Posts

... ఏమంటారో? ఏమనుకుంటారో?

వంశీ కలుగోట్ల // ... ఏమంటారో? ఏమనుకుంటారో? // ****************************** ***************             నేను చిన్నపుడు, బహుశా దాదాపు 8 సంవత్సరాల వయసున్నపుడు అనుకుంటా ఒకరోజు పేపర్ లో ఒక వార్త చూశాను - నందికొట్కూరులో ఎవరో చెత్తకుండీలో పడేసిన పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్నది ఆ వార్త. చాలా హృదయవిదారకమైనది, కదిలించివేసింది ఆ వార్త. అది చూసిన చాలారోజుల వరకూ ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉండేది. వివాహేతర లేదా వివాహానికి పూర్వమే ప్రేమ పేరుతొ వంచించబడిన మహిళ, సమాజానికి/కట్టుబాట్లకు భయపడి ఆ బిడ్డను వదిలించుకుందేమో బహుశా. చాలా చాలా బాధతో పాటు, ఆలోచనకూ కారణమైంది. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మొదలైంది. చదువు కొంతవరకూ మేలేమో అనిపించింది, అంటే చదువుకుంటే అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో.             అయితే ఇపుడు కూడా జరుగుతున్న పలు ఘటనలు చూసిన/చదివిన తరువాత చదువు ప్రభావం ప్రస్నార్ధకమే అని అనిపిస్తోంది. సమాజం/కట్టుబాట్ల పట్ల ఉన్న విపరీత భయమే అటువంటి ఘటనలకు కారణం కావచ్చు. ఎవరో ఏమో అనుకుంటారని, తమను తాము అణచేసుకుంట...

... మూడో కూటమి

వంశీ వ్యూ పాయింట్ // ... మూడో కూటమి // **************************************             తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడు కెసిఆర్ గారు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఆలోచనలు చేశారు, అనేకమందిని కలిశారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి ఏమైందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు గారు మోదీకి వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు, అనేకమంది ప్రాంతీయ నాయకులను కలిసి కలిసి, కొత్త కూటమి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన చరిత్రలో ఎరుగని ఓటమితో కుదేలయ్యారు. మోదీ మాట్లాడటానికి  కూడా సాహసించటం లేదు.  పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి - దీదీ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మూడో కూటమి ఏర్పడవలసిన అవసరం ఉందని అనేకమంది ప్రాంతీయ నాయకులకు ఉత్తరాలు రాశారు. కొత్త కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు.             వీళ్ళంతా తమకు కాసింత సెగ తగలగానే ఎగిరెగిరిపడి, ఆ తరువాత నిమ్మకుంటున్నారు. కారణాలు, అవసరాలు ఏవైనా ఒక్క కాంగ్రెస్ మినహాయించి వేరే ఏ పార్టీ కూడా మోదీకి వ్యతిరేకంగా స్థిరంగా...

... తిరుపతి ఉప ఎన్నిక

వంశీ వ్యూ పాయింట్ // ... తిరుపతి ఉప ఎన్నిక // ******************************************             సిట్టింగ్ ఎంపీ దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన తిరుపతి ఉప ఎన్నిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి కారణం భాజపా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ముఖ్యంగా భాజపా తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో కనబరచిన ప్రదర్శనతో ఉరకలెత్తుతోంది. తెలంగాణాలో లాగానే ఇక్కడ కూడా మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టి, మతప్రాతిపదికన ఓట్లను పోలరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. బరిలో ప్రధాన పార్టీల తీరును పరిశీలిస్తే              వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న గురుమూర్తి గారికి పార్టీ వర్గాల నుండి సహకారం, వ్యక్తిగతంగా ఎటువంటి చేదు రిమార్క్స్ లేకపోవడం, విద్యాధికుడు, సౌమ్యుడు కావడం వంటివి సానుకూల అంశాలు. కాగా స్థానిక పార్టీ వర్గాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం వంటివి ప్రతికూల అంశాలు. అయితే జగన్ గారు వ్యక్తిగతస్థాయిలో (...

... "పింక్" గురించి రెండు మాటలు

వంశీ వ్యూ పాయింట్ // ... "పింక్" గురించి రెండు మాటలు // **************************************************             కొన్నేళ్ళక్రితం బాలీవుడ్ లో "పింక్" అనే సినిమా వచ్చింది. అందులో ప్రస్తావించబడిన అంశం చర్చనీయాంశం, ఆ సినిమా ఒక అద్భుతం. ప్రత్యేకించి అందులో ముఖ్యపాత్రలు పోషించిన తాప్సి, అమితాబ్, కృతి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్, పీయూష్ మిశ్రా, అంగద్ బేడీ వంటివారు తమ పాత్రోచిత నటనతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళారు. ముఖ్యంగా అమితాబ్ గురించి చెప్పుకోవాలి - కోర్ట్ సన్నివేశాల్లో ఆ పాత్రలో అమితాబ్ కాకుండా మరొకరిని ఊహించడం కష్టం. బాధ, నిస్సహాయత, కోపం, నిర్లిప్తత, సానుభూతి లాంటి భావాలన్నీ ఒకేసారి పలికించగలగడం - హాట్స్ ఆఫ్ అమితాబ్ జీ. ఒక నటుడిగా ఆయన మీద గౌరవం రెట్టింపయ్యేలా నటించారు దీపక్ సెహగల్ పాత్రలో.             ఇక సినిమాలో చర్చింపబడిన అంశం - స్త్రీ ఎటువంటిదైనా, తన ప్రవర్తన ఎటువంటిదైనా, తన వస్త్రధారణ ఎటువంటిదైనా - తాను నో అంటే నో (శృంగారానికి). కాస్త కలివిడిగా ఉంటే, ఆల్కహాల్ తాగితే, పొట్టి బట్టలేసుకుని పబ్ లకు వెళితే - దాని అర్థం...

... ఓ రెండు మాటలు

వంశీ కలుగోట్ల // ... ఓ రెండు మాటలు // ****************************** *****             సరదాగా ఓ రెండు అంశాల గురించి కాసిని మాటలు మాట్లాడుకుందాం. ఆ రెండు అంశాల గురించి నా దృక్కోణం ఏంటనేది క్రింద వివరించాను, మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయవచ్చు.         డైటింగ్ గురించి కాస్త చెప్పుకుందాం. డైటింగ్ అనగానే అత్యధికులు తిండి తగ్గించడం/మానేయడం అనే అపోహలో ఉంటారు లేదా ఆయిల్ ఫుడ్ లాంటివి పూర్తిగా తగ్గించడం లాంటివి. కానీ అది సరికాదు. డైటింగ్ అన్నది అందరికీ ఒకేలా ఉండదు. శరీరబరువు మీద అదుపు సాధించడం అన్నది పలు ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తినే తిండి మీద అదుపు, సమయపాలన లాంటివి. మనకు ఇష్టమైన ఫుడ్ ఉన్నపుడు విపరీతంగా తినెయ్యడం, మిగతావి తక్కువగా తినడం లాంటివి సరికాదు. ఇష్టమైనదైనా లేనిదైనా మితంగా తినాలి. తినేపుడు, తిన్న తరువాత ఇబ్బంది పడనటువంటి ఫుడ్ ను ప్రిఫర్ చేయాలి. సాధారణంగా బరువు పెరగడం అన్నది ఒక్కోవ్యక్తి బాడీ మెటబాలిజం బట్టి, అనేక ఇతర అంశాలను బట్టి ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ ని సంప్రదించి, మనకు ఏది సరైనదో తె...

... ఆరోగ్యమే మహాభాగ్యం

వంశీ కలుగోట్ల // ... ఆరోగ్యమే మహాభాగ్యం // *****************************************             కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెట్టిన తరువాత ప్రపంచం మొత్తం (అతిశయోక్తిలా అనిపిస్తే, అత్యధికశాతం అని చదువుకోండి) కరోనా రాకుండా ఏం చెయ్యాలి అని అన్వేషణ మొదలు పెట్టింది. దాంతో ప్రివెంటివ్ మెడికేషన్ వ్యాపారం ఊపందుకుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది అనే ప్రచారంతో అనేక కృత్రిమ ఉత్పత్తుల విక్రయం ఎక్కువైంది. అందులో అత్యధికం ఎటువంటి ప్రామాణికత లేనివే అయి ఉంటాయి. నిజానికి ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది ఎంతవరకూ సమంజసం, అనుసరణీయం అని తెలిసిన వైద్య మిత్రులతో కూడా చర్చించాను. సరైన సలహా, నిపుణులతో సంప్రదించకుండా ఈ ప్రివెంటివ్ మెడికేషన్ వాడకం అన్నది సరికాదు, సమర్థనీయం కాదు అన్నది వారు చెప్పిన విషయం.             ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, వ్యవసాయ సంబంధిత ఉదాహరణే చెప్పుకుందాం. ఒక పంట అయిపోయాక, తరువాతి పంట వేసేముందు సాధారణంగా రైతు పొలాన్ని పంటకు సిద్ధం చేస్తాడు. పొలం దున్నడం, సేంద్రియ ఎరువులు వేయడం లా...

... జీహెచ్ఎంసీ ఎన్నికలు

వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు // ********************************************             జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం.             ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. ...

... ఆకాశం నీ హద్దురా

వంశీ వ్యూ పాయింట్ // ... ఆకాశం నీ హద్దురా // ****************************************             "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" అని సి.వి. రామన్ గారు చెప్పారు. మనలో అందరూ కలలు కంటారు, ఆ కలలను నిజం చేసుకోవడానికి అవసరమైన పోరాటం చేసే ధైర్యం మాత్రం అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కలలు కనే మిగతా అందరూ, ఆ ధైర్యవంతుల గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు, తరతరాలుగా. అటువంటి ఒక ధైర్యవంతుడి కథ, కెప్టెన్ గోపినాథ్ గారి జీవితం ఆధారంగా సుధా కొంగర గారి దర్శకత్వంలో రూపొందిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా. మొదటి సన్నివేశం నుండి ఒక విధమైన ట్రాన్స్ లో నడుస్తుంది సినిమా. ఆ మూడ్ సినిమా అంతటా కొనసాగించడంలో సుధా కొంగర గారు విజయం సాధించారు అని చెప్పవచ్చు.             ఆకాశయానాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురావాలని తపించి, పోరాడిన చంద్ర మహేష్ మరియు అతడి మిత్రుల...

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

వంశీ కలుగోట్ల // ... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న  అంశం ? // ************************************************************             చిరంజీవి గారికి కరోనా నెగటివ్ అని, మొదటి సారి పాజిటివ్ వచ్చింది కూడా ఫాల్టి టెస్ట్ కిట్ వల్ల అని తెలిసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. మంచిది, ఆయనకు కరోనా నెగటివ్ అని తెలియడం ఆయను విపరీతంగా అభిమానించే నాలాంటి కోట్లాది మందికి సంతోషాన్నిచ్చే విషయం. కానీ, అంతటి మెగాస్టార్ గారి విషయంలోనే మొదటి రిజల్ట్ ఫాల్టి కిట్ ద్వారా అని, అది కూడా మూడు వేర్వేరు ఇతర పరీక్షల అనంతరం నిర్ధారించబడిందని అంటే ఇక ఇపుడు బయట పడుతున్న అసీంప్టమాటిక్ కేసులలో ఎన్ని నిజానికి కరోనా పాజిటివ్ మరియు ఎన్ని ఫాల్టి కిట్స్ ద్వారా తప్పుడు ఫలితాలు? పాజిటివ్ కాదు అని నిర్ధారించబడేంతవరకూ చిరంజీవి గారు ఖచ్చితంగా కొంత భయం, మనోవేదన అనుభవించి ఉంటారు. అలాంటిది ఇక సామాన్యుల బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?             నిజానికి ఈ కరోనా టెస్ట్ మరియు ట్రీట్మెంట్ అన్నవి ఇపుడు మాఫియాలా తయారైంది. ప్రైవేట్ సంస్థలకు టెస్ట్ బాధ్యతలు అప్పగించడం ద్...

... మనం మేలుకోమా?

వంశీ కలుగోట్ల // ... మనం మేలుకోమా? // ************************************             "కల్పవృక్షం - మనిషి" కథ అని మా తాత ఒక కథ చెప్పేవారు చిన్నపుడు. ఒక బాటసారి అడవి గుండా పయనిస్తూ, మధ్యాహ్నం విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూచుంటాడు. అతడికి తెలీని విషయం ఏంటంటే అది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. అలసటగా ఉన్న అతడు 'ఇపుడు దాహం తీరేలా చల్లటి మంచినీరు దొరికితే ఎంత బావుండు?' అనుకున్నాడు. వెంటనే మంచినీరు ప్రత్యక్షమైంది. దాహం తీరగానే ఆకలి గురొచ్చింది, 'ఇపుడు పంచభక్ష్యపరమాన్నాలు లభిస్తే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవీ ప్రత్యక్షం. తిన్న తరువాత 'ఆహా ఇపుడు శయనించటానికి ఒక హంసతూలికాతల్పము, వింజామరలు వీస్తూ సేవికలు, అప్సరసలాంటి భార్య, ఒక పెద్ద భవనం ఉంటే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. అపుడు అతడు 'అయ్యో ఇదంతా నిజమేనా లేక నా కలా. ఒకవేళ ఇది నిజమే అయితే, ఉన్నట్టుండి ఇవన్నీ మాయమైతే' అనుకున్నాడు. అనుకున్న తక్షణమే అవన్నీ మాయమయ్యాయి. అపుడు అతడు మరింత భయంతో 'ఇపుడు ఈ అడవిలో ఏ పులో, సింహమో వచ్చి నన్ను చంపి తినేస్తే ఎలా' అనుకున్నాడ...

... గురువిందగింజలు 

వంశీ కాలుగొట్ల // ... గురువిందగింజలు // ************************************             వరదలొచ్చాయి, భూకంపం వచ్చింది ... అవీ కాకపొతే ఇంకోటి. ప్రతిసారీ ఒక బ్యాచ్ ఉంటుంది సినిమావాళ్ళ మీదవిమర్శలు చేయటానికి. "సినిమా వాళ్ళెంత ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు కదా - ఇక వారి సినిమాలు చూడటం మానెయ్యండి" ... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణం అయిపోయింది. సినిమా వాళ్ళు మన మెడ మీద కత్తి పెట్టిదోపిడీలు చెయ్యట్లేదు; ప్రజల బాగు కోసం, సమాజ అభివృద్ధి కోసం కేటాయించిన పథకాల డబ్బును దోచుకోవట్లేదు; ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కూడా, చేయాల్సిన పని కోసం లంచం అడిగి సంపాదించట్లేదు ... వాళ్ళ నటన, ఆట, పాట నచ్చి మనం చూసి హిట్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తో సంపాదించుకున్నారు. ఛండాలంగా ఉన్నాయని, బాలేవని మనం తిప్పికొట్టిన సినిమాల ద్వారా నష్టాలు కూడా పొందారు.             మీకు దమ్ముంటే మీ ఏరియా ఎమ్మెల్యేని, అప్పోజిషన్ ఎమ్మెల్యే కాండిడేట్ ని, వ్యాపారులని, ఉద్యోగుల్ని ... లాంటి వాళ్ళందరిని ఎంత ఇచ్చారో అడగండి, ఎందుకు ఇవ్వలేదో (ఇవ్వకపోయుంటే) నిలదీయండి....

... జస్ట్ సరదాకి, అంతే

వంశీ కలుగోట్ల // ... జస్ట్ సరదాకి, అంతే  // ************************************ నవ్వొస్తే, నవ్వుకోండి. రాకపోతే వదిలేయండి. అంతకుమించి సీరియస్ గా తీసుకోకండి (ఆ ఇప్పటిదాకా ఏదో పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు) డిస్క్లైమర్: ఇది కేవలం సరదాకి రాసినది మాత్రమే. సారూప్యతలు కేవలం యాదృచ్చికమే తప్పించి, ఎటువంటి సంబంధమూ లేదని ముందుగానే మనవి చేసుకుంటున్నాను. ఒకానొక రచయిత/కవి సృజన: అమ్మా ... బాగున్నారా?! బాగానే ఉంటారమ్మా ఎందుకంటే మీరు అమ్మ కదా! దిగ్గజ విశ్లేషకుల విశ్లేషక ఉవాచ:             ఆహా ఏమి రచనా సౌందర్యము? ఏమి భాషా పటిమ? ఎంతటి ఆర్ద్రత నిండిన మాట? ఎంతటి నిష్కల్మష భావము? నిజంగా ఆ 'అమ్మా' అనడంలో మొత్తం స్త్రీజాతి పట్ల ఆ రచయిత/కవి యొక్క గౌరవభావం ఉట్టిపడుతోంది. నిజానికి అక్కడ అమ్మ అని ఆపెయ్యవచ్చు, కానీ అమ్మా దీర్ఘం తీస్తూ అనడంలో ఆ గౌరవభావం మరియు ఆర్ద్రత మరియు అదీఇదీ అనేక భావానలను అలా ఎక్స్టెండ్ చేసినట్టయి మరింత సౌందర్యం చేకూరింది. అలానే బాగున్నావా అనకుండా బాగున్నారా అనడం ద్వారా అతడు మొత్తం స్త్రీజాతిని, అందరు అమ్మలనూ కలిపి అడిగినట్టయింది. ఎంతటి గొప్ప కవి హృదయం? ...

... ప్రశ్నించండి

వంశీ కలుగోట్ల // ... ప్రశ్నించండి // *****************************           సంక్షేమపథకాలు అమలు చేయడంలో, సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకురావడంలో బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఎవరూ బీట్ చేయలేరేమో. గతంలోనూ సంక్షేమ పథకాల ప్రకటన ఇబ్బడిముబ్బడిగా జరిగేది కాకపొతే అధికశాతం ప్రకటనలతోనే సరిపోయేది, వాటి అమలు అనేది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే గుర్తుకు వచ్చేది. ఇపుడు అలా కాదు అమలు కూడా, అది కూడా యుద్ధప్రాతిపదికన అన్నట్టుగా జరుగుతున్నాయి. జనాలు మెచ్చుకుంటున్నారు, పల్లకీల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టు మోస్తున్నారు. నచ్చనివాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు.           నాకు తెలిసి, ఎవరూ చేయనిపని ఏంటంటే 'ప్రశ్నించడం'. ఇన్ని సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇపుడు సంక్షేమపథకాలు పేరిట అందినకాడికి తీసుకుంటున్నాం కదా సంబరపడితే, రేపటిరోజున మనమో, మన పిల్లలో ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నుల రూపంలో కట్టుకోవలసినదే ఈ బాకీ అంతా. పథకాల అమలుకు మెచ్చుకుని, మోస్తున్నవారు కానీ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నవారు కానీ రాష్ట్రం ఉత్పాదక...

... రెండు ప్రశ్నలు

వంశీ కలుగోట్ల // ... రెండు ప్రశ్నలు // ********************************             ఇవాళ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి - రెండు విభిన్న పోస్ట్ లలో. మొదటిది నిజానికి ప్రశ్న కాదు, దాదాపు 98% మంది మీడియా పట్ల కలిగి ఉండే స్థిరాభిప్రాయం. రెండవది అమాయకత్వం అనిపించింది. నాకు తెలిసిన/అనిపించిన వివరణ ఇస్తున్నాను.  * ఒక పత్రికలో లేదా మీడియా గ్రూప్ లో వచ్చేవన్నీ అబద్ధాలే అవుతాయా?             మన దగ్గర ఒక్కో మీడియా గ్రూప్ కు సంబంధించిన యాజమాన్యానికి ఒక పార్టీ లేదా సిద్ధాంతం పట్ల అభిమానం ఉంటుంది. ఆ మీడియా గ్రూప్ లో పనిచేసే సిబ్బందికి, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, పత్రికా విలువలు కంటే యాజమాన్యం అభీష్టానికి అనుగుణంగా పనిచేయడమే రావాలి. అలాంటివారే ఉంటారు. అయితే ఇదంతా మాక్సిమం స్థానిక రాజకీయాల వరకే పరిమితమై ఉంటుంది, కొన్నిసార్లు స్థానికంగా ప్రభావితం చేయగల జాతీయ రాజకీయ అంశాలు/పార్టీల పట్ల కూడా అది కనబడుతుంది. అవి కాక మిగతా అంశాలు అవి తాము అభిమానించే పార్టీలను ప్రభావితం చేస్తాయని అనుమానపడనంతవరకూవాటిపట్ల ఒక ప్రత్యేకధోరణి కనబడదు - వార్తల్లాగానే అంది...

13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి

వంశీ వ్యూ పాయింట్ // 13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి // *********************************************************             2016 లో వచ్చిన హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లర్ '13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి' - వాస్తవ ఘటనల ఆధారంగా మైఖేల్ బే నిర్మాణం మరియి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. లిబియాలోని  బెంఘాజిలో ఉన్న అమెరికన్ డిప్లొమాటిక్ ప్రాంతాన్ని, దుండగుల/ఉగ్రవాదుల దాడి నుండి కాపాడటానికి 'గ్లోబల్ రెస్పాన్స్ స్టాఫ్' (జిఆర్ఎస్) అనే ఆరుగురు ప్రైవేట్ సెక్యూరిటీ టీం మెంబెర్స్ చేసే ప్రయత్నమే '13 అవర్స్'.             కథ పరంగా చెప్పుకోవాలంటే ముందే చెప్పినట్టు వాస్తవంగా జరిగిన అంశాలను దాదాపుగా అలానే తెరకెక్కించారు అని చెప్పవచ్చు. మొదటి సగభాగం నెమ్మదిగా సాగినట్టనిపిస్తుంది. తరువాత అంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నిజానికి ఇది ఆక్షన్ థ్రిల్లర్ అనేకన్నా ఒక ఎమోషనల్ ఫిలిం అనవచ్చు. జిఆర్ఎస్ మెంబర్స్ మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు బావుంటాయి. ప్లెయిన్ స్క్రీన్ ప్లే వల్ల ఉండాల్సిన ఉత్కంఠత కాస్త లోపించింది అనిపిస్తుంది. ద్వితీయార్...

... లా అబైడింగ్ సిటిజెన్

వంశీ వ్యూ పాయింట్ //... లా అబైడింగ్ సిటిజెన్ // ******************************************             2009 లో విడుదలైన గెరార్డ్ బట్లర్, జెమీ ఫాక్స్ ల ఆక్షన్ థ్రిల్లర్ చిత్రం 'లా అబైడింగ్ సిటిజెన్'. కమర్షియల్ సక్సెస్ తో పాటు, ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంది. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ (గెరార్డ్ బట్లర్) జీవితంలో జరిగిన ఒక ప్రమాదం, ఆ తరువాత అతడు అందుకు కారకులైన వ్యక్తులు మరియు వ్యసస్థలపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్ర కథ. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ ది చిన్న కుటుంబం, సొంతోషకరమైన జీవితం గడుపుతున్న ఆ కుటుంబంపై హఠాత్తుగా ఒకరోజు కొందరు దుండగులు దాడి చేసి - అతడి భార్య, కూతురును (చిన్న పాప) లను రేప్ చేసి, చంపేస్తారు - ఆ సన్నివేశాలను అతడు చూసేలా ఫోర్స్ చేస్తూ. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, దాంతోపాటు ప్రాసిక్యూటింగ్ అటార్నీ అయిన నిక్ రైస్ ఆ కేసును నిర్లక్ష్యం చేస్తాడు. ప్రత్యక్ష సాక్షిగా షెల్టన్ ఉన్నా, అతడు బాధితుడు కాబట్టి అతడి సాక్ష్యాన్ని కన్సిడర్ చేయరు. దోపిడీ మాత్రమే చేద్దామని అన్న ఆమెస్ నిందితుడిగా నిరూపించబడి, కఠిన శిక్ష విధింపబడుతుంది. తప్పు ఒప్పుకుని, క్షమి...

... ట్రైటర్ (2008)

వంశీ వ్యూ పాయింట్ // ... ట్రైటర్ (2008) // *************************************             ఇటీవలి కాలంలో అంటే గత రెండు మూడు దశాబ్దాల కాలం నుండి టెర్రరిజం మీద వచ్చినన్ని సినిమాలు బహుశా ప్రేమ మీద కూడా వచ్చి ఉండవేమో అనిపిస్తుంది. అలా తామరతంపరగా వచ్చిన సినిమాల్లో ఒక హాలీవుడ్ ఫిలిం ట్రైటర్ (Traitor), 2008 లో వచ్చిన ఈ సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టినట్టుంది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని మరొక అంశం ఏంటంటే ఈ టెర్రరిజం బేస్డ్ మూవీస్ లో 99% సినిమాల్లో ఇస్లామిక్ టెర్రరిజం అన్నది ప్రధాన అంశం. ట్రైటర్ సినిమా అందుకు భిన్నం కాదు. అయితే ఇందులో ఇస్లాంను రెండు విధాలుగా అర్థం చేసుకున్న రెండు గ్రూప్స్ (లేదా వ్యక్తులు) మధ్య సంఘర్షణగా చెప్పవచ్చు. Steve Martin అందించిన కథలోని ఆ సంఘర్షణను చాలా చక్కగా, జాగ్రత్తగా, ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో దర్శకుడు Jeffrey Nachmanoff విజయం సాధించాడు అని చెప్పవచ్చు.             సమీర్ సుడానీస్ - అమెరికన్ మరియు ఇస్లాం సిద్ధాంతాలను పవిత్రంగా ఆచరించే నిఖార్సైన ముస్లిం వ్యక్తి. అయితే కొన...

... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్

వంశీ వ్యూ పాయింట్ // ... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్ // ************************************************             సీక్రెట్ ఏజెంట్ మూవీస్ లో ఆక్షన్ కు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ కు, డ్రామాకు, సెంటిమెంట్ (దేశభక్తి)కు మంచి స్కోప్ ఉంటుంది. నిజానికి ఏ సీక్రెట్ ఏజెంట్ మూవీలో అయినా సెంట్రల్ థీమ్ ఒకటే ఉంటుంది. దేశానికి, ప్రపంచానికి ముప్పు తలపెట్టే ప్రయత్నం చేస్తున్న విలన్ గ్యాంగ్ ను ఏజెంట్ ఎదుర్కొని, వారి ప్రయత్నాలను వమ్ము చేయడం. ఈ స్పై మూవీస్ మొదలైంది 1914 లో The German Spy Peril అనే సినిమాతో. కానీ జనాల్లో ఆసక్తి, కమర్షియల్ స్కోప్ బాగా పెరిగింది మాత్రం ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన 'జేమ్స్ బాండ్' పాత్ర/సినిమాల ద్వారా అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్. జేమ్స్ బాండ్ సినిమా తరువాత స్పై థ్రిల్లర్స్ అన్నీ వాటిని అనుకరించడం మొదలైంది అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ తరువాత, స్పై థ్రిల్లర్స్ మూవీస్లో ఒక డిఫరెంట్ పాటర్న్ లో వచ్చిన సిరీస్ జాసన్ బౌర్న్ సిరీస్ (ఇప్పటికి అయిదు సినిమాలు వచ్చాయి. మొదట మూడు సూపర్ సక్సెస్ కాగా, నాలుగోది పర్వాలేదనిపించిండి, అయిదోది పోయి...

... జాన్ విక్ 3 - పారాబులమ్

వంశీ వ్యూ పాయింట్ // ... జాన్ విక్ 3 - పారాబులమ్ // ***********************************************             జాన్ విక్ సిరీస్ మూవీస్ తెలుసనుకుంటా ... కీను రీవ్స్ కి మళ్ళీ స్టార్డం వచ్చేలా చేసిన చిత్రం జాన్ విక్ మొదటి భాగం. ఒక ఎమోషనల్ ఆక్షన్ థ్రిల్లర్. నాకు బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ అంతగా అనిపించలేదు. రెండ్రోజుల క్రితం మూడో భాగం John wick 3: Parabulum చూశాను. నేను జనరల్ గా ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడతాను. నా ఆల్ టైం ఫెవరెట్ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే కిల్ బిల్ 1 & 2. వాటి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే హింసాత్మక కావ్యంలా ఉంటాయని చెప్పవచ్చు. వయోలెన్స్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించవచ్చు అని నాకు కిల్ బిల్ సినిమా చూశాకే తెలిసింది. నేను ప్లాన్ చేసుకుంటున్న ఒక ఫ్యాక్షన్ మూవీ లో ఆక్షన్ సీన్స్ కిల్ బిల్ స్ఫూర్తితో ఉంటాయని ఇపుడే చెప్తున్నా. ఓకే ... ఇపుడు జాన్ విక్ 3 సినిమాకు వద్దాం.             రూల్స్ ని బ్రేక్ చేసిన జాన్ విక్ పై హై టేబుల్ (అంటే హై కమాండ్ - బాస్ అఫ్ ది అండర్ వరల్డ్ అనుకోండి) ఎక్స్ కమ్యూనికాడో డి...

... వైద్యో నారాయణో హరిః

వంశీ కలుగోట్ల // ... వైద్యో నారాయణో హరిః // *************************************** ఇపుడు జరుగుతున్న విషయం చెప్తాను.             పరిస్థితి ఎలా ఉందంటే కాస్త దగ్గో, జలుబో, ఒళ్ళు వెచ్చబడటమో జరిగితే లోలోపల దడ పుడుతోంది. అలాగని వెంటనే హాస్పిటల్, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళటానికి కూడా భయం. మరేం చేయాలి ... ??? అపుడు గుర్తొస్తారు మన ఫ్రెండ్స్ లో డాక్టర్స్ లేదా తెలిసిన డాక్టర్, మన ఫ్రెండ్స్ డాక్టర్ - ఇలా వాళ్ళకు ఫోన్ చేసి వివరాలు చెప్పి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు, అదీ రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే భయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రైవేట్ (వెల్, ప్రైవేట్ అనేకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనాలేమో) హాస్పిటల్స్ సాధ్యమైనంత దండుకుంటున్నాయి. నిజానికి సీరియస్ కండిషన్ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండి, డాక్టర్స్ సలహాలతో మందులు తీసుకుంటూ ఉండవచ్చు అని ప్రభుత్వాలు స్పష్టం చేసినప్పటికీ జనాలు పట్టించుకోవడం లేదు.             ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే ఆ డాక్టర్ ఫ్రెండ్స...