువస్తే గుండెలు కరిగేలా ఏడవగలడు, అప్పుడేమంటావు? సామాన్యుడు మాత్రమే
త్యాగాలు చెయ్యాలా? ఇంకెవడూ చెయ్యడా? త్యాగాల గురించి మాట్లాడవద్దు, చరిత్ర
మొదలైన నాటినుండి త్యాగాలు చేస్తున్నది సామాన్యుడే, వాడి చిత్తశుద్ధిని
శంకించే నిబద్ధత నీకే కాదు మరెవరికీ లేదు.
Comments
Post a Comment