... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - వైఎస్సార్సీపీ

వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - వైఎస్సార్సీపీ //
*******************************************************************
            2019 ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పక్షాల అవకాశాల గురించి రాస్తానని చెప్పాను - ఒక్క వైఎస్సార్సీపీ తప్పించి మిగతా పక్షాల అవకాశాల గురించి నా దృక్కోణంలోంచి విశ్లేషణ చేస్తూ, వివరణ ఇస్తూ వ్యాసాలు రాశాను. ఇక ఇది చివరిది - ఇందులో వైఎస్సార్సీపీ అవకాశాల గురించి ప్రస్తావిస్తాను. ఇప్పటికే రాసిన మిగతా వ్యాసాలు చదివిన వారికి స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే - ఈసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు సుస్పష్టంగా ఉంన్నాయి అన్నది నా అంచనా. పలు జాతీయ, స్థానిక సర్వేలు కూడా అదే విషయాన్ని ప్రస్తావించాయి. నేను వారి స్థాయిలో సర్వేలు అవీ ఏమీ చెయ్యలేదు. నా పరిధిలో, తెలుసుకున్న విషయాలను సమీక్షించుకుని అంచనాలను ఏర్పరచుకున్నాను. వైఎస్సార్సీపీ అవకాశాలను గురించి చర్చించుకునే ముందు - కొన్ని అంశాలను ప్రస్తావించుకోవాలి. 
             ముందుగా తెదేపా మరియు వారి పక్కవాయిద్యాలు ప్రచారం చేస్తున్న జగన్ పై కేసులు, గత రెండు సంవత్సరాలుగా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవటం అందులో ప్రధానమైనవి. జగన్ పై కేసులు, అవినీతి ఆరోపనలు అన్నవి ఇవాళ కొత్తవి కాదు. గత తొమ్మిది సంవత్సరాలుగా అవే అవే కథనాలు హెడ్డింగ్స్ మారుస్తూ పచ్చమీడియా ప్రచారం చేస్తూనే ఉంది, ఇప్పటికంటే ఎక్కువగా ప్రచారం చేసిన 2014 సమయంలోనే జగన్ 67 స్థానాలు గెలుచుకోగలిగాడు. అందునా, రాజకీయాల్లో అవినీతి అన్నది జనాలు పట్టించుకోవడం మానేసి దశాబ్దాలు గడిచిందేమో. ఎందుకంటే ప్రజల దృష్టిలో తమకు నచ్చిన రాజకీయ నాయకుడు 'లెస్సర్ ఈవిల్' అంతే. దాని అర్థం జగన్ గారిపై ఆరోపణలు ధృవీకరించేంచినట్టుగానో లేకపోతే కొట్టిపారేసినట్టుగానో కాదు. పరిస్థితిని చెబుతున్నాను ఆంతే. మోదీ మొదలుకొని, మాజీ సర్పంచ్ దాకా అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు దాదాపు ఉండరు. రుజువై, శిక్షలు పడినవారు కూడా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇక జగన్ గారిపై అవినీతి ఆరోపణలు ఇంకా కోర్ట్ పరిధిలో ఉంన్నాయి కాబట్టి, అవి తేలేవరకూ అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడుగానే చూడబడతాడు కానీ నేరస్థుడు కాదు అని నా అభిప్రాయం. (ఇది ఒక్క జగన్ విషయంలో కాదు, ఎవరి విషయంలోనైనా అంతే) ఇక శాసనసభకు హాజరు గురించి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోమని ఎంతగా అడిగినా స్పీకర్ ఇంతవరకూ స్పందించలేదు, చివరకు కోర్ట్ ఆదేశించినా స్పీకర్ కోర్ట్ పరిధిలోకి రద్దు అని చెప్పి తప్పించుకుంటున్నారు; గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ అటు సభలోనూ, బయటా పూర్తిగా తెదేపా వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. రోజా విషయంలో, రోజాతో సమానంగా లేదా అంతకుమించిన స్థాయిలో అభ్యంతరకరమైన భాష మాట్లాడినా అచ్చెన్నాయుడు వంటివారిపై చర్యలు తీసుకోకపోగా కేవలం రోజా మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఇక సభలో ప్రతిపక్షనేత జగన్ అంకెలతో కూడిన వివరాలతో ప్రశ్నిస్తూ ఉంటే, అధికార పార్టీ సభ్యుల తీరు అందరూ చూసినదే. ప్రతిపక్షం శాసనసభకు హాజరు కాకపోవడంతో స్పీకర్ పాత్ర ప్రధానమైనది. బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినా స్పీకర్, పక్షపాతంగా వ్యవహరించడం వేరే దారిలేని పరిస్థితి ఏర్పరచింది. 
             ఇక వైఎస్సార్సీపీ బలమూ మరియు బలహీనతా రెండూ అధినేత జగన్ మాత్రమే. తొమ్మిదేళ్ళుగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలలో పటిష్ట క్యాడర్ వ్యవస్థను ఏర్పరచుకోలేకపోవడం ఒక ప్రధాన లోపం కాగా, ఇతర నాయకులందరూ (ఎవరో ఆర్కే లాంటి కొందరు వదిలేసి) ఇప్పటికీ జగన్ మీదే ఆధారపడటం అతి ప్రధానమైన సమస్య. జగన్ గారు చేసిన అతి సుదీర్ఘ పాదయాత్రతో పాటు, పలు కీలక/సున్నిత సందర్భాలలో ఏంటో పరిణితితో మరియు సంయమనంతో వ్యవహరించినతీరు తటస్థులలో కూడా మంచి అభిప్రాయాన్ని ఏర్పరచింది. ముఖ్యంగా అటు పవన్ ఇటు తెదేపా ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ తాను సంయమనంతో ఉండటమే కాక తన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా అదుపులో ఉండేలా చెయ్యటం బాగుంది. ఇవన్నీ బహుశా వ్యూహాలే కావచ్చు. ఇటీవలి టీవీ9 మరియు ఇండియా టుడే సదస్సులలోని జగన్ ఇంటర్వ్యూలు మంచి ఇంపాక్ట్ కలగజేసాయి అని చెప్పవచ్చు. 
             ఇక ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమ వైఎస్సార్సీపీకి పెట్టని కోట అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ, మోదీ ఇమేజ్, విభజన వల్ల కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అంతా మోదీ వైపు పాజిటివ్ గా మళ్ళడం - అటువంటి మోదీతో తెదేపా పొత్తులో ఉండటం, పవన్ కళ్యాణ్ ఫాక్టర్ వంటివి ప్రతికూలంగా పని చేసినప్పటికీ రాయలసీమలో సగానికి పైగా సెట్లు గెలుచుకోవడం దీనికి నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ తో పాటు భాజపా కూడా సోదిలో లేకుండా పోయాయి. కాగా పవన్ బీఎస్పీతో పొత్తులో భాగంగా రాయలసీమలో అత్యధికభాగం వారికే వదిలేశాడు. ఇక రుణమాఫీ వంటి అనేక హామీలు సరిగా అమలు కాకపోవడం, పలు ఇతర పథకాలలో జన్మభూమి కమిటీల పక్షపాత ధోరణి విపరీతమైన వ్యతిరేకతను ఏర్పరచాయి. ఎలా చూసినా కూడా రాయలసీమలో గతంలో కంటే ఎక్కువగానే సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. రాయలసీమలోని మొత్తం 54 సీట్లలో దాదాపు 40 నుండి 45 దాకా వైఎస్సార్సీపీ గెలిచే అవకాశాలున్నాయన్నది నా అంచనా. ఇక మిగతా ఆంద్ర ప్రాంతంలోని 121 సీట్లలో పవన్ కళ్యాణ్, కే ఏ పాల్ వంటివారు చీల్చే వోట్లు, గెలిచే సీట్లు పోగా 65 నుండి 75 దాకా వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 105 నుండి 120 దాకా స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పరచే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి అన్నది నా అంచనా. 
             ఈ అంచనాలలో ఒక పదిశాతం అటూ ఇటూగా తేడా ఉండవచ్చు. తెదేపా అంచనాలలో రెండుమూడు శాతం మాత్రం తేడా ఉండవచ్చు అని చెప్పిన నేను ఇక్కడ పదిశాతం అనడానికి ప్రధాన కారణం - తెదేపా అధికార వర్గాలను ఉపయోగించుకుంటున్న తీరు, విపరీతమైన డబ్బు పంపిణీ వంటివి కొన్ని ప్రాంతాలలో ప్రభావం చూపవచ్చు. మరికొన్ని ప్రాంతాలలో ప్రజలు పోలింగ్ బూట్ ల దాకా రాలేని భయానక స్థితి కల్పించబడవచ్చు. కానీ, అటువంటి చర్యలన్నీ వైఎస్సార్సీపీ ఆధిక్యతను తగ్గించగలవేమో కానీ అధికారానికి దూరం చేయలేవని నా అభిప్రాయం. ముందుగానే చెప్పినట్టు ఇవి కేవలం నా అంచనాలు. నిజమవుతాయా కాదా అని చెప్పలేను. ఇంతవరకూ ఇంత సవివరణాత్మకంగా ఎపుడూ రాయలేదు. గతంలో గెలుపోటముల గురించి అణా=చానళ్లను క్లుప్తంగా ఇచ్చాను కానీ, ఇపుడు నాకు ఎందుకలా అనిపించిందో వివరిస్తూ వివరణాత్మకంగా రాశాను. మీరు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. మీ ఇష్టం ... 

Comments

  1. ప్రొద్దున్న ఈనాడు పేపర్ లో అసదుద్దీన్ గారు ఇంటర్వ్యూ ఇస్తూ చౌకీదార్ కి కాకుండా ఇమాన్‌దార్ కే ఓట్ వేయండి అని చెప్పి జగన్ పిలిస్తే ప్రచారం చేస్తా అన్నారు. మోదీ కంటే జగన్ ఇమాన్‌దార్ ఎలా అయ్యారో మీరే చెప్పాలి. బీజేపీ గెలవాలి అన్నది నా ఉద్దేశ్యం కాదు.

    ReplyDelete
    Replies
    1. అసదుద్దీన్ గారి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు మరియు ఏకీభవించను కూడా. ఇక ఒకవేళ మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తే నా వోట్ ఖచ్చితంగా మోదీ గారికే అని చెప్పగలను. కేంద్రంలో మెజారిటీలో కాస్త తేడాలొచ్చినా మళ్ళీ భాజపానే వస్తుందని నా అంచనా. నా తరువాతి వ్యాసం జాతీయ రాజకీయాల మీద రాయబోతున్నాను, అందులో వివరంగా రాస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ వరకూ చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్న అభ్యర్థులలో జగన్ మిగతా అందరికంటే బలంగా, క్లారిటీతో ఉన్నట్టు కనబడుతున్నాడు. మీరు ప్రచార సరళి గమనిస్తే చంద్రబాబు తాను ఏం చేశాడో చెప్పేకంటే జగన్, కెసిఆర్ లను విమర్శించడం మీదే దృష్టి పెట్టారు; పవన్ కేవలం జగన్ ను విమర్శించడం మీద మాత్రమే దృష్టి పెట్టారు; జగన్ మాత్రం తానేం చేయాలనుకుంటున్నాడో చెబుతూ, చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఇది నా అభిప్రాయం కాదు, కావాలంటే మీరు ప్రచార వీడియోస్ చూడవచ్చు.

      Delete
    2. ఈమాన్ ఆంటే అర్ధం ఏమిటి? జగన్ బేయిమాన్ అయితే అసద్ ఆయనకు ఎందుకు మద్దతు తెలుపుతున్నాడు? చంద్రబాబు ఇమాన్‌దార్ అని అసద్ ఎప్పుడు అన్నాడు?

      Delete
  2. చంద్రబాబు గారు ప్రచారంలో సరిగా మాట్లాడడం లేదు అంటే ఒప్పుకుంటాను. జగన్ గారు మాట్లాడుతూ, అన్న ముఖ్యమంత్రి అయితే ....అంటూ మొదలుపెడుతున్నారు. నేనూ అలాగే ఊహించుకుంటాను "నీహారిక ప్రధాని మంత్రి అయితే ఇండియా పాకిస్థాన్ లను కలిపేసి అఖండ్ భారత్ ని చేసే ఫైలు మీదే తొలి సంతకం" అని అంటే మీరు నాగురించి ఏమనుకుంటారో జగన్ గురించి కూడా నాది అదే అభిప్రాయం. జనసేన అభ్యర్ధి కూడా ఫైలు మీద సంతకం పెట్టేస్తా అంటున్నారు. ఎంతమంది ఎన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెడతారు ?

    మీ నాన్నగారు నటుడు కావాలని అనుకుని రచయత అయ్యారు. ఎన్నో అనుకుంటాం కానీ మన శక్తియుక్తులమీద మనకు అవగాహన ఉండదు. కాదంటారా ? ఒక్క ఎకరం నేల సమస్యని పరిష్కరించలేని వాళ్ళు 33 వేల ఎకరాలు ఎలా సాధించారో తెలుసుకోవాలి. ఇపుడు ఉన్న రాజకీయ నాయకులందరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగిన వ్యక్తి చంద్రబాబు గారు మాత్రమే ! కే సీ ఆర్ గారి నోరు ఆగదు చంద్రబాబు గారి నోరు పెగలదు. అందరికీ అన్నీ రావు.

    ఆంధ్రావారు 2014 తర్వాత బస్ స్టాండ్ లు మొదలుకుని హైకోర్టు వరకూ అంధ్రా అభివృద్ధి ఎలా జరిగిందో చూడాలి.

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబు గారి గురించి నా అభిప్రాయం వేరు, ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవు కానీ హి ఐస్ జస్ట్ ఆ మేనేజర్. బాగా మేనేజ్ చేస్తారు, ముందే చెప్పినట్టు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక 90% పైగా ఉన్న అనుకుల మీడియా వల్ల ఆయన ఆ విధంగా ప్రాజెక్ట్ కాబడుతున్నారు. నేను ఇక మరో విషయం నేను కూడా ఐఏఎస్ అవ్వాలనుకుని, కాలేక ఐటీ ఇంజనీర్ అయ్యాను. అనుకున్నవన్నీ కావు అన్నది నమ్ముతాను. కానీ, పోరాడకుండానే వదిలేస్తే దాన్ని పిరికితనం అంటారు. చంద్రబాబులో నాకు నచ్చేది పోరాటం, ఎంత కిందపడ్డా వదిలెయ్యరు. ఇక జగన్ విషయానికి వస్తే తనకు కావలసింది పోరాటంతోనే, కష్టపడి సాధించాలనుకుంటున్నారు కానీ, ఇతరులలా కుట్రలతో కాదు. అందుకే ఆయన ధైర్యం, వెనుకాడని తత్త్వం, మాటతప్పని తీరు వంటివి నాకు నచ్చుతాయి. పవన్ లోని సింప్లిసిటీ, అమాయకత్వం నచ్చుతాయి.

      Delete
    2. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవు కానీ హి ఐస్ జస్ట్ ఆ మేనేజర్. బాగా మేనేజ్ చేస్తారు అనటం పొసగటం లేదుగా.

      నాయకత్వ లక్షణాలు లేని వాడు చచ్చినా మంచి మేనేజరే కాలేడు. ఏదన్నా ఆఫీసులో ఒకణ్ణి మేనేజర్ చేయాలంటే ముందు చూసేది వాడికి నాయకత్వలక్షణాలు బాగున్నాయా అనే!

      Delete
    3. The first point to highlight is CBN always tries to own all the success even if it started and done under some other person's regime (ex ORR etc, Polavaram - approvals, almost all canal works etc) but he denies to own failures. He always tries to blame officials or party people for the failures. General opinion that almost visible is he don't believe anyone else. Many other points are there, I prefer to write another article on that than commenting here :)

      Delete
  3. కేంద్రంలో బీజేపీ వస్తుందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఆంధ్రా లో చంద్రబాబు గారే రావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. మంచిది, కానీ పరిస్థితి చంద్రబాబుగారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. వచ్చారంటే మాత్రం అది ఒక గొప్ప వింత అనే స్థాయి అవుతుంది. అయినా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మరియు అంచనా. చూద్దాం ...

      Delete
    2. Don't call it vinta. Just call it data management. Police manaagement. Poll management.

      Delete
    3. కేసీఆర్ గెలిచినా, మోడీ గెలిచినా కూడా Don't call it vinta. Just call it data management. Police manaagement. Poll management.

      Delete
    4. evaru gelichinaa ade anadam correct kaademo. endukante Modi ala cheyyataaniki, sthaanikamga unna itara party la prabhutvaalu sahakarinchavu kada. ee madhya kaalamlo manam AP lo police ni party elaa control chestondo choostoone unnaam (ex rishiteswari incident, mro vanajakshi incident, call money sex scandal incident to name few), idemee gatamlo choodaledaa ante kaadu choosaam kaanee ipudu maree vipareeta sthayiki vellindi ani maatram cheppavacchu. avineeti, araachakatvam ilaantivannee kottavemee kaadu, kaanee intakumundepudoo ee sthayilo levani cheppavacchu.

      Delete
  4. @ vinod,
    రాహుల్ గాంధీ కూడా 30 వేల కోట్లు అనీల్ అంబానీ లబ్దిపొందాడు అని ఆరోపిస్తున్నారు.అంత లబ్దిపొందితే అన్న దగ్గర 550 కోట్లు తీసుకుంటారా ?
    ఇపుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కాకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన ఒకటే అంటారు, టీడీపీ కాంగ్రెస్ ఒకటే అని ఇంకొకరు,జగన్ జనసేన ఒకటే అంటారు.
    అసలు నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి ?
    చంద్రబాబు గారితో కేసీఆర్ గారిని పోల్చవచ్చు కానీ జగన్ తో పోల్చడమేమిటీ ? జగన్ తో లోకేష్ ని పోల్చినా కొంచెం నయం.
    మీరు ఆంధ్రా వారేనా ? గత 5 సం లు గా ఆంధ్రా అభివృద్ధి ని చూసారా ? మీకు ఎక్కడ లోపం కనిపించింది ?

    ReplyDelete
    Replies
    1. "గత 5 సం లు గా ఆంధ్రా అభివృద్ధి ని చూసారా ?"

      కనకదుర్గ ఫ్లై-ఓవర్ ఎంత బ్రహ్మాండం, భ్రమరావతి-అనంతపురం ఎక్స్ప్రెవే ఇంకా అదుర్స్!

      మూడు బిల్డింగులు అవీ తాత్కాలికం, పైగా లీకులు (వర్షం నీరు సుమండీ, లీకులంటే వేమూరి చెప్పే వింత "వడ్డింపులు" కాదు). గేటు గేటుకు ప్రారంభోత్సవం చేసే సంప్రదాయం పోలవరం కంటే ముందు దేశంలో ఎక్కడా లేదు. అనంతపురంలో రైనుగన్నులంటూ హడావుడి చేసారు ఇప్పుడు వాటి అతీగతీ లేదు. అంతా గ్రాఫిక్స్ & జిమ్మిక్స్!

      Delete
  5. @ Jai,
    ఈమాన్ ఆంటే అర్ధం ఏమిటి?
    స్వచ్చమైన,ధర్మబద్దమైన,విశ్వసనీయమైన.

    జగన్ బేయిమాన్ అయితే అసద్ ఆయనకు ఎందుకు మద్దతు తెలుపుతున్నాడు?
    ఇదే ప్రశ్న నేను అసద్ గారిని ట్విట్టర్ లో అడిగాను. సమాధానం రాదు.

    చంద్రబాబు ఇమాన్‌దార్ అని అసద్ ఎప్పుడు అన్నాడు?
    అసద్ గారు అనలేదు మీరే అంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబు ఇమాందార్ అని నేను అనలేదు, అంత పాపం నాకు ఒడికట్టకండి ప్లీస్!

      Delete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన