Posts

జబర్దస్త్ గురించి

వంశీ కలుగోట్ల // ... జబర్దస్త్ //  ****************************** పురాణాలలో కొన్ని కథలు విని ఉంటాం. అందులో ఎలా ఉంటుందంటే దేవుడిని విపరీతంగా పూజించే భక్తుడికంటే, దేవుడిని దూషించే వాడికే దేవుడు ప్రత్యక్షమవుతాడు లేదా దర్శనమిస్తాడు. దాన్ని ప్రశ్నించిన భక్తుడికి దేవుడు చెబుతాడు - 'నువ్వు అవసరం ఉన్నప్పుడో లేకపోతే నిర్దిష్ట సమయాల్లోనో నన్ను తలచుకుంటున్నావు కానీ వాడు అలా కాదు నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు అందుకే వాడు మరణానంతరం నా లోకంలో నా సమక్షంలో సకల సుఖాలనుభవిస్తాడు' అని వివరిస్తాడు. ఈ జబర్దస్త్ గోలలో నాకొకటి అనిపిస్తోంది... ఈ జబర్దస్త్ ను ఎవరైతే అధికంగా విమర్శిస్తున్నారో వారే మళ్ళీ మళ్ళీచూస్తూ, షేర్ చేస్తూ ఆ టి.ఆర్.పి రేటింగ్ లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతున్నారు. ఈ జబర్దస్త్ బాగా ప్రాచుర్యం పొందాక హేవిటో అది అనుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశాను (అది కూడా చాలాకాలం క్రితం). అందులోని వెకిలితనం, బూతు, అశ్లీలత, వెటకారం తదితరాలు నాకు నచ్చలేదు. అప్పటినుండి ఇప్పటివరకూ మళ్ళీ చూడలేదు కూడా. అంతే కాదు, సాధ్యమైనంతవరకూ నా చుట్టూ ఉన్నవారికి దాన్ని చూడొద్దని చెప్పటానికే ప్రయత్నించాను. నాకు బ...

... ఆర్జీవీ

వంశీ కలుగోట్ల // ... ఆర్జీవీ // ************************* Don't walk like you rule the world, walk like you don't care who rule the world. రాం గోపాల్ వర్మ - పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పట్లో అయితే కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. కానీ ఎప్పుడైతే ఆర్జీవీ సామాజిక మాధ్యమపు గోడలెక్కడం మొదలెట్టాడో, అప్పటినుండి అందరికీ తెలిసిపోయాడు. తెలిసిపోవడమే కాదు ఒక ఇజమై కూచున్నాడు. నిజాయితీగా మాట్లాడతాడు అని కొందరు, నోటికొచ్చింది మాట్లాడతాడు అని కొందరు - ఇలా ఆర్జీవీని ఇష్టపడేవారు, ఇష్టపడనివారుగా ఏర్పడ్డారు. నిన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే విత్ ఆర్జీవీ' ప్రోగ్రాం కాసింత చూశాను. గతంలోనూ కొన్ని ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూశాను. వాటికీ, వీటికీ తేడా ఉందనిపించింది. విషయం గురించి కాదు, వర్మ గురించి. 'నేను అందరిలా కాదు' అనుకోవడం వేరు, 'నేను అందరికంటే వేరు' అనుకోవడం వేరు. నేను అందరిలా కాదు అనుకునేవాడు తనపని తానూ చేసుకుపోతాడు, నేను అందరికంటే వేరు అనుకునేవాడు అందరినీ కెలుకుతుంటాడు. నేను అందరిలా కాదు అనుకునే దశనుండి నేను అందరికంటే వేరు అనుకునే దశకు ఆర్జీవీ వచ్చాడ...

... గురువింద గింజలు

వంశీ కలుగోట్ల // ... గురువింద గింజలు // ****************************************** -> మన ఆర్కే గారున్నారే అదేనండీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొన్నామధ్య కోర్టుకు తన లాయర్ల ద్వారా వినతి పంపించారు ఏమిటంటే 'వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వండి' అంటూ, అదీ ఎప్పుడు అంటే సదరు న్యాయస్థానం వారు వ్యక్తిగతంగా ఆర్కే గారు హాజరు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల. కారణాలేంటయ్యా అంటే, శాసనసభ సమావేశాలను కవర్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నారట. పాపం ఆయన ఫీల్డ్ జర్నలిస్ట్ కదా, ఉదయాన్నే నిద్ర లేవగానే తినీ తినకుండా లగెత్తుకుని శాసనసభ దగ్గరకెళ్ళి రాత్రి వరకూ అక్కడ కెమెరాలు మోసుకుంటూనో లేక కాయితాలు పట్టుకుని రాసుకుంటూనో తెగ బిజీగా ఉంటున్నారు కాబోలును. ఇదే ఆర్కే గారు ప్రతిపక్షనేత జగన్ గారు పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని కోర్టును అభ్యర్థించినపుడు రాసిన విశ్లేషణలు ఆయనకు చూపితే ఎలా ఉంటుంది? ఆ అవన్నీ పట్టించుకుంటే ఆయన ఆ స్థాయిలో కూచుని అంత కమ్మగా అనగా హాయిగా ఎలా ఉంటారులెండి.  -> మన కత్తి మహేష్ గారున్నారు కదా ... పవన్ కళ్యాణ్ గారిపై విమర్శల జడివాన కురిపించి ప...

'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి)

వంశీ కలుగోట్ల // 'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి) // *************************************************************                       మన (అంటే స్వీయ గౌరవం అన్నమాట) దగ్గర ఒక మాంచి ఊర మాస్ మసాలా సినిమా కథ ఒకటుందబ్బా. ప్రతి సీన్ కేకో కేకస్య, కేకభ్యహ అన్నట్టు ఉంటాది. కావాలనుకుంటే సదువుకోండి ...             ఓపెనింగ్ సీన్ లో మన హీరోవోడు ఒక సేతిలో గొడ్డలి, మరో సేతిలో మా సినిమా యూనిట్ ప్రత్యేకంగా తయారు చేసిన ఒక విచిత్ర ఆయుధం పట్టుకుని ఒక రెండు మూడొందల మందిని నరికి పారేస్తాడు. అయినా కూడా మన హీరోవోడికి సిన్న గాయం కూడా కాదు. సీన్ ముగియగానే మన హీరోవోడు ఒళ్ళంతా రక్తంతో (నరికేసినోళ్లదిలే టెన్షన్ పడమాకండి) 'హింస మంచిది కాదు, అది మన ధర్మమూ కాదు, సంప్రదాయమూ కాదు. అహింసను మించిన ధర్మమూ లేదు' అని అరమూసిన కళ్ళతో చెబుతుంటే, మనోడు నరికెయ్యగా మిగిలినోళ్ళు అమాంతం కాళ్ళమీద పడిపోయి 'నీ అంతటోడు లేడు, నువ్వే మాకు గొప్...

'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం

వంశీ కలుగోట్ల //  'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం // ****************************** *****************             కొన్నిసార్లు ఏదైనా 'ఎలా ఉంది' అని అడిగితే చెప్పటం చాలా కష్టం; ఎందుకంటే కొన్ని అద్భుతాలను, అనుభవాలను మాటల్లో వర్ణించడం వీలుకాదు, ఎవరికీ వారు స్వయంగా అనుభూతి చెందాల్సిందే. మన అదృష్టం కొద్దీ అప్పుడప్పుడూ అలాంటివి అనుభూతి చెందే అవకాశం లభిస్తుంటుంది. మన భారతీయ సినిమా రంగం అటువంటి అద్భుతాలను సృష్టించడం మానేసి దశాబ్దాలు అయినట్టుంది. ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని చమక్కులు తప్పించి. చక్కటి కథ అన్నా, అద్భుతం తినాలన్నా, హాలీవుడ్ స్థాయి అన్నా ఇపుడు అంతా గ్రాఫిక్స్ మాయాజాలం మాత్రమే అనే భ్రమలో కొట్టుకుపోతున్నారు 99% మంది. ఆ మిగిలిన 1% లో అధికులు అత్యంత ప్రతిభావంతులైన అనామకులు అనగా అంతగా పేరు, ప్రఖ్యాతులు లేనివారుగా ఉండటంతో వారి ప్రయత్నాలు కూడా ప్రాచుర్యం పొందవు, అటువంటి సినిమాలు వెలుగు చూడవేమో. కానీ, ఆ 1% లో కొద్దిమంది స్టార్స్ కూడా ఉంటారు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటివాళ్ళు. ఎవరో వేరే వారు డబ్బు ప...

... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా

వంశీ కలుగోట్ల // ... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా // ***************************************** -> ఒక సినిమా నటుడు అరవై, డెబ్బై ఏళ్ళు వచ్చినా లేదంటే చచ్చేవరకూ నటిస్తూనే ఉండాలని అనుకుంటాడు. వందిమాగధ గణం, అభిమాన జన సందోహం ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ, కాగితాలు చించి విసిరేస్తూ సంతోషపడుతూనే ఉంటారు. అతగాడు హీరోగానో కాకపొతే కీలక పాత్రలు పోషిస్తూనో నటిస్తూనే ఉంటాడు చచ్చేవరకూ ... -> ఒక క్రీడాకారుడు సత్తువ ఉన్నతవరకూ ఆడాలనే అనుకుంటాడు, ఎదుటోడి బలం పెరిగిందని అనుకుంటాడే కానీ తన సత్తువ తగ్గిందని అనుకోడు. మైదానం వదలాల్సి వచ్చినా శిక్షకుడిగానో, వ్యాఖ్యాతగానో ఉండాలనుకుంటాడే కానీ వీక్షకుడిగా మిగిలిపోవాలనుకోడు. ఊపిరున్నంతవరకూ ఆటతో బంధాన్ని తెంచుకోవాలనుకోడు.... -> ఒక రచయిత/కవి కళ్ళు కనబడి, చేయి పనిచేసినంత కాలం రాస్తూనే ఉండాలనుకంటాడు. పాఠకుడి మేధస్సు పెరగాలనుకుంటాడు కానీ, తన రాతలు అర్థమయ్యేలా లేవని, కాలానికి తగ్గట్టు తానూ మారలేదని ఒప్పుకోడు. పోయేవరకూ ఎదో ఒకటి రాస్తూనే ఉంటాడు ...  ... కార్మికుడు, కర్షకుడు ఇలా ఒకరనేమిటి ఎవరికెవరు వారి వారి రంగాలలో లేదా ఇష్టం/నైపుణ్య...

దేశభక్తి ఎందులో ఉంది?

వంశీ కలుగోట్ల // దేశభక్తి ఎందులో ఉంది? // *************************************             అరేయ్ ఎవర్రా అక్కడ, ఆ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్రఫె మొర్తజాకు ఏసుకోండి వీరతాళ్ళు. ఒకానొక శుభోదయాన కాకపొతే శుభదినాన మొర్తజా గారికి జ్ఞానోదయం అయ్యి 'మాదేముంది డబ్బులు తీసుకుని ఆడుతున్నాం, ఇందులో దేశభక్తీ లేదు తొక్కా లేదు. నిజమైన హీరోలు అంటే కూలీలు, వైద్యులే తప్పించి వేరెవరూ కాదు. వైద్యుడు ప్రాణం నిలబెడతాడు, కూలీ ఇటుకలు మోసి భవనాలు నిర్మిస్తాడు. మేమేమన్నా ప్రాణం పొయ్యగలమా లేక కూలీపని చేయగలమా' అంటూ ఒక చిన్న గొప్ప ఉపన్యాస సందేశమిచ్చాడు. మంచిది, నిజ్జంగానే నిజం చెప్పాడు. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ, మొర్తజా  భయ్యా దేశభక్తి అంటే ప్రాణం పొయ్యడం, ఇటుకలు మొయ్యడమే కాదు; హీరోలు అంటే కూలీలు, వైద్యులు మాత్రమే కాదు . అవును కూలీలు, వైద్యులు గొప్పోళ్ళే మేమేమీ కాదనట్లేదు. అలా అయితే భూమ్మీద కూలీలు, వైద్యులు తప్పించి మిగతావారెవరూ ఉండకూడదు. ఇంకెవడో వచ్చి రైతులు, సైనికులు మాత్రమే హీరోలు మిగినోళ్ళందరూ చెత్త అంటాడు. అపుడు వాడికీ...