Posts

... అనుభవం 2

వంశీ కలుగోట్ల // ...  అనుభవం  : 2// **********************************               నేనే సీనియర్ని, నాది నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం అంటూ ప్రతిసారీ ప్రస్తావించకండి బాబు గారు ... క్రింద పేర్కొన్న అతి కొన్ని అంశాలను పరిశీలించుకున్నపుడు అది అనుభవమా ఆక్కూర కట్టా అనుకోవాల్సిందే  -> 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను వేరే పార్టీ ద్వారా సంక్రమించిన వారి సభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే మీ పార్టీలోకి తీసుకున్నపుడు; అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చినపుడు  -> ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడినపుడు  -> దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అంటూ దళితుల మనోభావాలను కించపరిచేవిధంగా మాట్లాడినపుడు  -> వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా ఘటన జరిగిన గంటలలోపే ప్రతిపక్షం వారి హత్యారాజకీయాలను సహించను అంటూ చిత్తూరు మేయర్ హత్య ఘటనలో మాట్లాడి, ఆ తరువాత హత్య చేసినది తెదేపా సభ్యుడు మరియి స్వయానా మేయర్ మేనల్లుడు అని తెలిసినపుడు స్పందించకుండా ఉన్నపుడు...

... వాడు - వీడు: మనోభావాలు

వంశీ కలుగోట్ల // ... వాడు - వీడు: మనోభావాలు //  *************************************************** వాడు: అరేయ్ ఇట్రా  వీడు: అరేయ్, ఒరేయ్ అనకు. మా మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: ఉన్నట్టుండి ఏమైంది? తిక్కతిక్కగా ఉందా?  వీడు: అలా అనకు, తిక్కోళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: అసలు ఏమనుకుంటున్నావురా? వీడు: అలా అనకు, ఏమీ అనుకోని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: ఓరి దేవుడో, ఏందీ ఈ గోల  వీడు: అలా అన్నావంటే, దేవుడిని నమ్మేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: నీ ... వద్దులే, ఈ పెంటతో నాకెందుకు వీడు: అలా అన్నావంటే అస్సలు బావోదు. పెంట సంబంధిత పనులు (లెట్రిన్ గుంతలు క్లీనింగ్ గట్రా చేసేవారు) చేసేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు పనిమానేస్తే కష్టం.  వాడు: అసలేమైంది నీకు? ఈ మధ్య ఆర్జీవీ సినిమా ఏమైనా చూశావా?  వీడు: నీకు దండం ఉంటాది. ఈ ప్రపంచంలో ఎవరి మనోభావాలనైనా దెబ్బ తియ్, పర్లేదు. మహా అయితే కేసులు పెడతారు, దాడులు చేస్తారు. కానీ ఆర్జీవీ మనోభావాలను దెబ్బ తీయకు. దెబ్బ తిన్న...

... కిం కర్తవ్యం?

వంశీ కలుగోట్ల // ... కిం కర్తవ్యం? // ****************************** *****             అనుకున్నంతా అయింది తెలుగుదేశం ఓడిపోయింది. అనుకున్నదానికంటే ఘోరంగా ఓడిపోయింది. తెలుగుదేశానికి ఓటమి కొత్తేమీ కాదు కదా. 1989, 2004, 2009 ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఓటమి ఎరుగని పార్టీ అంటూ ఉందా? ప్రజాస్వామ్యవ్యవస్థలో గెలుపోటములు భాగమే. కానీ, ఎందుకో గత ఓటముల సమయంలో కనబడని నైరాశ్యం ఇపుడు ఎక్కువగా కనబడుతోంది. ఓటమి ఖచ్చితంగా బాధిస్తుంది. కానీ, ఈ ఓటమి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఒక కీలక మలుపు వంటిది. ఒకసారి గతం పరిశీలిస్తే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వయసు పైబడుతున్న సమయంలో తరువాత ఎవరు అన్న ప్రశ్న ఉదయించకముందే వెన్నుపోటు లేదా నాయకత్వ మార్పుతో చంద్రబాబు ఆ స్థానం చేజిక్కించుకోవడంతో చర్చకు ఆస్కారం లేకపోయింది. ఇంతవరకూ ఎదుర్కోని 'తరువాత ఎవరు?' అనే ప్రశ్న తెలుగుదేశపు భవిష్యత్తు ముంగిట ఉదయించేలా చేసింది ఈ ఓటమి. బహుశా, గెలిచి ఉంటే లోకేష్ రుద్దబడి ఉండేవాడేమో. కానీ, ఈ ఓటమి అతడి సామర్థ్యాన్ని ప్రశ్నర్థకం చేసింది. సభ్యుడిగా ఉండటం వేరు, పార్టీని నడిపించటం వేరు. అందునా తన...

... మాది రాయలసీమ

వంశీ కలుగోట్ల // ... మాది రాయలసీమ //  ************************ ****************** రాయలసీమ రౌడీలు  కడప రౌడీలు  పులివెందుల గూండాలు              ఇవీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు మహా ప్రముఖ నటులు, జనసేనాని అనేక సందర్భాలలో వాడిన పదాలు. నిజంగా రాయలసీమవాసులు వారు పేర్కొనేంతటి కరడుగట్టిన రౌడీలు అయ్యుంటే, రాయలసీమలోకి వచ్చాక సరిహద్దులు దాటి అడుగు బయటకు పెట్టగలిగేవాళ్ళు కాదు. కానీ, తన మీద హత్యాయత్నం చేసిన ప్రాంతం వారిని జగన్ ఏనాడూ రౌడీలనో, హంతకులనో  అనలేదు. ఒక్కరి/కొందరి చర్యలకు, ప్రాంతానికి సంబంధం లేదన్న కనీసపాటి విజ్ఞత లేని వాడిలా ప్రవర్తించలేదు. జరిగిన ప్రతి ఘటననూ ప్రతిపక్షానికే ఆపాదించి, రాయలసీమ రౌడీలని (తనదీ రాయలసీమేనన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా) ఆయన అనటం; ఆ తరువాత కొన్నాళ్ళకు పులివెందుల గూండాల చర్యలను సహించనని జనసేనాని తందానా తాళమేయడం. ఇంతా చేసి ఆ ఇద్దరి మీదా ఎటువంటి వ్యక్తిగత దాడి కూడా వారు పేర్కొంటున్న ప్రాంతాల వారు చెయ్యలేదు, ఇక ఆ నటుడిపై జరుపడిందని చెప్పబడుతున్న దాడి కూడా ...

... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు

వంశీ కలుగోట్ల // ... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు //  ***************************************************             ఓడిపోయినవాళ్ళు  కొందరు  జనాలనుతిడుతున్నారు. డబ్బు పంచలేదు, సారా తాపలేదు కాబట్టి ఓడిపోయాం; మతం, కులం పని చేశాయి గట్రా అంటూ తెగ బాధపడుతూ జనాలను కించపరుస్తున్నారు. అయినా మీ అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చేదాకా జనాలు పట్టని మీరా జనాలను గురించి మాట్లాడేది. ఒక్క విషయంరా అబ్బాయిలూ మరియు అమ్మాయిలూ జనాలను విమర్శించటమంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఓటమిని హుందాగా అంగీకరించండి. జనాలకు నిజాయితీ కంటే ఎక్కువగా ఆదుకుంటారన్న భరోసా కలిగించగలగాలి. మంచితనం కంటే ఎక్కువగా సమర్థత అవసరం. మంచోడివైతే, నిజాయితీపరుడివైతే గౌరవిస్తారు - కానీ, పాలించాలంటే సమర్థత కావాలి.              నాకు ఇక్కడ సగటు విద్యార్థి తీరు గుర్తొస్తోంది - 'దేవుడా ప్రతి శనివారం గుడికొస్తాను, గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను, నూటొక్క టెంకాయలు కొట్టాను, ఇంకా చాలా చేసాను అయినా నేను ఫెయిల్ అయ్యాను; ఏనాడూ గ...

... వోటింగ్ అయ్యాక

వంశీ వ్యూ పాయింట్ // ... వోటింగ్ అయ్యాక // ********************************************** వోటింగ్ ప్రకియ ముగిసి అప్పుడే రెండు రోజులైంది. వోటింగ్ సరళిని గమనిస్తే % పరంగా మంచి సంఖ్యా నమోదైందని చెప్పవచ్చు. కొన్ని అంశాలు పరిశీలిస్తే  -> ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన ముందరి అంచనాలకంటే వోట్లు ఎక్కువ తెచ్చుకునేట్టే కనబడుతోంది. కానీ, అది సీట్ల సంఖ్యాపరంగా ప్రభావం చూపేంత స్థాయిలో ఉంటుందా అన్నది మాత్రం అనుమానమే. అంచనాల ప్రకారంగా చూస్తే, ఒకటిరెండు సీట్లు పెరగొచ్చేమో, అదే సమయంలో కొన్ని చోట్ల ఇతరుల అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. నేను స్వయంగా తెలుసుకున్న ప్రాంతాలలో ఈ వోట్ చీలిక అన్నది తెదేపా వోట్ బ్యాంకు నుండి జరిగినది కాబట్టి అది తెదేపాను దెబ్బతీసేదిగా ఉండొచ్చు. ఇది పవన్ కు ఖచ్చితంగా మంచి అంశమే. ఒకవేళ పవన్ కనుక గతంలోలా కాక నిబద్దతతో రాజకీయరంగానికి అంకితమై వుంటే, 2024 నాటికి రెండో ప్రధాన ప్రత్యామ్నాయం కాగలడు, అఫ్ కోర్స్ అది పవన్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది.  -> ఇక పోలింగ్ ముగిసిన తరువాత నుండి చంద్రబాబు వ్యవహారశైలి, ఈసీపై విమర్శలు తెదేపా అవకాశాలపై ఇప్పటిక...

... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు

వంశీ వ్యూ పాయింట్ // ... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు //  ***************************************************************             రాజకీయాల్లో నేరారోపణలు అన్నది ఒక రకంగా క్లిష్టమైన అంశం - ఎందుకంటే ఇవాళ రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. కేవలం అవినీతి అన్నది ఒక్కటే అంశం కాదు ఇపుడు. కేసుల విషయం అంటే - అవతలి వ్యక్తిని దెబ్బ తీయటానికి, ఇవతలి పక్షం వారు లేదా అధికారంలో ఉన్నవారు ఏదో ఒక కేసు పెట్టి, అధికార వ్యవస్థలను మేనేజ్ జైలు లో ఉంచవచ్చు. అతగాడి మీద నిజంగానే అబద్ధపు ఆరోపణలు చేయబడి ఉండవచ్చు, కొన్నాళ్ళ తరువాత అవి నిక్కంగా అబద్ధం అని తేలితే? మనం నమ్మే పరిస్థితుల్లో లేము ఎందుకంటే, ఇపుడు మనమెవరమూ నిజాయితీగా లేము, పార్టీలను/వ్యక్తులను అభిమానించే వారిగా విడిపోయాము. నిందారోపణలు నిరూపించబడి, శిక్షను అనుభవించిన (శిక్షకు, నిర్బంధానికి తేడా తెలుసుకోవాలి) వారిని కూడా అభిమానిస్తున్న రోజులివి. రేప్పొద్దున ఇవాళ సచ్చిలుడుగా పేరొందిన వారు ఎవరైనా, నిందలు నిరూపింపబడి జైలుకెళ్ళినా అది మనం రాజకీయ కక్ష సాధింపుగానే చూస్తాం. ఎందుకంటే సాధారణం...