రాజకీయ సినిమా
రాజకీయ సినిమా
*******************
మున్నా సినిమా చూసిన వారికి అందులో ప్రకాష్ రాజ్ మరియు రాహుల్ దేవ్ పాత్రలు గుర్తుండే ఉంటాయనుకుంటాను. ప్రకాష్ రాజ్ తెలివిగా తన దగ్గర పనిచేసిన రాహుల్ దేవ్
ని తనకే ఎదురు తిరిగినట్టుగా చేసి ప్రత్యర్థిగా మారుస్తాడు. దాంతో, ప్రకాష్
రాజ్ అంటే పడని వారు రాహుల్ దేవ్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ కలిసి వారిని
బఫూన్ లను చెయ్యటం. ఇలా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇప్పుడు మన రాష్ట్ర
రాజకీయాలు చూస్తుంటే నాకు ఎందుకో అదే గుర్తుకు వస్తోంది. ప్రభుత్వం పట్ల
వ్యతిరేకత పెరుగుతోంది; శంఖుస్థాపనలు, వృధా ఖర్చులు, ప్రచార పటాటోపం తప్ప
క్షేత్ర స్థాయిలో జరగుతున్నదేమీ లేదు. అందినకాడికి దోచుకుంటున్నారు. దాంతో,
మూడేళ్ళ తరువాతి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటినుంచే దార్సనికుడి బుర్రకు
తట్టి, పక్కా స్క్రీన్ ప్లే రచించినట్టు అనిపిస్తోంది. తెర మీది 'అత్యంత
శక్తివంతమైన' (???) బొమ్మ రంగంలోకి దిగింది. 'జనసేన' మళ్ళీ పెట్టెలోంచి
బయటకు రాబోతోంది. దీని మూలంగా జరగబోయేది ఏమిటంటే - సొంత పార్టీలోని
అసంతృప్తులు, ఇతర పార్టీలలోని ఆశావహులు 'జనసేన' వైపు మళ్ళే అవకాశాలు
ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల, చివరాఖరుకు ఎన్నికల ముందు ఎలా
తిట్టుకున్నా ఆ తరువాత ఎలాగూ 'జనసేన' తమకే మద్దతు కాబట్టి తాము కొన్ని
సీట్లు తెచ్చుకుంటే యువరాజుకు పట్టాభిషేకం జరిపించాలని కోరిక. గతంలో
అన్నయ్య 'ప్రజల మీద ఎన్నికల భారం పడనీయకుండా' అనే కారణం చెప్పి కాంగ్రెస్
పంచన చేరినట్టుగా తమ్ముడు వేరే ఏదో ఒక కారణం చెప్పవచ్చు - కారణం ఏదైనా
అడుగులు, మార్గం, గమ్యమ ఒక్కటే. కానీ, ఈ స్క్రీన్ ప్లే లో 'కాంగ్రెస్ -
టిఅర్ఎస్' తరహాలో జరిగినది గమనించగలిగితే మంచిదేమో. అసలు మున్నా సినిమాలో
కూడా సివరాఖరుకు రాహుల్ దేవ్ ప్రకాష్ రాజ్ నే చంపటానికి ప్రయత్నిస్తాడు. ఈ
స్క్రీన్ ప్లే కి జగన్ ప్రతి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడాలి. నా అంచనా
ప్రకారం జగన్ ఇప్పుడు గతంలో వైఎస్ 'దానం నాగేందర్' విషయంలో అనుసరించిన
స్క్రీన్ ప్లే అనుసరిస్తాడేమో అనిపిస్తోంది - అనిపించడమేంటి ఆల్రెడీ అదే
మొదలెట్టేసాడు. అయినా నాయకులకంటే ప్రజలకే 'సినిమా జ్ఞానం' ఎక్కువ. అనుకుంటాం కానీ, ప్రజలేమీ వెర్రి పప్పలు కాదు. వారి లెక్కలు వారికుంటాయి. 2019 సినిమా కోసం నేను ఇప్పటినుంచే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను ... *******************
Comments
Post a Comment