సంయమనం
ఏంటో -
పెద్దాయన, జాతిగొట్టాలు, మరికొందరు తెగ ఆందోళన పడిపోతున్నారు. 'విశాఖను
తగలబెట్టటానికి అనుమతివ్వాలా?' అని ఊగిపోయారు, ఇలా చేస్తే పెట్టుబడిదారులు
వస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ ప్రశ్నలకు వారి వద్ద
సమాధానాలున్నాయా?
->
గతంలో అనగా చరిత్ర కాలం కాదులెండి 2004 తరువాత నుండి 2014 వరకూ తమరు
అయినదానికి కానిదానికీ రోడ్డెక్కి ఆందోళన బాట పెట్టినపుడు పైన పేర్కొన్న
విషయాలు గుర్తుకు రాలేదా? లేక అప్పుడు సబబు అనిపించినవి ఇప్పుడు
కాదనిపిస్తున్నాయా. నిరసన వ్యక్తం చేయటం అన్నది రాజ్యాంగబద్ధంగా
సంక్రమించిన హక్కు. ప్రతిపక్ష నేతను, రాజకీయ నేతలను రానివ్వకుండా
అడ్డుకోండి; అది శాంతిభద్రతల కోసమో మరెందుకో అనుకుంటారు. మరి ఎటువంటి
పార్టీ జెండాలు లేకుండా శాంతియుత నిరసన వ్యక్తం చేయటానికి ప్రయత్నించిన
యువతను, నిరసనకారులను అడ్డుకోవడం ఎందుకు?
->
ఆందోళన యే విషయంగా చెయ్యాలని ప్రజలు ఉద్యమించజూశారు? ఎన్నికల సమయంలో తమరు
నొక్కి వక్కాణించి, అది వస్తే ఎంత మేలో వివరించి చెప్పిన 'ప్రత్యేక హోదా'
గురించే కదా. తదనంతర పరిణామాల నేపథ్యంలో (ఓటుకు నోటు లేదా మరేవైనా కావచ్చు)
తమరు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటున్నారు. ఎలా, ఐ మీన్ హౌ? హోదా వస్తే
రాయితీలు వస్తాయి, ప్యాకేజీ అంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎలా తినాలో
రాజకీయనాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదని మాకందరికీ తెలుసు. అందుకే
డబ్బులొద్దు, హోదా కావాలంటున్నాం. అయినా మీరు చెప్పే ప్యాకేజీకి చట్టబద్ధత
ఉందా, చెప్పినవన్నీ ఇస్తారన్న నమ్మకం ఉందా? సాక్షాత్తూ అప్పటి ప్రధాని
రాజ్యసభలో ఇచ్చిన హామీకే చట్టబద్ధత లేదని సదరు భాజపా వారు సెలవిచ్చి
ఉండిరి. మరి వారు పత్రికా సమావేశంలో వాక్రుచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత
ఉంటుందని తమరు ఎలా నమ్మారో మాకు అర్థం కావట్లేదు.
... ఇప్పటికి చాల్లే, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ కలుసుకుందాం.
Comments
Post a Comment