వారే హీరోలు ...
కథలో, కథనంలో ఎటువంటి నవ్యత లేకుండా
సినిమా తీస్తూ నెలల తరబడి షూటింగ్ చేస్తూ నిర్మాతల జీవితాలతో ఆడుకుంటున్న
యువనటులకు 'ఖైదీ నెంబర్ 150' ఒక పాఠం. అవును, ఖైదీ నెంబర్ 150 చిత్రం
ఎటువంటి నవ్యతనూ అందించకపోవచ్చు. చిరంజీవి పునరాగమనం అన్న ఒక్క విషయం
తప్పిస్తే అందులో ఆకట్టుకునే మారె ఇతర అంశాలూ లేకపోవచ్చు; ఇవ్వాళ
యువనటులుగా పేర్కొంటున్నవారు అంతకంటే నాసిరకం సినిమాలు తియ్యటానికి ఇంతకు
రెట్టింపు సమయం తీసుకుంటున్నారు. అలాగే గ్రాఫిక్స్, విసువల్ ఎఫెక్ట్స్,
క్వాలిటీ పేరుతో సంవత్సరాల తరబడి సినిమాలు తీసే దర్శకులకు; ఎంచుకున్న
అంశాన్ని సరిగా అర్థం చేసుకుని, సరియైన ప్లానింగ్ ఉంటే తక్కువ సమయంలో మంచి
నిర్మాణ విలువలతో తీసి చూపవచ్చని 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంతో క్రిష్
నిరూపించాడు. ఈ చిత్రం ఇంత త్వరగా పూర్తవ్వడంలో బాలకృష్ణ పాత్ర కూడా
ప్రశంసనీయం. అరవై వయసొచ్చినా ఇంకా హీరోలుగానేనా అంటూ ఊరికే విమర్శలు
చెయ్యడం కాదు; యువనటులుగా పేరుపొందిన వారికి మూడు, నాలుగు నెలల కాలంలో
సినిమాలు పూర్తి చేసి విడుదల చేసి సవాలు చేసిన ఈ అరవైలలో ఉన్న చిరంజీవి,
బాలకృష్ణలే ఇప్పటికీ హీరోలు. ఇంక ఇప్పుడు మొదటి స్థానంలో మహేష్ బాబు, పవన్
కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - వీరిలో
ఎవరు అనే అనవసర చర్చ వృధా. స్థానాల గురించి మర్చిపోయి వారితో పోటీపడి
సినిమాలు తియ్యటం గురించే పేరుకు మాత్రమే యువహీరోలైన మిగతా వారి పని. వారి నిబద్ధత నుండి పాఠాలు నేర్చుకుని పనిచేయాలి యువహీరోలు (వారి వంశాల నుండి వచ్చిన వారితో సహా). చిరంజీవి, బాలకృష్ణలకు అభినందనలు ...
Comments
Post a Comment