దేవుడు - భక్తులు - మూర్ఖులు
వంశీ కలుగోట్ల // దేవుడు - భక్తులు - మూర్ఖులు // ******************************************* మనలో చాలామందిమి మహేష్ బాబు చిత్రం 'ఖలేజా' చూసి ఉంటాము. అందులో రావు రమేష్ (గ్రామ పెద్ద) మరియు షఫీ పాత్రలు బహుశా గుర్తుండే ఉంటాయనుకుంటా. నటన పరంగా ఇద్దరూ అద్భుతంగా చేశారు. ఆ పాత్రలు ఇప్పుడు సమాజంలో మనకు కనిపించే రెండు అతి ముఖ్యమైన రకాల వ్యక్తులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఒకటి భక్తుడు రెండు మూర్ఖుడు. బహుశా త్రివిక్రమ్ సమాజంలోని ఈ ధోరణులను చూసిన తరువాతే ఆ పాత్రలు రూపు దిద్దాడేమో. 'భక్తుడు' తరహా వ్యక్తులు - ఖలేజా సినిమా గుర్తుంటే అందులో రావు రమేష్ పాత్రధారి గ్రామస్తులందరికీ తమను కాపాడేవాడు ఒకడొస్తాడు, అతడోచ్చాక అంతా మంచే జరుగుతుంది అని చెబుతూ గ్రామస్తులను ఊరిస్తాడు. ఏవేవో పూజలు గట్రా చేస్తుంటాడు. షఫీ పాత్రధారిని దేవుడిని వెతికి తీసుకురమ్మని పంపుతాడు. మహేష్ బాబు వచ్చాక అంటే అదే దేవుడు వచ్చాక 'నువ్వు దేవుడివి సామీ' అంటూ ఆ దేవుడి దైవత్వాన్ని (???) ప్రోమోట్ చేస్తూ ఉంటాడు. సినిమా నుంచి బయటకోచ్చేద్దాం - మీ పరిస్థితి బాగుపడాలంటే, అవినీతి అ...