... తెలుగు సినిమా 2017 (నా వ్యూ)
వంశీ కలుగోట్ల // ... తెలుగు సినిమా 2017 (నా వ్యూ) // ******************************************************* తెలుగు సినిమా 2017 లో బాహుబలి సాక్షిగా వెలిగిపోయింది. కానీ, ఒక్క బాహుబలితోనే ఆగిపోలేదు. పెద్ద, చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేసి, తెలుగు సినిమా హద్దులను చెరిపేసే దిశగా అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. నా దృష్టిలో ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగంలోప్రస్తావించుకోదగ్గ సినిమాలుగా అనిపించిన చిత్రాలతో చిన్న సమీక్షలాంటిది ... బాహుబలి 2: 'బాహుబలి' అన్నది నిస్సందేహంగా ఒక్క తెలుగు సినిమా రంగాన్నే కాక భారతీయ సినిమా రంగాన్నే వాణిజ్యపరంగా, సాంకేతిక హంగుల పరంగా కొత్త అడుగులు వేయించిన సినిమా. ముఖ్యంగా సాంకేతికత విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే పరిమిత వనరులతో హాలీవుడ్ స్థాయికేమాత్రం తగ్గకుండా తయారైంది. ఆ కష్టం వృధా పోకుండా, వాణిజ్యపరంగా సంచలనాత్మక విజయం సాధించింది. భారతీయ సినిమా సాంకేతిక విలువలు బాహుబలికి ముందు, తరువాత అన్నట్లు తయారైంది. అంతేకాదు దక్షిణాది సినిమారంగం అంటే 'తమిళం' అనుకునేవారికి తెలుగు సినిమాను పరిచయం చేసింది. బహుశా, ఇప్పటికీ ఇంకా దక్షిణాది సినిమా అం