ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'ఖైదీ నెంబర్ 150' గురించి
వంశీ కలుగోట్ల // ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'ఖైదీ నెంబర్ 150' గురించి //
*******************************************************************
గమనిక:
సినిమాల పరంగా నేను చిరంజీవికి వీరాభిమానిని. కాబట్టి, ఖైదీ నెంబర్ 150
గురించి నా వ్యూని చదవాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోండి. కేవలం సినిమా
గురించే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇక్కడ రాజకీయాలు
అప్రస్తుతం. సందేశాత్మక సినిమాలు సమాజాన్ని మారుస్తాయి అని భ్రమించడం ఎంత
తప్పో ఆ సినిమాల్లో నటించే నటీనటులు ఆ విలువలను పాటిస్తారని అనుకోవడం కూడా
అంతే తప్పు. రాజకీయంగా చిరంజీవిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను, కానీ
సినిమాల పరంగా విపరీతంగా అభిమానిస్తాను. మీరు ఆ రెండింటిని వేరు చేసి
చూడలేకపోతే దీన్ని చదవకుండా మానెయ్యొచ్చు, లేదా చదివినా స్పందించకుండా
వదిలెయ్యొచ్చు. ఇది కేవలం నా 'వ్యూ' కాబట్టి 'వాడింతే' అనుకుని ఊరికే
ఉండొచ్చు కూడా. *******************************************************************
* * *
'బాస్ ఈస్ బ్యాక్' అన్న ఏకైక అంశమే లేకపోతే ఒక విఫల ప్రయత్నంగానో లేకపోతే
ఒక మామూలు సినిమాగానో మిగిలిపోవాల్సిన 'ఖైదీ నెంబర్ 150' నిర్మాతగా రామ్
చరణ్ తరువాతి చిత్రాల పరంగా ఒక పాఠంగా తీసుకోవాలి. తాను నిర్మించబోయే
తరువాతి సినిమాలకు కథను నమ్ముకుంటే బావుంటుంది. ఇక, ఇప్పటికే
ప్రకటించినట్టు రెండవ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'
నిర్మించేటట్టయితే, అందులో కథనం పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
నిర్మాణ సంస్థ విలువను పెంచేదిగానే కాక అజరామరంగా నిలిచిపోయే చిత్రం
కాగలదు.
Comments
Post a Comment