'బాబు' కేక
'బాబు' కేక
************
ఈ 'బాబు' రాజకీయ బాబు కాదులెండి, సినిమా బాబు. సినిమా రంగంతో పరిచయం ఉన్నవారికి, అభిమాన సంఘాల వారికి 'బాబు' అంటే ఏంటో చాలా వివరంగా తెలుసు. ఈ 'బాబు'ల్లో రెండు రకాల బాబులు ఉంటారు. ఒక పెద్ద ఇమేజ్ ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వారసులు ఒకటో రకం 'బాబు'లు, రెండో రకం 'బాబు'లు వరుసగా మాంచి హిట్లు సాధించి ఊపుమీదున్న హీరోలు అన్నమాట. ఈ 'బాబు'ల తీరు ఎలా ఉంటుందంటే
... 'బాబు' ఒక సన్నివేశంలో నటించి పక్కకు వచ్చాడు అన్నమాట.
బాబు - ఎలా ఉంది మన (సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట) ఆక్టింగ్?
దర్శకుడు - 'బాబూ, అసలు ఒక్క టేక్ లో మొత్తం 5 నిమిషాల సీన్ చించేశారు బాబూ. ఆశలు నేనైతే 'షాట్ ఓకే' అని చెప్పడం మర్చిపోయి అలా తన్మయత్వంతో ఉండిపోయాను అంటే నమ్మండి. అసలు మీరు ఇక్కడే ఉంది టైం వేస్ట్ చేస్తున్నారు బాబు. బాలీవుడ్దో లేక హాలీవుడ్దో వెళ్ళారంటే అక్కడి హీరోలందరూ బుట్ట సర్డుకోవాల్సిందే.
హీరోయిన్ - ఓహ్ వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటే నమ్మండి బాబు గారు. అసలు హౌ కాన్ యు డు లైక్ దట్ బాబు గారు, యు అరె యాన్ అమేజింగ్ ఆక్టర్ యు నో ...
కెమెరా మెన్: బాబు గారు, మీరు ఈ ఫ్రేమ్ లో గ్లామర్ కి అమ్మ మొగుడు లాగా ఉన్నారు. అసలు ఈ సినిమా తరువాత స్టేట్ లో మొత్తం ఫాలో అయిపోతారు చూడండి.
మాటల రచయితా: బాబూ మీరు కేక అండి. అసలు మీ నోటివెంట వినేవరకు నేను రాసిన డైలాగులు అంత బాగున్నాయంటే నేనే నమ్మలేకపోతున్నాను. చించేశారు బాబూ ...
...
...
...
--- ఇక మిగతా వారందరూ ఇలా వరసపెట్టి బాబు కి స్తోత్రం సదివేత్తా ఉంటే 'ఉన్న విషయం' చెప్పే దమ్మెవరికి ఉంటుంది. ఒకవేళ అంతటి దమ్మే కనుక ఉండి ఎవరైనా చెబితే ఆ మరుసటి రోజు నుంచి వారు ఆ సినిమాకి పని చెయ్యరు. ఈ మధ్యన మన దగ్గర ఇలాంటి బాబులు బాగా ఎక్కువయ్యారు. ఒక్క హిట్టు అలా పడిందో లేదో వెంటనే పక్కన 'భజన బృందం' చేరి స్తోత్రపాఠాలు చేస్తుంటే వారు ఏమి చేస్తారులే పాపం.
Comments
Post a Comment