Posts

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి  *******************************************************************************             విభిన్న తరహా చిత్రాలతో, వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ తాజా చిత్రం 'రాధ'. ఈ చిత్రం వివరాల్లోకి వెళ్ళేముందు ఒక చిన్నమాట ... సినిమా జనాలందరికీ ఒక చిన్న 'పిచ్చ' ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆ పిచ్చ ప్రతి ఒక్కరిని పట్టి పీడించి తీరుతుంది. ఆ పిచ్చ పేరే 'మార్స్ సినిమాలు. ఇప్పుడు ఆ పిచ్చ కాస్తా శర్వానంద్ కు కూడా పాకినట్టు ఉంది. కాకపొతే శర్వానంద్ కు మొహమాటంతో కూడిన సిగ్గుతో కూడిన భయంతో వచ్చిన జాగ్రత్తవల్ల మరీ పూర్తిగా ఊర మాస్ తరహాలో వెళ్ళటానికి ఇబ్బంది పడినట్టున్నారు. సీసాను కాస్త అటూ ఇటూగా మార్చి అదే మందును పోశారు. 'రన్ రాజా రణ్ కూడా అలాంటిదే అయినా సుజీత్ దర్శకత్వ, చిత్రానువాద (స్క్రీన్ ప్లే) ఆ సినిమాకు ప్రాణం పోసి ఆసక్తిగా చూసేలా చేసింది. 'రాధ' సినిమాకు వస్తే ఆ రెండు అంశాలే ప్రధాన లోపాలుగా మిగిలి నూతన దర్శకుడు చంద్రమోహన్ ప్రత్యేకించి చిత్రానువాదం మీద మరింత పట్టు సాధించాల...

... తొందరపడి

వంశీ కలుగోట్ల // ... తొందరపడి // ***************************** ప్రతిపక్ష నేత జగన్, ప్రధాని మోడీతో సమావేశం గురించి రాష్ట్ర తెదేపా చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. -> మొదటి ఆరోపణ 'ఈ సమావేశం గురించి ముందుగా చెప్పలేదు'. ఎందుకు చెప్పాలి, ఎవరికీ చెప్పాలి? ఆయన చేసే ప్రతిదీ తెదేపాకు చెప్పి చెయ్యాలా!? మరి పెదబాబు, చినబాబు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పర్యటనల (అధికారిక/అనధికారిక) గురించి ప్రతిపక్షానికి ముందుగా సమాచారం ఇస్తారా? -> రెండవ ఆరోపణ, 'కేసులనుండి తప్పించుకోవడానికి మోడీని కలిసారు'. ఒకవేళ వీరన్నట్టు కేసుల విషయంగానే కలిశాడు అనుకుందాం, అయితే ఏమిటట? కేంద్రంలో అనగా మోడీగారి దగ్గర చక్రం తిప్పగల తమ నాయకుడు బాబు ఉండగా జగన్ మోడీ గారిని కలిసి ఉద్ధరించేది ఇంకేముంటుంది? అయినా ప్రతిపక్షనేత ఢీల్లీ వెళ్ళిన ప్రతిసారీ ఇంకే కారణాలూ ఉండవా లేక మోడీగారి దగ్గర బాబు గారి ప్రాభవం ఏమన్నా తగ్గుతోందని అనుమానమా? అనవసర ఉలికిపాటు ఎందుకు? -> మూడవ ఆరోపణ - 'ఈ సమావేశం గురించి చివరికి చాలామంది వైకాపా ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదు'. వారికి సమాచారం ఉందో ల...

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'బాహుబలి 2' గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'బాహుబలి 2' గురించి ****************************** ******************             మొదటగా, తనమీద నమ్మకంతో వందలకోట్లు ఖర్చు పెట్టగలిగే నిర్మాతలను సంపాదించుకోగలిగిన రాజమౌళికి ; రాజమౌళి మీద నమ్మకంతో దాదాపు అయిదు సంవత్సరాలు బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్ నిబద్ధతకు ప్రశంసలు. ప్రశంసించినా సరే లేక విమర్శించాలనుకున్నా సరే సినిమా గురించి తెలిసిన వారిలో అధికశాతం మంది చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా 'బాహుబలి 2'. సినిమా ఎలా ఉంది అన్న విషయం అటుంచి మొత్తం భారత దేశ సినిమా ప్రేక్షకులలో, కొంత స్థాయిలో అంతర్జాతీయ సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా గతంలో లేదు. అందునా చిన్న చూపుకు గురయ్యే దక్షిణాది సినిమా రంగం నుండి; అదీ కాక దక్షిణాది సినిమా అంటే 'తమిళ సినిమా' మాత్రమే అనుకునే బుర్రతక్కువ వాళ్లకు 'ఇది తెలుగు సినెమా, తెలుగోడు తీసిన సినిమా' అని చెప్పుకుంటూ దక్షిణాది సినిమా రంగం అంటే కేవలం తమిళ సినిమా కాదు అని చూపించిన రాజమౌళి ప్రశంసనీయుడు. ఎన్నో దశాబ్దాల నుండి భారతదేశ సినిమా రంగంలో దాదాపు ...

... ఉదయపు కాంతులు

వంశీ కలుగోట్ల // ... ఉదయపు కాంతులు // ************************************* చిన్నప్పుడు, మాకు తెలిసినవాళ్ళ బంధువు కుటుంబం మా ఊరికి వలస వచ్చింది, వాళ్ళున్న ఊరిలో చేసిన అప్పులకు ఉన్న కొద్దిపాటి ఆస్థి కరిగిపోయి, వేరే దిక్కు లేక మా ఊళ్ళో ఉన్న బంధువు ఆదుకుంటాడని వచ్చారు. ఆ తరువాత అతను ప్రతిరోజూ ఉదయం ఊరిలో తిరుగుతూ ఇడ్లీలు అమ్మేవాడు. అలాగే సాయంకాలం బజ్జీలు గట్రా. వాళ్ళ బంధువుల ఇంటికి పక్కనే ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అతను తను ఉంటున్న రూమ్ కొని, మరొక గది కట్టించుకున్నాడు. పాత అప్పులు తీర్చి, మా ఊరిలో వాళ్లకు తనే అప్పులు ఇచ్చాడు. అలా కొంత స్థాయికి బాగానే ఎదిగాడు. (కాకపొతే ఆ ఎదుగుదల విపరీతం కాలేదు - ఒక స్థాయికి ఆగింది.) ఆ తరువాత వాళ్ళు మళ్ళీ నంద్యాలకో లేక కర్నూలుకో వలస వెళ్లి అక్కడ భోజనం హోటల్ పెట్టుకున్నారని విన్నాను.  వారు మా ఊరికి వలస వచ్చేసరికి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది - సినిమా కష్టాలు అంటామే అలా. కానీ, ధైర్యం కోల్పోకుండా నిలబడి పోరాడిన తీరు నాకు నచ్చింది. నేను ఇప్పటికీ అతడి గురించి కొందరికి చెబుతుంటాను - కష్టాలను ఒలకబోసుకు...

... మొలకలొస్తాయ్

వంశీ కలుగోట్ల // ... మొలకలొస్తాయ్ // ****************************** ** సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఇంక భయం లేదురా. మన పొలాల్లో మొలకలొస్తాయిరోయ్ ... అప్పిగాడు: అదేంట్రా సుబ్బిగా, అసలు వానలే పడలేదు; బోర్లల్లో నీళ్లు లేవు. మొలకలెక్కడినుండి వస్తాయి ...!? సుబ్బిగాడు: అది గాదురా అప్పిగా, అక్కడెక్కడో మహారాష్ట్రలో వానలు బడినాయని నిన్న వార్తల్లో సెప్పినారు. అప్పిగాడు: అక్కడ వానలు బడితే, ఇక్కడ మొలకలెట్టా వస్తాయిరా సన్నాసీ ... సుబ్బిగాడు: ఎందుకు రావురా!? అక్కడ మర్దర్లు జరిగితే ఇక్కడ జరుగుతన్నయ్, ఆడ ఎక్కడనో ఎదో సేస్తే ఇక్కడోల్లు ఓట్లేత్తన్నారు. అట్టాటియి జరిగినపుడు ఆడెక్కడనో వాన బడితే ఈడ మొలకలు రావా!? సూత్తా ఉందురోయ్ ... మన పొలాల్లో మొలకలొత్తాయ్

హేవిటో ...

వంశీ కలుగోట్ల // హేవిటో ... // ****************************** -> తిరుమలకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి సకల సదుపాయాలు కల్పించటంతో పాటు, ప్రత్యేకంగా చూసుకోవాలని మన ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ చంద్రబాబుగారు ఆజ్ఞాపించినట్టు; తదుపరి వ్యవహారాలను తానే స్వయంగా చూసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ!? అవునూ, ఇంతకీ అది ప్రేమా లేక భయమా!? -> అదేమిటో తమ్ముళ్ళందరూ శ్రీ కెసిఆర్ గారిని కలిసిన వైకాపా నాయకుల గురించి జోకులేసుకుంటున్నారు కానీ, కెసిఆర్ గారికి కావలసిన ఏర్పాట్లను భయభక్తులతో చూసుకున్న బాబుగారి గురించి మాత్రం (వార్తల ప్రకారం) పల్లెత్తు మాట అనటం లేదు. బహుశా, బాబుగారు ఏది చేసినా సమాజ సంక్షేమం కోసమే తప్పించి ఆయన స్వార్థం కోసం కాదు అనేమో ... ఎంతైనా సూక్తులందు పచ్చ సూక్తులు వేరయా.  -> సిన్నన్నయ్య ఎవరినుద్దేశించి అన్నాడో తెలియదు కానీ వారసత్వాల గురించి కామెంటేసరికి జనాలు తనగురించి తానే కామెంటుకున్న సిన్నన్నయ్యను సూసి అచ్చెరువొందుతున్నారు. -> ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో మాత్రమే రైతు ఋణమాఫీ, ప్రత్యేక నిధులు తదితర ...

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'నేను లోకల్' గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'నేను లోకల్' గురించి ****************************************************           'నేను లోకల్' అంటూ సహజ నటుడు (నాచురల్ స్టార్ అని కదా బిరుదు అందుకని) నాని మన ముందుకొచ్చాడు. గత కొద్దీ సినిమాలనుండి విజయపరంపర కొనసాగిస్తున్న నాని, తన విజయాలను కొనసాగిస్తూనే గతంలో లాగా వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేను లోకల్' ఉండవచ్చునేమో అన్న ఆసక్తే ఈ చిత్రానికి మొదటి అమ్మకపు అంశం అయింది. మరి నాని ఆ అంచనాలను అందుకోగలిగాడా లేదా ... చూద్దాం.           ముందుగా 'నేను లోకల్' చిత్ర కథ గురించి చెప్పుకోవాలంటే తేజ దర్శకుడిగా తెరంగేట్రం చేసిన నాటినుండి రుబ్బి, రుబ్బి వదిలేసిన అంశమే. కాకపొతే ఇటువంటి పాత చింతకాయ పచ్చడి లాంటి కథను సినిమాగా తియ్యాలనుకున్నప్పుడు ముందుగా జనాలను తన నటనలో ఈస్ తో కట్టిపడేసే నటుడిని ఎన్నుకోవాలి. ఈ సినిమాకు అది మొదటి విజయం. ఇక రెండవ అతిముఖ్యమైన అంశం దృశ్యానువాదం (స్క్రీన్ ప్లే) - సాగదీసినట్టు ఉండకుండా, బిగుతైన దృశ్యానువాదంతో చిత్రం పరుగులు పెట్టాలి. సురేందర్ ...