... సంక్షేమ పథకాల ఆవశ్యకత
వంశీ కలుగోట్ల // ... సంక్షేమ పథకాల ఆవశ్యకత //
*********************************************
చాలాసార్లు మనం అనుకుంటుంటాం - ఈ ప్రభుత్వాలేంటి సంక్షేమ పథకాల పేరిట టాక్స్ మనీ అంతా ఎవరెవరికో ఇస్తున్నాయి, ఏంటి ఈ ధోరణి అని. మొన్నామధ్య కెసిఆర్ గారు హెలికాప్టర్ మనీ అని ఒక విధానం గురించి ప్రస్తావించారు - అంటే ఏంటీ హెలికాప్టర్స్ లోంచి డబ్బులు చల్లుతారా ఏంటి కొంపదీసి అని డౌట్ వచ్చింది. దాని గురించి కాస్త చదివితే అర్థమయింది. ఆర్ధిక పరిస్థితి ఇలాంటి విషమ పరిస్థితిలోకి జారుకున్నపుడు, ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి అనుసరించే ఒకానొక మార్గం అని. రాండమ్ గా ఎంపిక చేసిన కొన్ని అకౌంట్స్ లోకి ప్రభుత్వమే డైరెక్ట్ గా కొంత నగదును డిపాజిట్ చేస్తుంది, తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది (ఇక్కడ వారు కొనేలా ప్రోత్సహించవలసిన ఆవశ్యకత కూడా ఉంది - అది కూడా చేస్తారు). ఆ డబ్బులో అధిక భాగం తిరిగి మళ్ళీ వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. ఇబ్బందుల్లో ఉంన్నామనుకున్నవారికి కాస్త ధైర్యం వచ్చి, నెమ్మదిగా పనిలో పడటమో లేదా మరోటో మొత్తానికి ఆర్ధిక వ్యవస్థ చక్రం మళ్ళీ తిరగటం మొదలు పెడుతుంది.
ఇపుడు మళ్ళీ మొదటి వాక్యానికి వద్దాం - అదే సంక్షేమ పథకాల గురించి. ప్రభుత్వాలు ఇలా ఉద్దర డబ్బులు జనాలకు ఇచ్చి, వారిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి అన్నది అత్యంత సాధారణంగా అందరూ అనుకునేది. హెలికాప్టర్ మనీ విధానం గురించి చదివేంతవరకూ నేనూ అదే అనుకున్నాను. హెలికాప్టర్ మనీ విధానం గురించి చదివిన తరువాత, సంక్షేమ పథకాల తీరు లోగుట్టును విశ్లేషించటం మొదలుపెట్టాను. ఓట్లు తెచ్చేవన్నీ దండుగ అని అనుకోవడం కడుపు నిండిన "పెద్దల" ఫ్యాషన్. సంక్షేమ పథకాలు స్థూలంగా రెండు రకాలు - మొదటి దాంట్లో consumption funding అనగా ఉన్న రొక్కం పంపిణీ. ఇటువంటివి కడు నిరుపేదలకు ఊరట కలుగుతున్నప్పుడు మాత్రమే ఉండడం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ తరహా సంక్షేమ పథకాలు పెట్టుబడి నిర్మాణానికి దోహదం చేసేవి. ఉదాహరణకు రైతు బంధు, ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి విద్యుత్తు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ వంటివి. ఇవి ప్రజోపయోగం కొరకు వనరులను మెరుగయిన పంపిణీతో పాటు ఆయా వర్గాల రాబడి అవకాశాలను మెరుగుపరచుతాయి. ఇది మన రాష్ట్రం, పక్క రాష్ట్రం అని కాదు - ఎక్కడైనా. ఉదాహరణకు - అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో నిరుద్యోగ భృతి వంటివి. ఈ సంక్షేమ పథకాల ద్వారా ఒక చేత్తో ఇచ్చే డబ్బును, వాటి స్వీకర్తల ద్వారా రకరకాల మార్గాల ద్వారా తిరిగి రాబట్టే మార్గాలు ప్రభుత్వాలు ముందే సిద్ధం చేసుకుని ఉంటాయి అని ఇపుడు అర్థమవుతోంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం అంటారేమో కొందరు, ఆ డబ్బు బ్యాంకు చేతిలో అనగా మళ్ళీ ప్రభత్వం దగ్గరే ఉంటుంది. ఏదో ఒక పది పదిహేను శాతం మాత్రం జనాల కట్టడిలో ఉండిపోవచ్చు.
అలా అని సంక్షేమ పతాకాలు అవసరమే అని, అవి మంచివే అని చెబుతున్నాననుకుంటే తప్పులో కాలేసినట్టే. సంక్షేమ పథకాలనేవి పార్టీలకు వోట్లు రాల్చేవి, తమ పార్టీ అనుయాయులను ఆర్ధికంగా బలంగా కుదురుకునెలా చేసేవి. సంక్షేమ పథకాల ప్రకటన, అమలులో ఖచ్చితంగా 'విభజించి పాలించు' అన్న సూత్రమే ఆచరించబడుతుంది, అందులో ఎటువంటి అపోహలూ వద్దు. సంక్షేమ పథకాల ఫలాలు అందుకునేవారిలో దగ్గర దగ్గరగా సగం మంది అనర్హులే ఉంటారు. కానీ అర్హులకూ అందుతాయి, అది ఏ పార్టీవారైనా, అందరికీ కాకపోయినా కొందరికైనా. సంక్షేమ పథకాలు అనేవి మంచివా, అవసరమా - అంటే నా దృష్టిలో ఆ రెండింటికి సమాధానం అవును అనే అంటాను. అమలులో, ఆచరణలో చిత్తశుద్ధి, పారదర్శకత ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. సమాజంలో రెండే వర్గాలు ఉండాలి అన్న నిజాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు కూడా నిరూపిస్తున్నాయి - ఆ రెండు వర్గాలు ఒకటి అమ్మేవారు, రెండు కొనేవారు. వందమంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని నమ్మే దేశంలో అది ఖచ్చితంగా మంచిపనిగానే భావించబడుతుంది.

"వందమంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని నమ్మే దేశంలో అది ఖచ్చితంగా మంచిపనిగానే భావించబడుతుంది."
ReplyDeleteVery much true 👍👍
పని చెయ్యలేని వయసులో, స్థితిలో ఉండే వాళ్ళకు ఇచ్చే సహాయాన్ని సంక్షేమం అనవచ్చు కాని ఓట్ల కోసం ఇచ్చేది లంచమే అనాలి. ఓటర్లు కూడ తాయిలాలకి అలవాటు పడిపోయారు.
ReplyDeleteఅభివృద్ధి చెందిన దేశాల్లో కొత్తగా చెయ్యడానికి పెద్దగా ప్రాజెక్టులు ఉండవు. కాని మన దేశంలో చెయ్యవలసిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిమీద ఖర్చు చేస్తే అందరికీ పని దొరుకుతుంది, దేశం కూడ అభివృద్ధి చెందుతుంది.
ఒక్క రైల్వే శాఖ లోనే కావలిసినంత పని ఉంది.
Helicopter money, quantitative easing వగైరాలు ఆర్ధిక/ద్రవ్య పాలిసీ సంబంధిత విషయాలు. These are *not* to be considered "welfare measures".
ReplyDeleteఓట్లు తెచ్చేవన్నీ దండుగ అనుకోవడం కడుపు నిండిన "పెద్దల" ఫ్యాషన్. ప్రజాస్వామ్యంలో బహుళ జనావళి మెచ్చినవి జరగడమే కరెక్ట్.
సంక్షేమ పథకాలు స్థూలంగా రెండు రకాలు. మొదటి దాంట్లో consumption funding అనగా ఉన్న రొక్కం పంపిణీ తప్ప కొత్తగా పెద్దగా ఒరిగేది ఉండదు. ఇటువంటివి కడు నిరుపేదలకు ఊరట కలుగుతున్నప్పుడు మాత్రమే ఉండడం బెటర్.
ఇంకో తరహా "సంక్షేమాలు" పెట్టుబడి నిర్మాణానికి దోహదం చేసేటివి. ఉ. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి విద్యుత్తు, ఇంగిలీషు మీడియం ప్రాధమిక విద్య, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ. ఇవి ప్రజోపయోగం కొరకు వనరులను మెరుగయిన పంపిణీతో పాటు ఆయా వర్గాల రాబడి అవకాశాలను ఉదృతం చేస్తాయి.
చౌక బియ్యం, సోఫ్త్వేర్ రాయితీలు వంటి వాటికి కాలం దాదాపు చెల్లిపోయింది. తమ కాళ్ళ మీద తాము నిలబడి నాలుగు రూపాయి సంపాయిస్తున్న యువకులకు పాకెట్ మనీ ఇచ్చేటటువంటి వీటి బదులు ప్రత్యామ్నాయాలను (ఉ. "చిరు"ధాన్యాలు, లైట్ ఇంజనీరింగ్) ప్రోత్సహించడం మొదలు పెట్టాలి.
Well said and I echo your words
DeleteI am updating article with some lines from your comment.
DeleteThanks a lot. I am glad you found my comment useful.
Delete