... ఒక తమ్ముడికి ఉత్తరం

వంశీ కలుగోట్ల // ... ఒక తమ్ముడికి ఉత్తరం //
**************************************
తమ్ముడూ
నీవంటావు, కష్టాలు చుట్టుముట్టాయి, అయినవారు పట్టించుకోవట్లేదు
ఇక దారి లేదు అని
నిష్క్రమించే ఆలోచనలు వెంటాడుతున్నాయిని

కానీ,
కష్టాలు చుట్టుముట్టినపుడు, అవమానాలు ఎదురైనపుడు, అయినవారు అండగా లేనపుడు, కాలం కాలికిందేసి నలిపేయాలని ప్రయత్నించినపుడు

- ఒకడు వివేకానందుడు అయ్యాడు
- ఒకామె సావిత్రి అయింది
- ఒకామె తలైవి జయలలిత అయింది
- ఒకడు అమితాబ్ అయ్యాడు
- ఒకడు చిరంజీవి అయ్యాడు
- ఒకడు ఏ ఆర్ రెహమాన్ అయ్యాడు
- ఒకడు పూరి జగన్నాథ్ అయ్యాడు
- ఒకామె కంగనా రనౌత్ అయ్యింది
.
కష్టాలు చుట్టుముట్టినపుడు
అవమానాలు ఎదురైనపుడు
అయినవారు అండగా లేనపుడు

తమ్ముడా,
కష్టాలు మనుషులకు కాక మాన్లకు వస్తాయా అని ఊరడించను
పోరాడమని మాత్రం చెప్తాను
నీ కష్టాన్ని మరొకరు అనుభవించలేరు
మరి నీ విజయాన్ని ఎందుకు మరొకరు ఆపగలుగుతున్నారు?

తమ్ముడూ నీది ఒక నిండు జీవితం
కష్టం బతుకెంత? దాని ఆయుష్షు ఎంత?
నువ్వు గట్టిగా పోరాడితే పోయే ప్రాణం దానిది
అటువంటి కష్టానికి ఎందుకు కృంగిపోతావు
లే ... జస్ట్ కీప్ గోయింగ్, జస్ట్ కీప్ గోయింగ్

గుర్తుంచుకో తమ్ముడా
... రేపొకరోజున
నువ్వు ఎత్తైన వేదిక మీద నిలబడి ఉంటావు
ఇపుడు నవ్విన వాళ్ళందరూ
... క్రింద నిలబడి చప్పట్లు కొడుతుంటారు

Comments

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన