Posts

వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్

వంశీ వ్యూ పాయింట్: సైరా మెగాస్టార్  *********************************             మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రిక చిత్రంగా చెప్పబడిన, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడిగా, తెల్లవారిపై (కంపెనీ లేదా బ్రిటిష్ రాజ్యం) తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందుబాటులో ఉన్న ఆధారాలకు కొంత కాల్పనికత జోడించి తీసిన సినిమాగా - ఎంతో ఉత్సుకతను రేకెత్తించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సినిమా ఎలా ఉంది అనేకంటే ముందు - దేశభక్తి భావనలు ఈ సినిమాద్వారా పెంచుకోవాలనుకునేవారు మరియు చిరంజీవి భక్తులకు ఒక మనవి - ఇక్కడితో చదవడం ఆపెయ్యండి లేదా మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కేవలం నా వ్యూ పాయింట్. సినిమా ఎలా ఉన్నా, 'సైరా' ఖచ్చితంగా, తెలుగు సినిమా సాధించిన అద్భుత కమర్షియల్ విజయాలలో ముందువరుసలో ఉంటుంది అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అన్నిటికంటే ముందుగా ఒక విషయం చెప్పుకుందాం - 'మనీ' సినిమాలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు పెళ్ళి గురించి చెపుతూ, కొన్ని ఫోటోలు చూపుతూ - సేమ్ కార్డ్, ఫొటోస్ చేంజ్ అంటూ వివరిస్తాడు. 'సైరా' సినిమా గురిం...

... 'సాహో' గురించి

వంశీ వ్యూ పాయింట్ // ... 'సాహో' గురించి // *****************************************             సాహో సినిమా గురించి మాట్లాడుకుందాం. శౌర్యం సినిమాలో అనుకుంటా అలీ కాలేజీలో ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కం స్పోర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ బాడీ, టోన్డ్ మసిల్స్ తో కనబడుతుంటాడు. నిజమేంటంటే అతనికి అటువంటి బాడీ ఏమీ ఉండదు. బెలూన్స్ ని బాడీ కి చుట్టుకుని అలా కనబడుతుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న హీరో గోపీచంద్ అతడితో ఓ ఆటాడుకుంటాడు. ఆ ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం సాహో సినిమా గురించి కదూ. సాహో సినిమా గురించి చెపుదామనుకుంటే, ఆ ఆలీ క్యారెక్టర్ మ్యాటర్ గుర్తొచ్చింది అంతే. అంటే ఏం లేదు ఒక మామూలు కథను పట్టుకుని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ కథలో ఏమీ లేకపోయినా, జస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టి - అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ అనుకోమన్నారు. అదన్నమాట విషయం.               సాహో చిత్రాన్ని ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేశారు, అఫ్ కోర్స్ అదే నిజమనుకోండి. బహుశా దర్శకుడు మరియు కథకుడు అయిన...

... తిరుమల టికెట్స్ వ్యవహారం

వంశీ వ్యూ పాయింట్ // ... తిరుమల టికెట్స్ వ్యవహారం // *****************************************************             తిరుమల వెళ్ళే బస్సులో టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర గురించిన ప్రకటన ముద్రించడం అన్నది ఖచ్చితంగా సున్నితమైన భావాలను రెచ్చగొట్టగల అంశం, తప్పు. అయితే, దీన్ని వెంటనే జగన్ కు  ఆపాదించి, క్రైస్తవ మత ప్రచారం మొదలు పెట్టాడు అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అంతకంటే బాధ్యతారాహిత్యం.  నాకు అర్థం కానీ విషయాలు ఏంటంటే -> ఈ టిక్కెట్ల వెనుక ప్రభుత్వ పథకాల ప్రచారం అన్నది చంద్రబాబు ప్రభుత్వం చేసినది. ఆ ప్రకటనలలో ఏమున్నదో ఒకసారి చూడండి - 'గత నాలుగున్నరేళ్ళలో' అని సుస్పష్టంగా ఉన్నది. అంటే, దిగిపోకముందే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన పని అది అన్నది స్పష్టం. అపుడు ఎవరూ ప్రశ్నించలేదు. అసలు అవి కనీసం ప్రింట్ అయ్యాయో లేదో కూడా ఎవడికి తెలియదు. కానీ, ఇపుడు దానిని జగన్ కు ఆపాదించి గొడవ చేస్తున్నారు.  ->  శ్రీశైలం ఈవో విషయంలోనూ ఇలానే జరిగింది. కానీ, అతడు జగన్ వచ్చాక నియమించబడ్డ వ్యక్...

... కొన్ని జ్ఞాపకాలు: 1

వంశీ కలుగోట్ల // ... కొన్ని జ్ఞాపకాలు: 1 // ****************************************             ఒక్కోసారి అనిపిస్తుంది మనిషి అంటే ఒక కదిలే జ్ఞాపకాల దొంతర అని. కొన్ని జ్ఞాపకాలు మనల్ని నిలబెడతాయి, నడిపిస్తాయి; మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని తలదించుకునేలా చేస్తాయి, సిగ్గుపడేలా చేస్తాయి. కొన్నిసార్లు జ్ఞాపకాలలో మనముండకపోవచ్చు - లేదా వేరే వారు ఆ జ్ఞాపకాలను ప్రభావితం చేసినవారు అయి ఉండవచ్చు. అలా నాకు చాలాసార్లు గుర్తొచ్చే జ్ఞాపకాలలో ఒకదాన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఇది ఎటువంటి జ్ఞాపకం అనేది నేను మొదటే చెప్పాలనుకోవట్లేదు. చదవండి. నా అభిప్రాయం ప్రకారం మనుషుల్లో మంచివారు, చెడ్డవారు అంటూ ఉండరు - పరిస్థితులు, అనుభవాలు వారిని కొన్ని సమయాలలో అలా ప్రవర్తించేలా డ్రైవ్ చేస్తాయి. ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే, మనీషి లేదా మామూలు మనిషి. ఈ అనుభవంతో ఎవరెలాంటివారో నేను జడ్జ్ చెయ్యట్లేదు. చదవండి ...  *            *            *             అది 2010 వ సం...

... తెలుగోడి శతృవు

వంశీ కలుగోట్ల // ... తెలుగోడి శతృవు // ********************************** వాడు: అరేయ్ మన తెలుగోళ్ళు కులగజ్జిగాళ్ళు, వెధవలు, మూర్ఖులు, ఎంతకైనా దిగజారే నీచులు అట కదరా.  వీడు: ఎవరు చెప్పార్రా?  వాడు: ఎవరో చెప్...

... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు

వంశీ వ్యూ పాయింట్ // ... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు // ********************************************************** తెదేపా                అవమానాల్ని, ఓటముల్ని తట్టుకోవటం తెదేపాకు, చంద్రబాబు గారికి అలవాటే. తట్టుకుని నిలబడ్డారు కాబట్టే, నేను అత్యంత సీనియర్ ని అని చెప్పుకోగలిగే స్థాయిని సంపాదించుకుని నిలబడ్డారు. ఈ ఓటమికంటే, ఈ శతృవు చేతిలో ఓటమి ఆయనను ఎక్కువగా ఆబాధిస్తున్నట్టుంది. అయినా అదంతా పక్కనబెట్టి, సభలో చక్కగానే వ్యవహరిస్తున్నారు. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ, గత అయిదేళ్లతో పోల్చితే ఇపుడు వ్యవహరిస్తున్న తీరు బెటర్ అని చెప్పవచ్చు.తెదేపా అభిమానులను బాధిస్తున్న అంశం ఏంటంటే పార్టీ నాయకుల తీరు. గెలిచినా 23 మంది అయినా గట్టిగా పోరాడుతున్నారా అంటే లేదు, భాజపా తమతో 18 మంది టచ్ లో ఉన్నారు అన్నా కూడా ఎవరూ స్పందించటం లేదు. అంతేకాక సభలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య గారు, అప్పుడప్పుడు పయ్యావుల కేశవ్ మినహా మిగతావారు పెద్దగా నోరు మెదపట్లేదు. వారు భయపడుతున్నారా లేక పార్టీ వీడటానికి మంత్రాంగం నడుపుతున్నారా అన్నది చెప్పల...

... కత్తిమీద సాము చేస్తున్న జగన్

వంశీ వ్యూ పాయింట్ // ... కత్తిమీద సాము చేస్తున్న జగన్ // ********************************************************             ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు కారణమెవరు అన్నది పెద్ద ప్రశ్న కాదేమో - రాజకీయ గెలుపోటములు నేర నిర్ధారణలు కాకపోయినా ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే ఒకరు ఘోర ఓటమితో అవమానభారాన్ని ఎదుర్కొనగా, ఊహించని విజయాన్ని పొందిన మరొకరు అధికారపీఠం ఎక్కారు. పరిస్థితులకు కారణం ఎవరైనా సరే, ముందు పరిస్థితులు చక్కదిద్దబడాలి. వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలి. అదే సమయంలో గత ప్రభుత్వపు మితిమీరిన అవినీతిని తవ్వి తీయాల్సిందే. ఎందుకంటే ఇపుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని పనులు సాధ్యపడవు, కొన్ని చోట్ల అప్పులు పుట్టవు, కేంద్ర ప్రభుత్వం పాత ప్రభుత్వపు ఖర్చుల లెక్కలు అడుగుతోంది - అవి సమీకరించటానిక్ ఇసయం పట్టవచ్చు - అంతవరకూ కేంద్రం అదనపు నిధులు ఇవ్వకపోవచ్చు. ఇందుకు కారణం ఖచ్చితంగా గత ప్రభుత్వమే కదా, మరి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. ఇపుడున్న పరిస్థితుల్లో ఇపుడు ప్రాధాన్యత క్రమం ఏది అని చె...